మాజీ ఎంపీకి కన్నీటి వీడ్కోలు | former mp madhusudan reddy funarels | Sakshi
Sakshi News home page

మాజీ ఎంపీకి కన్నీటి వీడ్కోలు

Published Wed, Apr 8 2015 7:24 PM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM

మాజీ ఎంపీకి కన్నీటి వీడ్కోలు - Sakshi

మాజీ ఎంపీకి కన్నీటి వీడ్కోలు

ఆదిలాబాద్ రూరల్: ఆదిలాబాద్ మాజీ ఎంపీ మధుసూదన్ రెడ్డి మంగళవారం గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. ఆదిలాబాద్ పట్టణ సమీపంలోని శ్మశాన వాటికకు ఆయన పార్థివ దేహాన్ని తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ ఎంపీగా ఉన్నప్పుడు ఆయన చేసిన సేవలను పలువురు కొనియాడారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే సి.రాంచంద్రారెడ్డి మధుసూదన్‌రెడ్డి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని రాష్ట్ర మంత్రులు, తదితరులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.

అంతిమ యాత్రలో రాష్ట్ర మంత్రులు జోగురామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి, బోథ్, ముథోల్ ఎమ్మెల్యేలు రాథోడ్ బాపురావు, విఠల్‌రెడ్డిలతో పాటు ఆయన అభిమానులు, బంధువుల, రాజకీయ నాయకులు, టీఆర్‌ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే సీఆర్‌ఆర్, కార్యకర్తలు, బీజేపీ నాయకుడు పాయల శంకర్, సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు రాథోడ్ రామారావు తదితరులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement