డాక్టర్ కణితి విశ్వనాథం (ఫైల్)
కాశీబుగ్గ(శ్రీకాకుళం జిల్లా): మాజీ ఎంపీ డాక్టర్ కణితి విశ్వనాథం (91) శనివారం తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పలాసలోని స్వగృహంలో కన్నుమూశారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుల్లో కణితి కూడా ఒకరు. ఈయన 1932 జూలై 1న నందిగాం మండలం హరిదాసుపురంలో జన్మించారు.
వైద్యుడిగా, విద్యావేత్తగా పేరు గడించారు. తర్వాత రాజకీయాల్లో చేరి కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం నుంచి 1989, 1991లో పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఆయనకు పేరుంది. ఆ తర్వాత వైఎస్సార్‌సీపీలో చేరారు. 2014 నుంచి బీజేపీలో కొనసాగుతున్నారు. 1989లో ఆరోగ్య, సంక్షేమ మంత్రిత్వ శాఖ కౌన్సిల్ కమిటీ సభ్యుడిగా వ్యవహరించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యుడిగా 34 ఏళ్ల పాటు కొనసాగారు.
చదవండి: రామోజీ ఎందుకు ఓర్వలేకపోయారు?.. ఆ భయం వెంటాడిందా?
Comments
Please login to add a commentAdd a comment