హీరా గోల్డ్ కేంద్ర కార్యాలయంలో సీసీఎస్ పోలీసుల తనిఖీలు
సాక్షి, హైదరాబాద్ : సంచలనం సృష్టించిన హీరా గోల్డ్ కుంభకోణం కేసులో దర్యాప్తును సీసీఎస్ పోలీసు అధికారులు వేగవంతం చేశారు. ఈ శనివారం హీరా గోల్డ్ కేంద్ర కార్యాలయంలో సీసీఎస్ పోలీసు అధికారులు తనిఖీలు నిర్వహించారు. తొమ్మిది మంది సభ్యుల బృందం హీరా గోల్డ్ కేంద్ర కార్యాలయంలో సోదాలు నిర్వహించింది. వందల కోట్ల రూపాయల నిధుల సేకరణపై సీసీఎస్ పోలీసులు ఆరా తీస్తున్నారు. డిపాజిట్ దారుల వివరాలను కంపెనీ గోప్యంగా ఉంచింది.
హీరా గోల్డ్ గ్రూప్ దాదాపు 16 రాష్ట్రాలనుంచి డిపాజిట్ సేకరించింది. ఆనతి కాలంలో ఆరువేల కోట్ల రూపాయల టర్నోవర్ చూపించిన హీరా గోల్డ్ పెట్టుబడులు మొత్తం హవాల డబ్బులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. హీరా గోల్డ్ గ్రూపు దాదాపు 160 బ్యాంక్ ఖాతాలు కలిగి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హీరా గ్రూప్ పెద్దమొత్తంలో సేకరించిన పెట్టుబడులతో విదేశాల్లో వ్యాపారాలు నిర్వహిస్తోందని దర్యాప్తులో తేలింది.
Comments
Please login to add a commentAdd a comment