
తిరువనంతపురం: బైక్‌లు, షూలు, ఏసీలు, కార్లలో పాములు దూరడం చూసి ఉంటాం. కానీ ఓ పాము ఏకంగా హెల్మెట్‌లో దూరింది. అది గమనించని ఆ వ్యక్తి ఏకంగా తలపైనే విష సర్పాన్ని పెట్టుకొని 11 కిలోమీటర్లు ప్రయాణించాడు. గమ్యం చేరుకునేదాక దానిని చూసుకోలేదు. తీరా స్కూలుకు చేరుకున్నాక చూసుకుంటే తనకేం కానందుకు బతుకు జీవుడా అంటూ ఊపిరి పీల్చుకున్నాడు. కేరళలోని ఓ ఉపాధ్యాయుడికి ఈ వింత అనుభవం ఎదురైంది.
కందానాద్ సెయింట్ మేరీ హైస్కూల్‌లో పనిచేస్తున్న టీచర్ రంజిత్ తన ద్విచక్ర వాహనంపై స్కూలుకు బయలుదేరాడు. ఎప్పటిలాగే బైక్ వద్ద ఉన్న హెల్మెట్ పెట్టుకొని స్కూల్‌ను చేరుకోగానే హెల్మెట్ తీస్తుండగా లోపల ఏదో కదులుతున్నట్లు కనిపించడంతో దాన్ని పరిశీలనగా చూసి షాకయ్యాడు. అందులో ఓ పాము చనిపోయి కనిపించింది. తాను హెల్మెట్ పెట్టుకోవడం వల్లే చనిపోయిందా లేక ఎవరైనా కావాలనే పెట్టారా అనేది తెలియలేదు. రంజిత్‌కు ఆ పాము నుంచి ఎలాంటి ప్రమాదం లేకపోయినా అతడి సహోద్యోగులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు అతడికి రక్త పరీక్ష చేశారు. అయితే ఆ పాము అతడిని కాటేయలేదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment