కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు లోక్‌సభ మాజీ సభ్యుడు దేవరకొండ విఠల్ రావు (69) కన్నుమూశారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు లోక్‌సభ మాజీ సభ్యుడు దేవరకొండ విఠల్ రావు (69) కన్నుమూశారు. గతకొన్ని రోజులుగా ఆయన ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు.
చికిత్స నిమిత్తం జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చేరిన ఆయన శనివారం చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కాగా, 2004 ఎన్నికల్లో మహబూబ్ నగర్ నుంచి విఠల్ రావు లోక్ సభకు ఎన్నికయ్యారు.