నవ్‌హీరా షేక్ , సంస్థ అందించిన రూ.కోటి చెక్కు
కలెక్టరేట్: కేరళ రాష్ట్రంలో ప్రకృతి విలయతాండవం చేయడంతో అక్కడి ప్రజలు చెట్టుకొకరు పుట్టకొకరు అన్నచందంగా సర్వం కోల్పోయి విలవిలలాడుతున్నారు. బాధితులను ఆదుకునేందుకు తామున్నామంటూ దయార్ద్ర హృదయులు ముందుకొస్తున్నారు. తమ వంతు సాయంచేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన హీరా గ్రూప్ సంస్థ కేరళ వరద బాధితుల సహాయార్థం కోటి రూపాయల విరాళాన్ని అందిస్తున్నట్లు ఆ సంస్థ చైర్ పర్సన్ నవ్‌హీరా షేక్ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం గన్‌ఫౌండ్రీలోని మీడియా ప్లస్ ఆడిటోరియంలో హీరా గ్రూప్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంస్థ ఇన్‌చార్జి ఫాజిల్ హుస్సేన్ మాట్లాడుతూ.. హీరా గ్రూప్ దేశ వ్యాప్తంగా పలు స్వచ్చంద కార్యక్రమాల్లో పాలుపంచుకుందన్నారు. ఇప్పటి వరకు తమ సంస్థ ప్రకృతి వైపరీత్యాలతో అల్లాడుతున్న ప్రజలకు చేయూతనందించిందని పేర్కొన్నారు. కాశ్మీర్‌లోని ప్రజలు వరదలకు గురైనప్పుడు సంస్థ ద్వారా బాధితులకు సహాయం అందించామన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పిలుపు మేరకు తమ సంస్థ తరఫున కోటి రూపాయల చెక్కును అందజేశామన్నారు.
స్టార్ ఇండియా ఉద్యోగుల విరాళం రూ.5 కోట్లు
వరద బాధితుల సహాయార్థం స్టార్ ఇండియా ఉద్యోగుల రూ.5 కోట్ల విరాళాన్ని సౌతిండియా ఎండీ కె.మాధవన్ కేరళ సీఎం పినరయి విజయన్‌కు అందజేస్తున్న దృశ్యం.
Comments
Please login to add a commentAdd a comment