వజ్రపుకొత్తూరు, న్యూస్‌లైన్: పై-లీన్, అల్పపీడనంతో కురిసిన వర్షాలకు రైతులు మరో ఐదేళ్లపాటు తేరుకోలేరని వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు కణితి విశ్వనాథం అన్నారు. మండలంలోని వజ్రపుకొత్తూరు, కిడిసింగి, నువ్వలరేవు, తాడివాడ, నగరంపల్లి గ్రామాలలో ఆయన శుక్రవారం పర్యటించి పంటపొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంపల్లి, గల్లి, బెండి, మహదేవుపురం, బట్టుపాడు, అనంతగిరి, వెంకటాపురం, గుల్లలపాడు, పూడిలంక తదితర గ్రామాలు జలదిగ్బంధంలో ఉండిపోయాయని, వారిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరారు. ఆయా పంచాయతీల సర్పంచ్‌లు దువ్వాడ విజయలక్ష్మి, నర్తు చినబాబు, బెహరా ధర్మారావు, దువ్వాడ శార్వాణి, పోతనపల్లి లక్ష్మీకాంతంలతో పాటు గ్రామాలలోని రైతులు కలిసి పంట నష్టాలను వివరించారు. కార్యక్రమంలో బమ్మిడి కృష్ణారావు, కంచరాన బుజ్జి, పైల నరసింహామూర్తి, తమ్మినాన విఘ్నేశం, దువాడ ఉమామహేశ్వరరావులున్నారు.