అధికార నివాసాలు ఖాళీ చేయండి | Parliament Housing Committee orders to Former MP's | Sakshi
Sakshi News home page

అధికార నివాసాలు ఖాళీ చేయండి

Published Fri, May 23 2014 1:17 AM | Last Updated on Sat, Sep 2 2017 7:42 AM

Parliament Housing Committee orders to Former MP's

మాజీ ఎంపీలకు పార్లమెంట్ హౌసింగ్ కమిటీ ఆదేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన ఎంపీలు వచ్చే నెల 18లోగా ఢిల్లీలోని తమ అధికార నివాసాలను ఖాళీ చేయాలని పార్లమెంట్ హౌసింగ్ కమిటీ ఆదేశాలు జారీచేసింది. పెండింగ్ బిల్లులను కూడా చెల్లించాలని కోరింది. 15వ లోక్‌సభను రద్దు చేస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిర్ణయం తీసుకోవడంతో నెల రోజుల్లోగా ఎంపీలు తమ అధికార నివాసాలను ఖాళీ చేయాల్సి ఉంటుందని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.

 కాగా, ఎంపీలకు కేటాయించిన ఫోన్, ఇంటర్‌నెట్ సహా ఇతర సౌకర్యాలను తొలగించారు. జూన్ 18 తర్వాత అధికారిక నివాసాలను ఖాళీ చేయని ఎంపీలు నెలకు అన్ని ఖర్చులను కలుపుకొని సుమారు రూ.1.50 లక్షల వరకు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ ఎంపీలు కొందరు తమ పాత బకాయిలను చెల్లించి, సామగ్రిని తరలించే ఏర్పాట్లలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement