
ధరల అదుపులో కేంద్రం విఫలం
బృందాకారత్
సాక్షి, హైదరాబాద్ : నిత్యావసర సరుకుల ధరలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఐద్వా జాతీయనాయకురాలు, మాజీ ఎంపీ బృందాకారత్ విమర్శించారు. గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఐద్వా తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ ్వ ర్యంలో కేంద్ర ప్రభుత్వ విధానాలపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బృందాకారత్ మాట్లాడుతూ ధరలు పెరగడం వల్ల పేద, మధ్యతరగతి ప్రజలపై ఆర్థికంగా భారం పడుతోందని, మహిళలకు పౌష్టికాహారం లభించక రక్తహీనతతో బాధపడుతున్నారన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు పది వేల కోట్లు ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు మొండి చేయి చూపిస్తున్నారని అన్నారు. పోడుభూములను గిరిజనులకు దక్కకుండా ప్రభుత్వం కుట్ర చేస్తోందని అన్నారు. తెలంగాణలో రేషన్ సరుకుల పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆశాలత, హైమావతి, ఇందిర, అరుణజ్యోతి, భవాని తదితరులు పాల్గొన్నారు.