
జగదీశ్‌రెడ్డిని బర్తరఫ్ చేయాలి: పొన్నం
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్సుమెంటు వ్యవహారంలో ముడుపులు తీసుకున్న రాష్ట్రమంత్రి జగదీశ్‌రెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మంత్రి జగదీశ్‌రెడ్డిపై చేసిన ఆరోపణలను నిరూపించడానికి తనకో వేదిక కావాలన్నారు. మంత్రిగా జగదీశ్‌రెడ్డి పదవిలో కొనసాగుతున్నంత కాలం ఈ కేసు విచారణపై ప్రభావం పడుతుందన్నారు. లోకాయుక్త మూడుసార్లు అడిగినా ప్రభుత్వం ఎందుకు నివేదికను ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఓయూ విద్యార్థులపై హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అనుచితంగా మాట్లాడటం మంచిది కాదని హెచ్చరించారు.