
వరదలు తగ్గుముఖం పట్టడంతో ఊపిరి పీల్చుకున్న కేరళ ప్రజలకు ఇప్పుడు పాముల భయం వెంటాడుతోంది. పునరావస కేంద్రాల నుంచి ఇళ్లకు చేరుతున్న వారు ప్రళయ బీభత్సం మిగిల్చిన విషాదాన్ని చూసి బోరుమంటున్నారు. వరదలతో ఇళ్లలో నక్కిన పాములను చూసి భయంతో చచ్చిపోతున్నారు. ఇప్పటికే పాము కాట్లతో కొందరు ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది చికిత్స పొందుతున్నారు. మాములుగా చిన్నకీటకాలను చూస్తేనే భయంతో వణికిపోతారు మహిళలు.
అలాంటిది ఓ మహిళ తన ఇంటికి వచ్చిన ఓ కొండచిలువను ధైర్యంగా వెళ్లగొట్టిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. ఇంటి ప్రహారి గోడపైకి ఎక్కిన పామును ఆ మహిళ బూజు కర్రతో వెళ్లగొట్టి తమ కుటుంబాన్ని రక్షించింది. ఏ మాత్రం జంకకుండా పదేపదే కర్రను నేలకు కొడుతూ ఆ పామును వెళ్లగొట్టింది.ఆమె సాహసాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment