లగడపాటీ.. ఇదేంటి! | former mp Lagadapati Rajagopal Re Entry Into Politics?? | Sakshi
Sakshi News home page

లగడపాటీ.. ఇదేంటి!

Published Wed, Feb 17 2016 10:15 AM | Last Updated on Wed, Sep 18 2019 2:56 PM

లగడపాటీ.. ఇదేంటి! - Sakshi

లగడపాటీ.. ఇదేంటి!

విజయవాడ: కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ ఏదో ఒక సంచలనం సృష్టిస్తూ వార్తల్లోని వ్యక్తిగా నిలిచిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజకీయ సన్యాసం విరమిస్తున్నారా.. ఎన్నికల ముందు చేసిన ప్రతిజ్ఞను పక్కనపెట్టి వేరే పార్టీలో చేరనున్నారా! ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని విజయవాడ వీధుల్లో వెలిసిన పోస్టర్లను చూస్తే ఎవరికైనా సందేహం రాక మానదు. ఈ పోస్టర్లపై నటుడు పవన్‌కల్యాణ్, బీజేపీ నాయకుల ఫొటోలు ఉండడం విశేషం.

పొలిటికల్ కలరింగ్ ఇచ్చి బర్త్‌డే జరుపుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటనేది నగరవాసుల్లో చర్చనీయాంశమైంది. ఇంత జరిగినా రాజగోపాల్ మాత్రం పెదవి విప్పలేదు. ఆయన బెంగళూరులో ఉండగా అభిమానులు ఇక్కడి కార్యాలయంలో కేక్ కట్ చేశారు. తమ నాయకుడు రానున్న ఎన్నికలనాటికి తిరిగి రాజకీయాల్లోకి వస్తారని వారు ఘంటాపథంగా చెబుతున్నారు. ఫ్లెక్సీలపై పవన్ ఫొటోలు వేయడంతో రాజగోపాల్ బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని కొంతమంది, వైఎస్సార్ సీపీలో చేరతారని మరికొందరు చెవులు కొరుక్కుంటున్నారు. కానీ లగడపాటి ఇంతవరకు ఆయా పార్టీల ముఖ్య నేతలెవరినీ కలవలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement