ఢిల్లీ: సెప్టెంబర్ 6న కరీంనగర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు టీఆర్‌ఎస్ మాజీ ఎంపీ వినోద్ తెలిపారు. లక్షలాది మందితో ఈ సభను నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఏపీ ఎన్జీవోలు స్పష్టంగా సమస్యలు చెప్పలేకపోతున్నారన్నారు. సీమాంధ్ర ఉద్యమం తమ ఇబ్బందులు చెప్పడంలో విఫలమైందని ఆయన అభిప్రాయపడ్డారు.
మందా జగన్నాధం మాట్లాడుతూ హైదరాబాద్‌లో సీమాంధ్ర ప్రజలకు పూర్తి భద్రత కల్పిస్తామని చెప్పారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రెండు కళ్ల సిద్థాంతాన్ని మళ్లీ మొదలుపెట్టారని కడియం శ్రీహరి విమర్శిచారు. చంద్రబాబు నాయుడు గోడ మీద పిల్లిలా వ్యవహరిస్తున్నారని పోచారం శ్రీనివాస రెడ్డి మండిపడ్డారు.
సెప్టెంబర్ 6న కరీంనగర్‌లో టిఆర్ఎస్ బహిరంగ సభ
Published Thu, Aug 29 2013 4:29 PM | Last Updated on Wed, Oct 3 2018 7:42 PM
Advertisement
Advertisement