
పరిస్థితి చక్కదిద్దడంలో గవర్నర్ విఫలం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరస్పర విమర్శలకు దిగటం సరికాదని, ఈ పరిస్థితి చక్కదిద్దటంలో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ విఫలమయ్యారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు...
- గవర్నర్ ఏమీ చేయడంలేదని విమర్శించిన పొన్నం ప్రభాకర్
సాక్షి,తిరుమల : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరస్పర విమర్శలకు దిగటం సరికాదని, ఈ పరిస్థితి చక్కదిద్దటంలో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ విఫలమయ్యారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక పార్టీలో గెలిచినవారు మరొకపార్టీ ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణం చేస్తున్న తరుణంలో రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన గవర్నర్ కూడా ఏమీ చేయలేకపోతున్నారని ప్రజలు భావిస్తున్నారన్నా రు. రెండు రాష్ట్రాల్లో ఏర్పడిన పరిస్థితుల వల్ల శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉంద న్నారు.
ఇందుకు ఆయా రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలు కూడా నేతలకు వత్తాసు పలకటం సరికాదన్నారు. ఇలాంటి తరుణంలో పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్రం కూడా జోక్యం చే సుకోకపోవటం దారుణమన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా దాటవేసేం దుకు ఇద్దరు సీఎంలు పరస్పరం విమర్శలకు దిగుతున్నారని విమర్శించారు. వీరి దూకుడుతో భవిష్యత్ తరా ల్లో వైషమ్యాలు మరింత పెరిగే ప్రమాదం ఉందన్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు శ్రీవారి ఆలయ జీయర్లు, ప్రధాన అర్చకులు రమణదీక్షితులు వంటి ధార్మిక పెద్దలు జోక్యం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.