kanithi viswanatham
-
మాజీ ఎంపీ కణితి విశ్వనాథం కన్నుమూత
కాశీబుగ్గ(శ్రీకాకుళం జిల్లా): మాజీ ఎంపీ డాక్టర్ కణితి విశ్వనాథం (91) శనివారం తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పలాసలోని స్వగృహంలో కన్నుమూశారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుల్లో కణితి కూడా ఒకరు. ఈయన 1932 జూలై 1న నందిగాం మండలం హరిదాసుపురంలో జన్మించారు. వైద్యుడిగా, విద్యావేత్తగా పేరు గడించారు. తర్వాత రాజకీయాల్లో చేరి కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం నుంచి 1989, 1991లో పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఆయనకు పేరుంది. ఆ తర్వాత వైఎస్సార్సీపీలో చేరారు. 2014 నుంచి బీజేపీలో కొనసాగుతున్నారు. 1989లో ఆరోగ్య, సంక్షేమ మంత్రిత్వ శాఖ కౌన్సిల్ కమిటీ సభ్యుడిగా వ్యవహరించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యుడిగా 34 ఏళ్ల పాటు కొనసాగారు. చదవండి: రామోజీ ఎందుకు ఓర్వలేకపోయారు?.. ఆ భయం వెంటాడిందా? -
అన్నదాతపై తుపాను దెబ్బ
వజ్రపుకొత్తూరు, న్యూస్‌లైన్: పై-లీన్, అల్పపీడనంతో కురిసిన వర్షాలకు రైతులు మరో ఐదేళ్లపాటు తేరుకోలేరని వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు కణితి విశ్వనాథం అన్నారు. మండలంలోని వజ్రపుకొత్తూరు, కిడిసింగి, నువ్వలరేవు, తాడివాడ, నగరంపల్లి గ్రామాలలో ఆయన శుక్రవారం పర్యటించి పంటపొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంపల్లి, గల్లి, బెండి, మహదేవుపురం, బట్టుపాడు, అనంతగిరి, వెంకటాపురం, గుల్లలపాడు, పూడిలంక తదితర గ్రామాలు జలదిగ్బంధంలో ఉండిపోయాయని, వారిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరారు. ఆయా పంచాయతీల సర్పంచ్‌లు దువ్వాడ విజయలక్ష్మి, నర్తు చినబాబు, బెహరా ధర్మారావు, దువ్వాడ శార్వాణి, పోతనపల్లి లక్ష్మీకాంతంలతో పాటు గ్రామాలలోని రైతులు కలిసి పంట నష్టాలను వివరించారు. కార్యక్రమంలో బమ్మిడి కృష్ణారావు, కంచరాన బుజ్జి, పైల నరసింహామూర్తి, తమ్మినాన విఘ్నేశం, దువాడ ఉమామహేశ్వరరావులున్నారు.