'దాడి ఘటనలో నిందితులను అరెస్ట్ చేయాలి' | amalapuram dsp speaks about attacks and atrocity case | Sakshi
Sakshi News home page

'దాడి ఘటనలో నిందితులను అరెస్ట్ చేయాలి'

Published Tue, Aug 9 2016 4:10 PM | Last Updated on Wed, Oct 3 2018 7:42 PM

'దాడి ఘటనలో నిందితులను అరెస్ట్ చేయాలి' - Sakshi

'దాడి ఘటనలో నిందితులను అరెస్ట్ చేయాలి'

అమలాపురం: తూర్పుగోదావరి జిల్లాలో మంగళవారం ఉదయం దారుణం జరిగింది. అమలాపురం జానకీపేటకు చెందిన ఇద్దరి వ్యక్తులపై 8 మంది అమానుషంగా దాడి చేశారు. వీరిద్దరు ఆవులను ఎత్తుకెళ్లారనే అనుమానంతో స్థానిక శ్మశానం వద్ద దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. గమనించిన స్థానికులు వెంటనే వారిని అమలాపురం ఆస్పత్రికి తరలించారు.

అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ బాధితులను ఆస్పత్రిలో పరామర్శించారు. నిందితులను 48 గంటల్లోగా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై అమలాపురం డీఎస్పీ మాట్లాడుతూ...ఎనిమిది మందిపై అట్రాసిటీ కేసు నమోదు చేశామన్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement