amalapuram attacks
-
అమలాపురం ఘటనలో కేసుల ఉపసంహరణ
సాక్షి, అమరావతి: అమలాపురం ఘటనలో నమోదైన కేసులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విభేదాలను రూపుమాపి సామాజిక వర్గాల మధ్య శాంతి, సామరస్యపూర్వక వాతావరణాన్ని పెంపొందించే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చొరవ చూపారు. ఈమేరకు అమలాపురం ఘటనలో నమోదైన కేసులను ఉపసంహరించాలని నిర్ణయించారు. సామాజికవర్గాల మధ్య సామరస్యాన్ని సాధించి ఐకమత్యాన్ని పెంపొందించేలా సీఎం జగన్ తీసుకున్న చొరవ పట్ల కోనసీమ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. కేసులను ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. కోనసీమ ప్రాంత నేతలు, సామాజికవర్గాల నాయకులతో క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ మంగళవారం ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్‌కుమార్, ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, కుడిపూడి సూర్యనారాయణ తదితరులు ఇందులో పాల్గొన్నారు. అన్నదమ్ముల్లా అంతా కలసిమెలసి జీవిస్తూ ఒక్కటవుదామని సీఎం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. రేపటి తరాలు కూడా.. తరతరాలుగా మీరంతా అదే ప్రాంతంలో కలసిమెలసి జీవిస్తున్నారు. అక్కడే పుట్టి, అక్కడే పెరిగి, జీవిత చరమాంకం వరకూ అక్కడే ఉంటున్నారు. రేపటి తరాలు కూడా అక్కడే జీవించాలి. భావోద్వేగాల మధ్య కొన్ని ఘటనలు జరిగినప్పుడు వాటిని మరిచిపోయి మీరంతా మునుపటిలా కలిసి మెలిసి జీవించాలి. లేదంటే భవిష్యత్తు దెబ్బతింటుంది. దీన్ని లాగుతూ పోతే మనుషుల మధ్య దూరం పెరుగుతుంది. దీనివల్ల నష్టపోయేది మనమే. అందుకే అందరం కలిసి ఉండాలి. ఆప్యాయతతో ఉండాలి. చిన్న చిన్న గొడవలు, మనçÜ్పర్ధలు, అపోహలున్నా పక్కనపెట్టి ఆప్యాయంగా మాట్లాడుకుందాం. తప్పులు భూతద్దంలో చూసుకోకుండా కలిసిపోదాం. అందరం కలిసికట్టుగా ఒక్కటవుదాం. మిమ్మల్ని ఏకం చేయడం కోసం ఈ ప్రయత్నమంతా చేస్తున్నాం. పారదర్శకంగా స్వచ్ఛమైన వ్యవస్థ పార్టీలను చూడకుండా సంతృప్త స్థాయిలో పథకాలు అందచేస్తున్నాం. వలంటీర్లకు తోడుగా గృహ సారథులు ఉంటారు. వ్యవస్ధలో పారదర్శకత ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నాం. రూపాయి కూడా లంచం లేకుండా రూ.2 లక్షల కోట్ల మేర లబ్ధిదారులకు నేరుగా (డీబీటీ) అందించడం దేశ చరిత్రలో ఎన్నడూ జరగలేదు. టీడీపీ హయాంలో ఏది కావాలన్నా లంచం ఇవ్వాల్సిందే. ఇప్పుడు ప్రతి ఇంటికీ సంక్షేమాన్ని అందిస్తున్నాం. లంచాలకు తావులేని మంచి వ్యవస్ధను తీసుకొచ్చాం. ఇలాంటి వ్యవస్థ ఉంటే సమాజానికి మంచి జరుగుతుంది. భావోద్వేగాలతో ఊహించని ఘటన : పినిపే విశ్వరూప్, పొన్నాడ వెంకట సతీష్‌కుమార్ అమలాపురంలో జరిగిన ఘటన దురదృష్టకరం. భావోద్వేగాలతో మేం ఊహించని ఘటన జరిగింది. దీన్ని మేం వ్యక్తిగతంగా తీసుకోలేదు. కోనసీమలో మళ్లీ గొడవలు రాకుండా మీరు (సీఎం జగన్) తీసుకున్న చొరవకు ధన్యవాదాలు. మేం మనçస్ఫూర్తిగా కేసులన్నీ ఉపసంహరించుకుంటున్నాం. మా పట్ల మీరు చూపుతున్న ప్రేమకు కృతజ్ఞతలు. అందరం సమన్వయంతో ముందుకెళతాం. పూర్తిగా సహకరిస్తాం: కాపు నాయకులు నాడు జరిగిన ఘటనలు దురదృష్టకరం. అవి ఏమాత్రం మంచిది కాదు. సామరస్య వాతావరణం కోసం పూర్తిగా సహకరిస్తాం. దీనికోసం ముఖ్యమంత్రి చొరవ తీసుకోవడం హర్షణీయం. యువకుల భవిష్యత్తు, వారి కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి పెద్ద మనసుతో తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. ఐకమత్యంగా ఉంటాం: శెట్టిబలిజ నాయకులు శెట్టి బలిజ సామాజిక వర్గానికి గతంలో ఏ ముఖ్యమంత్రీ ఇవ్వనన్ని పదవులు ఇచ్చి సీఎం జగన్ గౌరవించారు. పెద్ద మనసుతో కేసులు ఉపసంహరించి మరింత సాయం చేశారు. మీకు రుణపడి ఉంటాం. సమాజ శ్రేయస్సు కోసం మీరు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి శెట్టిబలిజ, కాపు సామాజిక వర్గాలు ఐకమత్యంగా ఉంటాయి. -
అమలాపురం ఘటన.. కేసుల ఉపసంహరణపై ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, తాడేపల్లి: అమలాపురం ఘటనలతో ఏర్పడిన సామాజిక విభేదాల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వివిధ సామాజిక వర్గాలు మధ్య శాంతి, సామరస్యపూర్వక వాతావరణాన్ని బలపరిచే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవ చూపారు. క్యాంపు కార్యాలయంలో కోనసీమ నేతలు, సామాజికవర్గాల నాయకులతో సీఎం మంగళవారం సమావేశమయ్యారు. అమలాపురం ఘటనలో నమోదైన కేసులు ఉపసంహరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. సీఎం జగన్ నిర్ణయంపై కోనసీమ నాయకులు హర్షం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ► తరతరాలుగా మీరంతా అదే ప్రాంతంలో కలిసిమెలిసి జీవిస్తున్నారు ► అక్కడే పుట్టి.. అక్కడే పెరిగి… జీవిత చరమాంకం వరకూ అక్కడే ఉంటున్నారు ► రేపు అయినా.. అక్కడే పుట్టాలి.. అక్కడే పెరగాలి.. అక్కడే జీవితాల్ని ముగించాలి ► అందుకే భావోద్వేగాల మధ్య కొన్ని ఘటనలు జరిగినప్పుడు… వాటిని మరిచిపోయి… మునుపటిలా కలిసిమెలిసి జీవించాలి. లేకపోతే భవిష్యత్తు దెబ్బతింటుంది ► దీన్ని ఇలా లాగుతూ పోతే.. మనుషుల మధ్య దూరం పెరుగుతుంది ► దీనివల్ల నష్టపోయేది మనమే… అందుకే అందరం కలిసి ఉండాలి, ఆప్యాయతతో మెలగాలి ► చిన్న చిన్న గొడవలు, మనస్పర్ధలు, అపోహలు ఉన్నా పక్కనపెట్టి ఆప్యాయంగా మాట్లాడుకుందాం, ►తప్పులు భూతద్దంలో చూసుకోకుండా ఒకరికొకరు కలిసిపోదాం ► అందరం కలిసికట్టుగా ఒక్కటవుదాం, మిమల్ని ఒకటి చేయడం కోసం ఈ ప్రయత్నమంతా చేస్తున్నాం ► అందరికీ పార్టీలు చూడకుండా శాచురేషన్ బేసిస్ మీద పథకాలు అన్నీ ఇస్తున్నాం ► వలంటీర్లకు తోడుగా గృహ సారథులు కూడా ఉంటారు.. వ్యవస్ధలో పారదర్శకంగా ఉండాలనే ఈ నిర్ణయం ► అర్హత ఉన్న వారికి ఏ పథకమైనా అందని పరిస్థితి ఉండకూడదనేది మన విధానం ► కులం చూడకుండా, మతం చూడకుండా ఎవరికి అర్హత ఉంటే వారికి అన్నీ ఇస్తున్నాం. ► పార్టీలు చూడకుండా జరగాల్సిన మంచి చేస్తున్నాం. ► రూ. 2 లక్షల కోట్ల డీబీటీ దేశ చరిత్రలో ఎన్నడూ చూడలేదు. రూపాయి లంచం లేకుండా ఈ స్ధాయిలో ఎప్పుడూ జరగలేదు ► టీడీపీ హాయంలో నా పాదయాత్రలో లోన్ ల గురించి ప్రస్తావన వచ్చింది. అప్పుడు లోన్ ల కోసం లంచం ఇవ్వాల్సిన పరిస్ధితి. అవికూడా అక్కడక్కడా అరకొర అందేవి ► ఇప్పుడు ప్రతి ఇంటికీ సంక్షేమాన్ని అందిస్తున్నాం. లంచాలు లేని ఇంత మంచి వ్యవస్ధను తీసుకొచ్చాం ► మంచి చేసే విషయంలో ఏం చూడకుండా చేస్తున్నాం. ఇలాంటి వ్యవస్థ ఉంటేనే సమాజానికి మంచి జరుగుతుంది ► ఏ కారణం చేతనైనా ఎవరైనా మిస్ అయితే వారిని చేయి పట్టుకుని నడిపించడానికి కార్పొరేషన్లు కూడా ఏర్పాటుచేశాం ► ఇది మంచి పరిణామం, దేవుడి దయ వల్ల ఈ నిర్ణయం తీసుకున్నాం ► మీరంతా మనస్ఫూర్తిగా ముందుకు వచ్చారు. మంచి వాతావరణం ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. -
చినరాజప్ప ప్రధాన అనుచరుడు పల్లంరాజు అరెస్టు
సాక్షి, అమరావతి/అమలాపురం టౌన్: అమలాపురంలో విధ్వంసం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ప్రభుత్వ ఆస్తులు, మంత్రి, ఎమ్మెల్యే నివాసాలపై దాడులకు కీలక పాత్రధారిగా వ్యవహరించిన అమలాపురానికి చెందిన మాజీ రౌడీషీటర్, టీడీపీ నేత గంధం పల్లంరాజు, మరో ఇద్దరు రౌడీషీటర్లు గంప అనిల్, యాళ్ల నాగులతోపాటు 18 మందిని సోమవారం అరెస్టు చేశారు. వారిలో సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా విద్వేషాలు రెచ్చగొట్టి దాడులకు పురిగొల్పిన వారు కూడా ఉన్నారు. దాంతో ఈ కేసులో ఇప్పటివరకు 129 మందిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం అరెస్టు చేసిన 18 మంది నిందితులను న్యాయస్థానంలో హాజరుపరచి రిమాండు కోసం జైలుకు తరలించినట్టు కోనసీమ జిల్లా ఎస్పీ కేఎస్ఎస్వీ సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. టీడీపీ పాత్ర బట్టబయలు గంధం పల్లంరాజు అరెస్టుతో ఈ కుట్ర కేసులో టీడీపీ పాత్ర మరోసారి బట్టబయలైంది. అతను టీడీపీ ప్రభుత్వంలో హోంమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ప్రధాన అనుచరుడు కావడం గమనార్హం. అతనిపై అమలాపురం, పరిసర ప్రాంతాల్లో పలు కేసులతో పాటు రౌడీషీట్ కూడా ఉండేది. గంధం పల్లంరాజుపై అమలాపురం స్టేషన్లో ఉన్న రౌడీ షీట్‌ను చినరాజప్ప హోంమంత్రిగా ఉన్న సమయంలోనే ఎత్తివేయడం గమనార్హం. గతంలో ఇసుక మాఫియా నడిపిన అతను అనంతరం రియల్టర్‌గా రూపాంతరం చెందాడు. అమలాపురంలో గత నెల 24న చలో కలెక్టరేట్ ర్యాలీ సందర్భంగా అల్లర్లకు పన్నాగం వెనుక అతను క్రియాశీలకంగా వ్యవహరించాడు. రౌడీషీటర్లను అమలాపురం వీధుల్లో మాటువేసేలా చేయడంతోపాటు వారంతా ఒకేసారి ర్యాలీలోకి ప్రవేశించేలా స్కెచ్‌ను అమలు చేశాడు. అతనికి అమలాపురానికే చెందిన గంప అనిల్, కొత్తపేట మండలం మోడేకుర్రుకు చెందిన యాళ్ల నాగులు సహకరించారు. వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా కుట్ర నడిపించారు.. వాట్సాప్ గ్రూపులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి మరీ విద్వేషాలు రెచ్చగొట్టడం, వాట్సాప్ గ్రూపుల ద్వారానే పోలీసుల కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం అందించడం, ఏ సమయంలో దాడులకు పాల్పడాలో ఇలా మొత్తం కుట్రను పక్కాగా నడిపించారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ మేరకు వాట్సాప్ సందేశాలు, కాల్ డేటా, సీసీ టీవీ ఫుటేజీలను విశ్లేషించి పూర్తి ఆధారాలను సేకరించారు. కాగా, ఈ కేసులో కుట్రదారులు, పాత్రధారులు మరికొందరి పాత్రపై పోలీసులు ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించినట్టు సమాచారం. వారిని కూడా త్వరలో అరెస్టు చేసే అవకాశాలున్నాయి. మరోవైపు అమలాపురంతోపాటు కోనసీమ అంతటా 144 సెక్షన్, పోలీసు సెక్షన్ 30లను పోలీసులు కొనసాగిస్తున్నారు. -
Amalapuram: జనసేన, టీడీపీ, బీజేపీ కుమ్మక్కు.. కుట్ర బట్టబయలు
సాక్షి, అమరావతి/అమలాపురం టౌన్: అమలాపురంలో అల్లర్లు, విధ్వంసం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సాగిన విధ్వంసకాండ కుట్ర వెనుక సూత్రధారులు, దాడుల్లో పాత్రధారులను అరెస్టు చేస్తున్నారు. ఇప్పటికే వీడియో క్లిప్పింగులు, సోషల్ మీడియా పోస్టులు, కాల్ డేటా, సీసీ టీవీ ఫుటేజ్‌ల ఆధారంగా కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. వీడియో క్లిప్పింగుల ఆధారంగా 70 మందికిపైగా నిందితులను గుర్తించారు. ఇందులో భాగంగా గురువారం ఒక్కరోజే 19 మందిని అరెస్టు చేశారు. మరో 46 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరిలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా సుబ్బారావు.. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకట రామారావు ఉన్నారు. మంత్రి విశ్వరూప్ ఇంటికి నిప్పు పెట్టిన ఘటనలో టీడీపీ ఎమ్మెల్యే చినరాజప్ప అనుచరుడు వడగన నాగబాబుపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులపై వివిధ సెక్షన్ల కింద ఆరు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ప్రత్యేక బృందాల ద్వారా మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. ఈ విషయాన్ని డీఐజీ పాలరాజు మీడియాకు తెలిపారు. అమలాపురం ఎస్పీ కార్యాలయంలో కోనసీమ, కాకినాడ జిల్లా ఎస్పీలు కెఎస్ఎస్వీ సుబ్బారెడ్డి, ఎం.రవీంద్రనాథ్‌బాబు, కోనసీమ ఏఎస్పీ లత మాధురితో కలిసి పాలరాజు మీడియాతో మాట్లాడారు. ఈ నెల 24న అమలాపురం పట్టణంలో పలు కూడళ్లలో ఉన్న సీసీ పుటేజ్‌లు, వాట్సాప్ గ్రూపులు, టీవీ చానల్స్‌లో ప్రసారమైన దృశ్యాలను ఆధారంగా చేసుకుని నిందితులను గుర్తించామన్నారు. అలాగే 12 వాట్సాప్ గ్రూపులను గుర్తించామని పేర్కొన్నారు. ఈ వాట్సాప్ గ్రూపుల్లో ఆందోళనకారులు పరస్పర సమాచారం చేర వేసుకుంటూ.. ఫలానా చోటకు రావాలని, ఫలానా చోట పోలీసుల బందోబస్తు అధికంగా ఉందని.. అడ్డదారుల్లో రావాలని ఆ దారులు తెలియజేస్తూ గ్రూపుల్లో సమాచారం పంపించారని తెలిపారు. ఈ 12 వాట్సాప్ గ్రూపుల్లో ఆ రోజు సాగిన పోస్టింగ్‌లు, మెసేజ్‌లు సేకరించామని చెప్పారు. వాట్సాప్ గ్రూపుల అడ్మిన్లపైనా కేసులు నమోదు చేస్తామని తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పతో పళ్లంరాజు ఉద్దేశపూర్వకంగానే ప్రజాప్రతినిధుల ఇళ్లకు నిప్పు.. మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్ ఇళ్లపై ఆందోళనకారులు ఉద్దేశపూర్వకంగా దాడి చేసి నిప్పుపెట్టారని డీఐజీ పాలరాజు చెప్పారు. నిందితులపై హత్యాయత్నంతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల ధ్వంసం, పథకం ప్రకారం దాడులు, దొమ్మి తదితర కేసులు నమోదు చేశామన్నారు. పోలీసు బందోబస్తు పెద్ద స్థాయిలో ఉన్నప్పటికీ ఆందోళనకారులు దాడులకు తెగబడిన పరిస్థితులపై పోలీసుశాఖ పునః సమీక్షించుకుంటుందన్నారు. నల్లవంతెన వద్ద పోలీసుల వజ్ర వాహనాన్ని ధ్వంసం చేయడంతోపాటు కలెక్టరేట్ వద్ద, ఎర్ర వంతెన వద్ద బస్సులను తగలబెట్టడం, తర్వాత వాట్సాప్ గ్రూపుల్లో మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్ ఇళ్లకు నిప్పు పెట్టాలని పథక రచన చేసుకుని ఎర్రవంతెన వైపు నుంచి వెళ్లారన్నారు. ఈ కేసుల దర్యాప్తులో ఆరు పోలీసు బృందాలు ఉన్నాయని.. మరో ఆరు బృందాలు సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను గుర్తించే పనిలో ఉన్నాయని చెప్పారు. ఈ విధ్వంస ఘటనల్లో పాల్గొన్నవారి పేర్లను గ్రామాలవారీగా సేకరించి జాబితాలను తయారుచేస్తున్నామన్నారు. దాడుల్లో రౌడీషీటర్ల పాత్ర ఉందన్నారు. శుక్రవారం మరో కొంత మందిని అరెస్టు చేస్తామని చెప్పారు. అరెస్టులు కొన్ని రోజులపాటు కొనసాగుతాయన్నారు. టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ముఖ్య అనుచరుడు, రౌడీషీటర్ గంధం పళ్లంరాజుతో నాగబాబు (గళ్ల చొక్కా వ్యక్తి), పళ్లంరాజు (తెల్ల చొక్కా వ్యక్తి) సోషల్ మీడియా పోస్టుల ద్వారానే కుట్ర అమలు కుట్రదారులు అమలాపురంలో విధ్వంసానికి పక్కాగా పన్నాగం పన్నారని పోలీసులు గుర్తించారు. ప్రధానంగా అల్లర్లకు ఆజ్యం పోయడానికి సోషల్ మీడియాను వాడుకున్నారు. ఈ నెల 19 నుంచి వర్గ విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులను తమ వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ చేసినట్టు గుర్తించారు. సోషల్ మీడియా వేదికగా పరస్పరం దూషణలకు పాల్పడ్డారు. విద్వేషాలు రేకెత్తించేలా వాట్సాప్ స్టేటస్లు పెట్టుకోవడాన్ని ట్రెండ్‌గా మార్చారు. దాంతో సహజంగానే కోనసీమలో ఇరువర్గాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. అక్కడక్కడా స్వల్ప ఘర్షణలు, వాహనాల దహనాలు, పరస్పరం దూషణల పర్వం కొనసాగింది. వీటిని అవకాశంగా చేసుకుని శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన కొందరు నేతలు రంగంలోకి దిగారు. ఈ నెల 24న ర్యాలీ సందర్భంగా విధ్వంసానికి పాల్పడేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. ర్యాలీలో వేలాదిమంది పాల్గొన్నప్పటికీ విధ్వంసం కుట్రను ఎంపిక చేసిన కొంతమందికే ముందుగా చెప్పారు. ర్యాలీ రూట్‌మ్యాప్, ఎక్కడ దారి మళ్లించాలి, పోలీసులపై రాళ్లు రువ్వడం, మంత్రి విశ్వరూప్ రెండు ఇళ్లు, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంటిపై దాడులు.. ఇలా అన్నీ పక్కాగా సోషల్ మీడియా పోస్టుల ద్వారానే కథ నడిపించినట్టు పోలీసులు గుర్తించారు. పవన్‌కల్యాణ్, నాదెండ్ల మనోహర్‌తో అన్యం సాయి వాటి ఆధారంగానే దర్యాప్తు ముమ్మరం.. సోషల్ మీడియా పోస్టుల ఆధారంగానే పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. విధ్వంసానికి కుట్ర పన్నిన సూత్రధారులు, అల్లర్లలో పాల్గొన్నవారి సోషల్ మీడియా పోస్టులను పోలీసులు పరిశీలిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న 46 మందితో పాటు అరెస్టు చేసిన 19 మందినీ వారి సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా విచారిస్తున్నారు. ఆ పోస్టులు మొదటగా ఎక్కడ నుంచి వచ్చాయన్న అంశాన్ని ఆరా తీస్తున్నారు. వారి కాల్ డేటాను కూడా పరిశీలిస్తున్నారు. ఈ దిశగా ఇప్పటికే కీలక ఆధారాలను సేకరించినట్టు తెలుస్తోంది. ఇక సూత్రధారుల అరెస్టులే.. సేకరించిన కీలక ఆధారాలతో అమలాపురంలో విధ్వంస కాండ వెనుక అసలు కుట్రదారులు ఎవర్నది గుర్తించే పనిలో పోలీసు యంత్రాంగం నిమగ్నమైంది. పరారీలో ఉన్న మిగిలిన నిందితులను కూడా అదుపులోకి తీసుకోవడంతోపాటు ఈ కుట్ర వెనుక అసలు సూత్రధారుల పాత్రను తగిన ఆధారాలతోసహా నిరూపించే దిశగా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. విధ్వంసం వెనుక అసలు పాత్రధారులు, కుట్రదారులను ఒకట్రెండు రోజుల్లో అరెస్టు చేసే అవకాశాలున్నాయి. సంచలన విషయాలు వెల్లడించే రీతిలో అరెస్టులు ఉండొచ్చని విశ్వసనీయ సమాచారం. ప్రశాంతంగా కోనసీమ.. అమలాపురంలో పోలీసుల చర్యలతో ప్రశాంత వాతావరణం ఏర్పడింది. సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. వ్యాపార దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలు యధావిధిగా పనిచేస్తున్నాయి. ఆర్టీసీ కూడా పూర్తి స్థాయిలో సర్వీసులు నడుపుతోంది. దాదాపు వెయ్యి మంది పోలీసులతో అత్యంత పకడ్బందీగా బందోబస్తు కొనసాగుతోంది. ప్రజాభీష్టం మేరకే అంబేడ్కర్ జిల్లా శ్రీకాకుళం రూరల్: ప్రజాభీష్టం మేరకే కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టామని హోంశాఖ మంత్రి తానేటి వనిత తెలిపారు. కోనసీమ ప్రస్తుతం ప్రశాంతంగానే ఉందని.. 2 వేల మంది పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. కోనసీమ అల్లర్ల వెనుక ఎవరున్నారో పోలీసులు కూపీ లాగుతున్నారని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు దండ వేస్తున్న అరిగల వెంకట రామారావు(ఎడమవైపు), మోకా సుబ్బారావు(కుడివైపు) పోలీసులు అరెస్ట్ చేసిన 19 మంది వీరే.. గురువారం పోలీసులు అరెస్టు చేసిన 19 మంది నిందితుల్లో 18 మంది జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలకు చెందినవారే. టీడీపీ కార్యకర్తలు.. దున్నల తాతాజీ ధనుంజయ దిలీప్, అల్లబిల్లి సూర్యనారాయణమూర్తి, జనసేన పార్టీ కార్యకర్తలు.. అన్యం దుర్గా సాయికుమార్, కల్వకొలను సత్యనారాయణమూర్తి, కురసాల సురేష్ నాయుడు, నార్కెడిమిల్లి కృష్ణకిశోర్, అడ్డాల నాగ శ్రీరంగ గణేష్, చిట్టూరి ప్రసాద్, విత్తనాల శివనాగ మణికంఠ, ఎర్రంశెట్టి బాలాజీ, నల్లా సురేష్, విత్తనాల ప్రభాకర్, పలివెల శేఖర్, నేదునూరి వెంకటేష్, నడవపల్లి భవానీ శివశంకర్, కంచిపల్లి వెంకటేశ్వరరావు, బీజేపీ కార్యకర్తలు..సత్తిరెడ్డి సతీష్, ఎర్రంశెట్టి సాయిబాబులతోపాటు ఏ పార్టీకి చెందని వాసంశెట్టి రాము ఉన్నారు. వీరిలో 12 మంది అమలాపురం పట్టణానికి చెందినవారు కాగా అమలాపురం రూరల్ మండలానికి చెందినవారు ముగ్గురు, పి.గన్నవరానికి చెందినవారు ఇద్దరున్నారు. అల్లవరం, అయినవిల్లిలకు చెందినవారు చెరొకరు ఉన్నారు. -
అల్లర్ల వెనుక ఎవరున్నా ఉపేక్షించేది లేదు
అమలాపురం రూరల్: అమలాపురంలో అల్లర్ల వెనుక ఎవరున్నా ఉపేక్షించేది లేదని మంత్రి పినిపే విశ్వరూప్ స్పష్టం చేశారు. బుధవారం అమలాపురంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కోనసీమ సాధన సమితి పేరుతో ఎవరైతే ర్యాలీకి పిలుపు ఇచ్చారో వారే దీనికి బాధ్యత వహించాలన్నారు. కోనసీమ ప్రజలు, అమలాపురం పట్టణ ప్రజలు చాలా మంచివారని, శాంతి కాముకులని అన్నారు. శాంతియుతంగా జరుగుతున్న ధర్నాలో కొంతమంది రౌడీషీటర్లు, సంఘ విద్రోహ శక్తులు చేరి ఒక ఉద్యమాన్ని డైవర్ట్ చేసి.. తన ఇంటిపైన, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంటిపైన దాడి చేసి ఇళ్లు తగులబెట్టారని చెప్పారు. పొన్నాడ సతీష్, ఆయన కుటుంబ సభ్యులు ఇంట్లో ఉండగానే ఇంటికి నిప్పంటించారన్నారు. ఆ సమయంలో పోలీసులు అక్కడే ఉండటంతో వెంటనే వారిని క్షేమంగా బయటకు తీసుకువచ్చారని తెలిపారు. ఇది అత్యంత దురదృష్టకరమైన ఘటన అని, కోనసీమ చరిత్రలో 50 ఏళ్లలో ఎప్పుడూ ఇటువంటి ఘటన జరగలేదన్నారు. కోనసీమ సాధన సమితి వారికి గానీ, విద్యార్థులకు గానీ తమ ఇళ్లపై దాడి చేయడం లక్ష్యం కాదని పేర్కొన్నారు. రౌడీషీటర్లు పెట్రోల్‌తో వచ్చారని, వాళ్లు ఇంటిని, తన ఇంటికి 500 మీటర్ల దూరంలో ఉన్న ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంటిపై దాడి చేసి తగులబెట్టారన్నారు. కానీ.. సతీష్ ఇంటికి కేవలం పది మీటర్ల దూరంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే ఆనందరావు ఇంటిపై ఎందుకు దాడి చేయలేదని మంత్రి ప్రశ్నించారు. ఈ ఘటనలో ద్వితీయ శ్రేణి టీడీపీ నాయకులు ఉన్నారని, వారి పేర్లు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. వాళ్ల కాల్‌డేటా బయటకు వస్తుందని, ఐక్యవేదిక ముసుగులో తమ పార్టీ నాయకులను ఎవరు సంప్రదించారో వాళ్ల వివరాలు కూడా ఉన్నాయన్నారు. ప్రజలెవరూ రౌడీషీటర్ల ఉచ్చులో పడొద్దని విజ్ఞప్తి చేశారు. -
రావులపాలెంలో భారీ భద్రత బలగాలు
-
అమలాపురం ఘటనపై దళిత సంఘాల ఆందోళన
-
ప్రజలన్నా..వ్యవస్థలన్నా..చంద్రబాబుకు భయం లేదు
-
ప్రజా ప్రతినిధుల ఇళ్లను తగలబెట్టడం హేయమైన చర్య
-
పక్కా స్కెచ్ తోనే మంత్రి ఇంటి పై దాడి..?
-
అమలాపురాన్ని పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నాం - డీఐజీ పాలరాజు
-
'దాడి ఘటనలో నిందితులను అరెస్ట్ చేయాలి'
అమలాపురం: తూర్పుగోదావరి జిల్లాలో మంగళవారం ఉదయం దారుణం జరిగింది. అమలాపురం జానకీపేటకు చెందిన ఇద్దరి వ్యక్తులపై 8 మంది అమానుషంగా దాడి చేశారు. వీరిద్దరు ఆవులను ఎత్తుకెళ్లారనే అనుమానంతో స్థానిక శ్మశానం వద్ద దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. గమనించిన స్థానికులు వెంటనే వారిని అమలాపురం ఆస్పత్రికి తరలించారు. అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ బాధితులను ఆస్పత్రిలో పరామర్శించారు. నిందితులను 48 గంటల్లోగా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై అమలాపురం డీఎస్పీ మాట్లాడుతూ...ఎనిమిది మందిపై అట్రాసిటీ కేసు నమోదు చేశామన్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.