
బాలకృష్ణను అనర్హుడిగా ప్రకటించాలి
కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: ఏపీలో ఎమ్మెల్యేగా కొనసాగుతూ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటేసిన ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణపై అనర్హత వేటు వేయాలని ఎన్నికల సంఘానికి గురువారం కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఫిర్యాదు చేశారు. బాలకృష్ణ ఓటు వేయడం చట్ట విరుద్ధమన్నారు. ఏదైనా రాష్ర్టంలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే సంబంధిత రాష్ట్రంలోనే ఓటు హక్కు ఉండాలని ప్రజా ప్రాతినిధ్య చట్టం చెబుతోందన్నారు. ఏపీలోని అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యేగా ఉంటూ తెలంగాణలోని జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటెలా వేస్తారని ప్రశ్నించారు.