
సాక్షి, హైదరాబాద్: ప్రజల నుంచి పెద్దమొత్తంలో డిపాజిట్లు వసూలు చేసి, వాటిని తిరిగి చెల్లించకుండా ఎగవేసిన హీరా గ్రూపు అధినేత్రి నౌహీరా షేక్‌ను జైలు నుం చి విడుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. చంచల్‌గూడ జైలులో 6 నెలలుగా రిమాండ్ ఖైదీగా ఉన్న తనను విడుదల చేయాలని చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది.
ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలంటూ పోలీసులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే నౌహీ రాపై నమోదైన కేసుల రికార్డులను తమ ముందుంచాలని న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment