trs meeting
-
‘మున్సిపోల్స్’పై నేడు టీఆర్ఎస్ కీలక భేటీ
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 7న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో శనివారం టీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశం జరగనుంది. పార్టీ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా పార్టీ పార్లమెంటు సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లతో పాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు ఆహ్వానం పంపారు. తెలంగాణ భవన్లో ఉదయం 11.30 నుంచి సాయంత్రం 4 వరకు సుదీర్ఘంగా జరిగే ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు. -
ఎగిరేది గులాబీ జెండానే
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: యాభై ఏళ్ల కాంగ్రెస్ పాలనలో నల్లగొండ జిల్లా నుంచి పెద్ద పెద్ద పదవులు పొంది కాంగ్రెస్ నాయకులే ఎదిగారు తప్ప జిల్లాను అభివృద్ధి చేయలేదని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ విమర్శించా రు. జిల్లాలో ఫ్లోరిన్ పాపం కాంగ్రెస్ నాయకుల పుణ్యమేనని దుయ్యబట్టారు. ఈ ఐదేళ్ల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా 50 లక్షల కుటుంబాలకు తాగునీరు అందించిం దన్నారు. సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రం లోని లక్ష్మీ గార్డెన్స్‌లో జరిగిన టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన జిల్లా నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. హుజూర్‌నగర్‌పై గులాబీ జెండా ఖాయం హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉపఎన్నికలో టీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ‘గతంలో హుజూర్నగర్ ఎన్నికల్లో ఎన్నో ప్రయత్నాలు చేశాం. మా ప్రయత్నాలకు యువకుడు సైదిరెడ్డి తోడయ్యారు. కానీ ట్రక్కు గుర్తు అండ తో కాంగ్రెస్ బయటపడింది. కానీ ఈసారి వెయ్యి శాతం కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఖాయం’అని జోస్యం చెప్పారు. నల్లగొండను ఐదు దశాబ్దాలపాటు నట్టేట ముంచిన కాంగ్రెస్ కావాలో లేక తెలంగాణ తెచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న టీఆర్ఎస్ కావాలో తేల్చుకోవా ల్సిన తరుణం ప్రజలకు వచ్చిందన్నారు. టీఆర్ఎస్ గెలిస్తేనే అభివృద్ధి... కాంగ్రెస్ గెలిస్తే సాధించేది ఏమీ లేదని, టీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాను ఎంతో అభివృద్ధి చేసిందన్నా రు. సూర్యాపేట, యాదాద్రి జిల్లాల ఏర్పాటుతో పాలన వికేంద్రీకరణ జరిగిందన్నారు. ఇచ్చిన మాటను కాంగ్రెస్ తుంగలో తొక్కితే, టీఆర్ఎస్ తండాలను పంచాయతీలుగా చేసిందని గుర్తుచేశారు. బతుకమ్మ చీరలు, కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, విద్యార్థులకు సన్న బియ్యంతో భోజనం వంటి పథకాలను మేనిఫెస్టోలో పెట్టకున్నా సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేనివిధంగా వాటిని అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. 50 ఏళ్ల కాలంలో జిల్లాలో మెడికల్ కళాశాల లేదని, కానీ తాము వచ్చాక నల్లగొండ, సూర్యాపేటల్లో మెడికల్ కళాశాలలతోపాటు బీబీ నగర్ వద్ద ఎయిమ్స్‌ను కూడా ఏర్పాటు చేశామని కేటీఆర్ వివరించారు. కాంగ్రెస్ పార్టీ మనుషులనే కాదు.. దేవుడిని కూడా పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు. ఎగిరెగిరి పడుతున్న కాంగ్రెస్, బీజేపీ... కాంగ్రెస్, బీజేపీలు ఇప్పుడు ఎగిరెగిరి పడుతున్నాయని, తెలంగాణ ప్రజల గుండెల్లో ఎవరి స్థానం ఏమిటో తేల్చుకునేందుకు హుజూర్నగర్ ఉప ఎన్నిక మంచి అవకాశమని కేటీఆర్ పేర్కొన్నారు. హుజూర్నగర్ ఉప ఎన్నికను పార్టీ శ్రేణులంతా సవాలుగా తీసుకొని ఆ పార్టీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ‘టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి, ఉత్తమ్ అంత ఎత్తు ఉండకపోవచ్చు, అంత డబ్బూ ఉండకపోవచ్చు, కానీ మంచి మనిషి. ఉప ఎన్నికలో ఆయన గెలుపును ఎవరూ ఆపలేరు’ అని ధీమా వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ, హుజూర్నగర్ నియోజకవర్గం అభివృద్ధిలో వెనకబడిపోయిందని, కాంగ్రెస్ నేతలు చివరకు తమకు ఓట్లు వేసిన ప్రజలను కూడా పట్టించుకోలేదని ఆరోపించారు. నేతన్నను ఆదుకునేందుకే.. నల్లగొండ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు సముదాయంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ఈ సందర్భంగా మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. ఉద్యమ నాయకుడిగా సీఎం కేసీఆర్ చేనేత కార్మికుల ఆకలి చావులు, ఆత్మహత్యలను చూసి చలించిపోయారని, వారి ని ఆదుకోవాలని నాటి ప్రభుత్వాలకు విన్నవించినా ఎవరూ పట్టించుకోలేదని ఆరోపించారు. దాంతో కేసీఆర్ భిక్షాటన చేసి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పోచంపల్లిలో ఆత్మహత్యలు చేసుకున్న ఏడుగురు చేనేత కార్మికుల కుటుంబాలకు రూ. 50 వేల చొప్పున ఆర్థిక సాయం అందించారని గుర్తుచేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే వారికి భరోసా కల్పించే విధంగా బతుకమ్మ చీరలు తయారు చేయిస్తున్నారని చెప్పారు. తెలంగాణ ఆడబిడ్డలకు చీరలు అందించేలా పథకాన్ని రూపొందించి ఆ చీరల తయారీని నేతన్నలకు అప్పగించామన్నారు. సీఎం కేసీఆర్ పెద్దన్నలా తెలంగాణలో కోటి చీరలను తయారు చేయించి ఇస్తున్నారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడెక్కడ చేనేత కార్మికులు ఉన్నారో వారందరికీ బతుకమ్మ చీరల తయారీతోపాటు ప్రభుత్వ శాఖల్లోని యూనిఫారాల తయారీ బాధ్యతను కూడా అప్పగించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
మంత్రి పదవి భిక్ష కాదు
సాక్షి, కరీంనగర్ : ‘మంత్రి పదవి నాకు ఎవరో వేస్తే వచ్చిన భిక్ష కాదు.. మంత్రి పదవి కోసం కులం పేరుతో కొట్లాడలేదు.. తెలంగాణ కోసం చేసిన ఉద్యమమే నన్ను మంత్రిని చేసింది’ అని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో గురువారం జరిగిన టీఆర్ఎస్ సభలో ఆయన ఉద్వేగంగా మాట్లాడారు. మంత్రి పదవిపై గత కొన్ని రోజులుగా కొన్ని పత్రికలు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆయన పరోక్షంగా స్పందించారు. పదవిని అడుక్కునేవాళ్లం కాదని, అడుక్కునేవాళ్లు ఎవరో తొందరలోనే తెలుస్తుందని వ్యాఖ్యానించారు. అధికారం శాశ్వతం కాకపోవచ్చునని.. ధర్మం, న్యాయం మాత్రమే శాశ్వతమని పేర్కొన్నారు. సొంతంగా ఎదగలేని వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, బయట జరుగుతున్న చిల్లర రాజకీయాలపై స్పందించాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ వ్యవహారంపై సభలో ఘాటుగా స్పందించిన ఆయన.. అనంతరం తన వ్యాఖ్యలు తీవ్రంగా చర్చనీయాంశం కావడంతో గురువారం రాత్రి వివరణ ఇస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. తన ప్రసంగాన్ని వక్రీకరించడం సరికాదని, తాను గులాబీ సైనికుడినేనని, తమ నాయకుడు సీఎం కేసీఆరేనని స్పష్టంచేశారు. అంతకుముందు సభలో ఈటల ఏమన్నారంటే... నేనానాడే పారిశ్రామికవేత్తను.. ‘తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మొదలైనప్పుడు ఆ ఉద్యమానికి పారిశ్రామికవేత్తగా నన్ను సాయం చేయమని ఓ నాయకుడు కోరినప్పుడు పార్టీ పరిచయమైంది. ఆ కాలంలోనే నా గురించి పెద్ద పారిశ్రామికవేత్తనని పత్రికలు రాసినయి. హైదరాబాద్‌లో ఆ రోజుల్లో ఈటల రాజేందర్ అంటే తెలియని వారు ఉండరనుకుంట. అప్పటి ఉద్యమ రోజుల్లోనే పది లక్షల కోళ్ల ఫారాలను నడుపుతున్నా. 50 లక్షల కోళ్ల ఫాంలను నడిపే సత్తా ఉన్నవాడిని. 2003లో నేను టీఆర్ఎస్లో చేరి పనిచేస్తున్న క్రమంలో అప్పటి ఉద్యమ నేత అయిన సీఎం కేసీఆర్ నన్ను మీది ఎక్కడయ్యా అని అడిగితే కమలాపూర్ అని చెప్పిన. ఆ సందర్భంలో గిక్కడ ఏముందయ్యా.. నీకు గట్టుకు కట్టెలు మోసినట్లు అని చెప్పి.. నీకు డబ్బు, మంచి పేరు ఉంది. నువ్వు అక్కడికి వెళ్లు అని కమలాపూర్ పొమ్మన్నడు. అప్పుడు కమలాపూర్ నాకు పెద్దగా పరిచయం లేదు సార్.. నేను ఈటల మల్లయ్య కొడుకు గానో, ఈటల సమ్మయ్య తమ్ముని గానో, ఈటల భద్రయ్య అన్నగానో చెప్పుకోవాలె తప్ప అక్కడ నాకు చరిత్ర లేదు సార్ అని చెప్పిన. అప్పుడు సీఎం కేసీఆర్ నువ్వు పో.. నీకు మంచిగ ఉంటుందని చెబితే కమలాపూర్‌లో అడుగు పెట్టిన. తెలంగాణ ఆత్మగౌరవం కోసం పోరాడిన బిడ్డగా నన్ను ఆరుసార్లు గెలిపించి నియోజకవర్గ ప్రజలు మద్దతుగా నిలిచారు. తెలంగాణ ఆత్మగౌరవ బావుటా ఎగరేసినం అనామక మనిషిగా వచ్చిం ఈ గడ్డ మీద ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుచుడు అనేది ఓ చరిత్ర. నా తండ్రి రాజకీయాల్లో లేడు. నాకు నేనుగా నిలబడ్డా. ఒక్క హుజూరాబాదే కాదు.. నేను ఆదిలాబాద్‌కు పోయినా పదిమంది వచ్చి ఫొటో దిగి పోతరు. నేను మహబూబ్‌నగర్ పోయినా, వ్యాన్లలో వచ్చి పదిమంది ఫొటో దిగి పోతరు. లక్షల మందితో తెలంగాణ గడ్డపై ఉద్యమం చేసిన బిడ్డలం. ఒక పత్రిక రాస్తది.. ఈయనకు మంత్రి పదవే రాకపోతుండే.. కుల సమీకరణలు కలిసొచ్చాయని. కొడుకా గుర్తుపెట్టుకో.. కులంతోటి కొట్లాట పెట్టలే. ఈ మంత్రి పదవే ముఖ్యమా? కులంతో వచ్చినవాడిని కాదు నేను. ఈటల రాజేందర్ అనేవాడు తెలంగాణ ఉద్యమం మూడున్నర కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవ బావుటా. ఆ బావుటా ఎగరేసిన తెలంగాణ బిడ్డను. తెలంగాణ ఆత్మ గౌరవం కోసం, తెలంగాణ తల్లి విముక్తి కోసం కొట్లాడినం. దొంగలెవరో, ద్రోహులెవరో త్వరలోనే తెలుస్తది. ద్రోహులు పదేపదే మోసం చేయలేరు. న్యాయం, ధర్మం నుంచి ఎవరూ తప్పించుకోలేరు. ఆనాడు జైళ్లలో, పీడీ యాక్టులు పెట్టాలె అని ముఠాలు కట్టిన్రు. నన్ను చంపాలె అని రెక్కీలు నిర్వహించినప్పుడు.. సంపుతవా నా కొడకా! అని ఛాలెంజ్ చేసిన తెలంగాణ బిడ్డను నేను. ఈటల రాజేందర్ తెలంగాణ విముక్తి పోరాటం వల్ల గెలిచాడు తప్ప.. నాకు నేనుగా గెలవలేదు అని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌కు చెప్పిన. ఇవాళ పైసల గురించి మాట్లాడుతున్నారు. నాకు ఆనాడే పైసలున్నయ్. నా సొంతంగా కోళ్ల ఫారాలతో వ్యాపారాలు చేసుకొని సంపాదించిన పైసలు. నా 15 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎవ్వల దగ్గరి నుంచైనా ఐదువేలు లంచం తీసుకున్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచే వైదొలుగుతా. నేను ఇల్లు కట్టుకుంటే ఇంత కక్షా? ఇల్లు కట్టుకున్న భూమి కూడా ఇప్పుడు కొన్నది కాదు. అడుక్కునేవాళ్లు ఎవరో తెలుస్తది.. చెప్పాలంటే 10 గంటలు చెప్తా. ఒక్కోరోజు 4 జిల్లాల్లో 20 సభల్లో లక్షల మందితో ఇంటరాక్ట్ అయి ఉద్యమాన్ని నడిపిన వాళ్లం మేం. ఈ గులాబీ జెండాకు ఓనర్లం మేం. అడుక్కుని వచ్చిన వాళ్లం కాదు మేం. బతుకచ్చినోళ్లం కాదు మేం. అడుక్కునేవాళ్లెవరో రేపు తెలుస్తది. అధికారం అనేది శాశ్వతం కాకపోవచ్చు.. కానీ ధర్మం, న్యాయం శాశ్వతంగా ఉంటుంది. ప్రజలే చరిత్ర నిర్మాతలు తప్ప.. నాయకులు కాదనే సత్యాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. కుసంస్కారం ఉన్న, ఎదగలేని, సొంతంగా తిరగలేని నాయకుల గురించి అప్రమత్తంగా ఉండాలి. ధర్మం నుంచి అలాంటి నాయకులు తప్పించుకోలేరు. ప్రజాక్షేత్రంలో వారికి శిక్ష తప్పదు. చిల్లరమల్లర వార్తలకు భయపడను.. నేను గెలవగలిగే సత్తా ఉన్నోడిని.. అమ్ముడుపోకుండా ఉన్నోడిని నా భుజాలమీద మోసే ప్రయత్నం చేస్తా. ఈ బాధ.. ఇదంతా కూడా నానోటి నుంచే కాదు.. ఎన్నడో ఒకనాడు తప్పకుండా బయటకొస్తాయ్. ఎవడు పోయి ద్రోహి అయ్యాడో.. ఎవడు హీరో అయ్యాడో అనేది ఆ రోజు తెలుస్తదన్న ఆశతో బతికేవాడిని. ఈటల రాజేందర్ వెలిగే దీపమే తప్ప.. తెలంగాణ గడ్డమీద ఆత్మగౌరవంతో బతికేవాడే తప్ప.. ఈ చిల్లరమల్లర వారితో, వార్తలతో భయపడే ప్రసక్తే లేదని చెబుతున్నా’అని ఉద్వేగంగా వ్యాఖ్యానించారు. తప్పుడు వార్తలతో అవమానించొద్దు హుజూరాబాద్ సభలో తాను చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించడంతో మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. ఈ విషయంపై కొన్ని పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో తనపై వస్తున్న వార్తల గురించి వివరణ ఇస్తూ గురువారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. ‘హుజురాబాద్‌లో కాంగ్రెస్ నాయకుడు కాసిపేట శ్రీనివాస్ చేరిక సందర్భంగా నేను చేసిన ప్రసంగాన్ని కొన్ని వార్తా ఛానళ్లు, సోషల్ మీడియాలోని కొన్ని వర్గాలు వక్రీకరించడం సరికాదు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ముమ్మాటికీ గులాబీ జెండానే ఎగురుతుంది. నేను పార్టీలో చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు గులాబీ సైనికుడినే. మా నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆరే. ఇటీవల కొన్ని పత్రికలతో పాటు, సామాజిక మాధ్యమాల్లో మా పార్టీ అంటే గిట్టనివాళ్లు, నా ఎదుగుదలను ఓర్వలేనివారు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నన్ను ఒక కులానికి ప్రతినిధిగా, డబ్బులకు ఆశపడే వ్యక్తిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హుజురాబాద్ సభలో చిల్లరవార్తలు వద్దని చెప్పాను. తెలంగాణ ఉద్యమం ప్రారంభమయ్యే నాటికే నేను పది లక్షల కోళ్ల ఫారానికి యజమానినని చెప్పాను. కమలాపుర్ (ప్రస్తుత హుజురాబాద్) నియోజకవర్గానికి నన్ను పంపించి, ఇక్కడ పోటీ చేయించి గెలిపించింది మా నాయకుడు కేసీఆర్ అని చెప్పడంతో పాటు.. మేము గులాబీ సైనికులమని, రాజకీయాల్లోకి సంపాదించుకోవడానికి రాలేదని వివరణ ఇచ్చాను. నేను పార్టీలో, ఉద్యమంలో చేరేనాటికే పారిశ్రామికవేత్తను అనే విషయాన్ని కూడా స్పష్టం చేశాను. ఓ పార్టీ నాయకుడు ఇటీవల పత్రికలో వచ్చిన కథనంపై స్పందించాలని వేదికపై కోరడంతో ఆ పత్రికపై నేను చేసిన కామెంట్లలో రంధ్రాన్వేషణ చేయడం సరికాదు. ఉద్యమ సమయంలో పార్టీ మారాలని వివిధ రకాల ఒత్తిళ్లు వచ్చినా లొంగిపోలేదు. తెలంగాణ ఉద్యమ పుణ్యానే నేను ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. నిరాధారమైన వార్తలను ప్రసారం చేయడం ఆపడంతో పాటు, సోషల్ మీడియా కూడా నా ప్రసంగ పాఠాన్ని పూర్తిగా విని సంయమనం పాటించాలి’అని మంత్రి ఈటల పేర్కొన్నారు. -
మీ ఆశీర్వచనం గావాలె
సాక్షిప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారం కావడంతో తనకు కలిసొచ్చిన కరీంనగర్ గడ్డ ఖ్యాతిని ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు మరోసారి గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు టీఆర్ఎస్ ఉద్యమ వేదికను ప్రకటించినప్పుడు కరీంనగర్ పోరాటాల గడ్డ సద్ది గట్టి పంపిందని తెలిపారు. అదే కరీంనగర్ నుంచే జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశానికి సంబంధించి ప్రకటన చేస్తున్నట్లు అశేష జనవాహని ఆమోదం మధ్య కేసీఆర్ వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తొలి ప్రచార బహిరంగ సభను కరీంనగర్లో ఆదివారం ఏర్పాటుచేయగా.. సీఎం కేసీఆర్ ఉద్విగ్నభరితమైన ప్రసంగం చేశారు. ఇందుకోసం గెలిపించాలి... కాంగ్రెస్, బీజేపీల తీరుపై గతంలో ఎన్నడూ లేని రీతిలో ధ్వజమెత్తిన కేసీఆర్... ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తన సహజమైన రీతిలో చురకలటించారు. రాష్ట్రం నుంచి టీఆర్ఎస్ 16 లోక్‌సభ సీట్లను గెలుచుకోవాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ, దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు ఆ సీట్లు అవసరమని స్పష్టం చేశారు. ఎన్నికల తర్వాత అవసరమైతే జాతీయ పార్టీని స్థాపించి, దేశ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు చివరి రక్తపు బొట్టు వరకు పోరాడతానని ప్రతిజ్ఞ చేశారు. 18 సంవత్సరాల క్రితం టీఆర్ఎస్ ఆవిర్భావం తరువాత 2001 మే 17న ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో జరిగిన సభలో తెలంగాణ తెస్తనని విస్పష్టంగా ప్రకటించిన కేసీఆర్ 2014లో తన కలను సాకారం చేసుకున్నారు. నాటి భారీ బహిరంగసభ పార్టీ బలాన్ని పెంచి రాష్ట్ర, దేశ ప్రజలను ఆశ్చర్యానికి గురి చేయగా, ఆదివారం నాటి కరీంనగర్లో జరిగిన ఎన్నికల ప్రచార సభ దేశ రాజకీయాల్లో కేసీఆర్ పాత్రను మరో సారి జాతి దృష్టిని ఆకర్షించింది. కరీంనగర్ ప్రజల ఆశీర్వచనం కోసమే.. పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభను కరీంనగర్లో ఏర్పాటు చేసింది జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే ముందు ఈ గడ్డ ప్రజల ఆశీర్వచనం తీసుకునేందుకేనని కేసీఆర్ ప్రకటించారు. దేశ రాజకీయాల్లోకి తనను వెళ్లమంటారా అంటూ ఒకటికి, రెండు సార్లు ప్రశ్నించిన కేసీఆర్ వారి సంఘీభావం తెలిపేందుకు చేతులెత్తాలని కోరారు. దీంతో ప్రజలంతా లేచి నిలబడి ‘పీఎం కేసీఆర్... దేశ్ కీ నేత కేసీఆర్’ అని నినాదాలు చేస్తూ తమ మద్దతు ప్రకటించారు. సభకు హాజరైన ప్రజలతో పాటు వేదికపై కూర్చొన్న ప్రతీ నాయకుడు లేచి చప్పట్లు కొడుతూ కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతించడం విశేషం. వినోద్‌ను మంత్రిని చేస్తా.. తెలంగాణ ఉద్యమంలో తన వెన్నంటి ఉన్న వినోద్‌కుమార్‌ను కరీంనగర్ ఎంపీగా మరోసారి భారీ మెజారిటీతో గెలిపించాలని సీఎం కేసీఆర్ కోరారు. ఆయన గెలిచి, కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి వస్తే కేంద్రమంత్రి అవుతారని స్పష్టం చేశారు. కరీంనగర్ ప్రజలు ఎప్పుడూ తన వెంటే ఉన్నారని పేర్కొన్నారు. లక్షన్నరకు పైగా జనం కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్ కాంప్లెక్స్‌లో జరిగిన సీఎం ఎన్నికల ప్రచార సభకు లక్షన్నరకు పైగా జనం తరలివచ్చారు. దీంతో కరీంనగర్ రోడ్లన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. మానేర్‌డ్యాం కింద ఈ మైదానం ఉండడంతో సిరిసిల్ల, వేములవాడ, హుజురాబాద్, మానకొండూరు నుంచి వాహనా ల్లో వచ్చిన పార్టీ శ్రేణులు, ప్రజలు నేరుగా బ్రిడ్జి పై నుంచే మానేర్ డ్యాంకు వచ్చి నిలిపారు. ఈ మేర కు చాలా మంది డ్యాం కట్ట పైనుంచే జరుగుతున్న కార్యక్రమాన్ని వీక్షించారు. సీఎంతో పాటు పలు వురు నేతలు డ్యాం పైనున్న వారిని కిందికి రమ్మని కోరినా రాలేదు. సభలో ఉన్నంత జనం కట్ట మీదున్నారని సీఎం వ్యాఖ్యానించడం గమనార్హం. ఎన్నికల కోడ్‌తో అలంకరణకు బ్రేక్ కరీంనగర్లో సీఎం రాక సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పలు కూడళ్లలో గులాబీ తోరణాలు కట్టించారు. ఎక్కడా టీఆర్ఎస్, కారు గుర్తులు లేకపోయినా ఎన్నికల నిబంధనల మేరకు మునిసిపల్ సిబ్బంది వాటిని తొలగించారు. సాయంత్రం సభ అయిపోగానే తీసివేస్తామని ఎమ్మెల్యేతో పాటు కార్పొరేటర్లు కోరినా మునిసిపల్ సిబ్బంది వినలేదు. -
నేడు జిల్లాకు గులాబీ దళపతి రాక
సాక్షి, యాదాద్రి : టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం జిల్లాకు రానున్నారు. భువనగిరిలో ఎన్నికల ప్రచారసభలో ఆయన పాల్గొననున్నారు. సెప్టెంబర్ 6న శాసనసభను రద్దు చేసి వెంటనే ప్రకటించిన తొలి జాబితాలో భువనగిరి టీఆర్ఎస్ అభ్యర్థిగా పైళ్ల శేఖర్‌రెడ్డిని ప్రకటించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ రద్దు తర్వాత కేసీఆర్ నల్లగొండలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. సోమవారంతో నామినేషన్ల ప్రక్రియ పూర్తికావడంతో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అందులోభాగంగా బుధవారం భువనగిరితోపాటు నల్లగొండ జిల్లాలోని నకిరేకల్, దేవరకొండలో నిర్వహించే బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొననున్నారు. జిల్లాలోని భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించే బహిరంగ సభకు కేసీఆర్ హాజరుకానున్నారు. సభ నిర్వహణకు కళాశాల మైదానంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. సుమారు 30 వేల మంది సభకు తరలివస్తారని అంచనా వేస్తున్నారు. సభాస్థలిని పరిశీలించిన శేఖర్‌రెడ్డి.. కేసీఆర్ పాల్గొని ప్రసంగించే ఎన్నికల బహిరంగ సభ ప్రాంగణాన్ని, వేదికను తాజా మాజీ ఎమ్మె ల్యే, టీఆర్ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా శేఖర్‌రెడ్డి కళాశాల మైదానాన్ని పూర్తి గా కలియ తిరుగుతూ ఏర్పాట్లకు సంబంధించి పలు సూచనలను చేశారు. ఆయన వెంట గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్‌గౌడ్, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ కొలుపుల అమరేందర్, మున్సిపల్ చైర్పర్సన్ నువ్వుల ప్రసన్న, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గోమారి సుధాకర్‌రెడ్డి ఉన్నారు. డీసీపీ ఆధ్వర్యంలో భద్రత పర్యవేక్షణ.. రాచకొండ పోలీస్ కమిషనరేట్ భువనగిరిజోన్ డీసీపీ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో భద్రతను ప ర్యవేక్షిస్తున్నారు. బహిరంగ సభ జరిగే ప్రాంతాన్ని, హెలిపాడ్ స్థలాలను పోలీసులు క్షుణ్నంగా తనిఖీ చేశారు. భద్రతాపరమైన కోణంలో తీసుకోవాల్సిన చర్యలను ఏసీపీ జితేందర్‌రెడ్డి, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలకు వివరించారు. డాగ్‌స్క్వాడ్‌తో సభా ప్రాంగణాన్ని, వేదిక పరిసరాలను పరిశీలించారు. వేలాదిగా తరలివస్తారు : పైళ్ల కేసీఆర్ బహిరంగ సభకు జనం వేలాదిగా తరలివస్తారని టీఆర్ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం సాగు, తాగునీటికి అధిక ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. ఇందులో భాగంగా గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్లతో ఈ ప్రాంతానికి సాగునీరు అందించనుందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలే మరోసారి టీఆర్ఎస్ను గెలిపించబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలతో బహిరంగ సభ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. -
భారీ సభకు గులాబీ ప్లాన్
సాక్షి, యాదాద్రి : శాసనసభ ముందస్తు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా గులాబీ పార్టీ దళపతి ముఖ్యమంత్రి కేసీఆర్ తన శైలీలో వ్యూహ రచన చేస్తున్నారు. ఎన్నికల ప్రచార సభలతో క్యాడర్లో మరింత జోష్ పెంచడానికి సిద్ధమయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి అసెంబ్లీతోపాటు, నకిరేకల్, తుంగతుర్తి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయనున్న ఎన్నికల సభకు హాజరయ్యేలా షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. దీంతో జిల్లాలోని ఆ పార్టీ శ్రేణులు కేసీఆర్ హాజరయ్యే సభలను భారీగా నిర్వహించాలనే తలంపుతో పక్కా ప్లాన్ చేసుకుంటున్నాయి. పక్కా వ్యూహంతో.. భువనగిరి నియోజకవర్గంలో టీఆర్ఎస్, మహాకూటమి, యువతెలంగాణ, సీపీఎం, సమాజ్ వాది, ఆప్, బీఎస్పీ వంటి పార్టీలతోపాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే నామినేషన్ల ఘట్టం ప్రారంభం నుంచే ప్రధాన పార్టీలు తమ బల ప్రదర్శనతో సత్తాను చాటుకుంటున్నాయి. కాంగ్రెస్ ఇప్పటికే నామినేషన్ సందర్భంగా భారీ ర్యాలీని నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే టీఆర్ఎస్ అభ్యర్థి కూడా 19వ తేదీన నామినేషన్ వేసే సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించబోతున్నారు. అన్ని పార్టీలు కూడా పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నాయి. నేడు పైళ్ల నామినేషన్.. భువనగిరి పట్టణం, భువనగిరి, వలిగొండ, బీబీనగర్, భూదాన్‌పోచంపల్లి మండలాలతో కూడిన ఈ నియోజకవర్గంలో ఈ సారి ఎన్నికలు పోటా పోటీగా జరుగుతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సెప్టెంబర్ 6 శాసన సభ రద్దు చేసిన సీఎం కేసీఆర్ ఆరోజే తమ పార్టీ అభ్య ర్థులను ప్రకటించడంతో తాజా మాజీ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్‌రెడ్డి తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నా రు. ముందుగా అనుకున్న ప్రకారం నామినేషన్ దాఖలు చేసే చివరి రోజున భారీ జనసమీకరణ తో ర్యాలీ నిర్వహించాలని అనుకున్నారు. కానీ కేసీఆర్ ఎన్నికల బహిరంగ సభకు సైతం టీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ఇప్పటికే ఊపుమీదున్న శ్రేణులకు మరింత ఊపు తీసుకురా వడానికి సీఎం సభ ఉపయోగపడుతుందని అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డి నమ్మకంతో ఉన్నారు. గులాబీ బాస్ కేసీఆర్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఈ నెల 21, 23 తేదీల్లో నిర్వహించనున్న ఎన్నికల సభల్లో భువనగిరి నియోజకవర్గం ఉంది. 21న దేవరకొండ, నకిరేకల్, భువనగిరి నియోజకవర్గాల్లో, 23న తుంగతుర్తి, సూర్యాపేటల్లో కేసీఆర్ ఎన్నికల బహిరంగ సభలు జరుగుతాయి. నామినేషన్ కార్యక్రమంతోపాటు, బహిరంగ సభకు భారీ జనసమీకరణ చేస్తామని టీఆర్ఎస్ నాయకుడొకరు సాక్షితో చెప్పారు. జనసమీకరణపై ప్రత్యేక దృష్టి.. 19న నామినేషన్ల ఘట్టం పూర్తి కావడంతోనే ఎన్నికల సభలకు ప్రణాళికను సిద్ధం చేసిన కేసీఆర్ ఈనెల 21న భువనగిరిలో బహిరంగ సభకు హాజరవుతున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మ కంగా తీసుకున్న శేఖర్‌రెడ్డి తన క్యాడర్‌ను కార్యక్రమం సక్సెస్ కోసం దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతోపాటు తిరిగి అధికారంలోకి వస్తే చేపట్టే మేనిపెస్టోను ఈ బహిరంగ సభద్వారా గులాబీ దళపతి ప్రజలకు వివరించనున్నారు. దీంతో ఎన్నికల ప్రచారం మరింత క్షేత్రస్థాయికి తీసుకుపోవడానికి ప్రతి గ్రామం నుంచి క్యాడర్‌ను తరలించేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు. ఇప్పటికే కొంగర కలాన్ ప్రజా ఆశీర్వాద సభ, నల్లగొండలో కేసీఆర్ సభలకు జనం భారీగా తరలివచ్చారు. ఈ అనుభవాలతో భువనగిరిలో జరగబోయే సభకు భారీగా జనసమీకరణ చేసేందుకు సన్నాహాల్లో తలమునకలయ్యారు. దీంట్లోభాగంగా టీఆర్ఎస్ నాయకులు బహిరంగ సభ జరిగే జూనియర్ కళాశాల మైదానాన్ని పరిశీలించారు. వీరితోపాటు హెలిపాడ్ స్థలాన్ని డీసీపీతోపాటు సీఎం సెక్యూటిటీ అధికారులు ఇప్పటికే పరిశీలించారు. కళాశాల మైదానం పరిశీలన.. భువనగిరిలో సీఎం కేసీఆర్ ఎన్నికల సభ నిర్వహించే స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానాన్ని ఆదివారం పోలీసులు పరిశీలించారు. సీఎం భద్రతా అధికారులు, స్థానిక పోలీసులు, వివిధ శాఖల అధికారులు పరిశీలించారు. మధ్యాహ్నం 2.30 గంటలకు సీఎం హాజరవుతారని, ఇందుకోసం జిన్నింగ్ మిల్ వద్ద హెలిపాడ్, కళాశాల గ్రౌండ్లో బహిరంగ సభ జరుగుతుందని భువనగిరి ఏసీపీ జితేందర్‌రెడ్డి సాక్షితో చెప్పారు. భద్రతా పరమైన ఏర్పాట్లను కట్టుదిట్టం చేశామని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ సభస్థలాన్ని పరిశీలించిన అధికారులు భువనగిరిఅర్బన్ : ఈ నెల 21న భువనగిరిలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే బహిరంగ సభకు ఆపద్ధర్మ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రానున్నారు. ఈనేపథ్యంలో ఆదివారం భువనగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్‌ను భువనగిరి డీసీపీ రామచంద్రారెడ్డి, ఏసీపీ జితేందర్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ అధికారులు, ఫైర్‌స్టేషన్ అధికారులు పరిశీలించారు. అనంతరం అక్కడి నుంచి పట్టణ శివారులో ఉన్న భువనగిరి శివారులోని జిన్నింగ్ మిల్లు సమీపంలో ఏర్పాటు చేసే హెలిప్యాడ్ ల్యాండింగ్ స్థలా న్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఐఎస్ డబ్ల్యూ వెంకటేశ్వర్లు, ఫైర్‌స్టేషన్ జిల్లా అధికారి అశోక్, పట్టణ సీఐ వెంకన్న, ట్రాఫిక్ సీఐ ఈర్ల శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్ జనార్దన్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
అంతకు మించి!
సాక్షి వనపర్తి : నిన్న కాంగ్రెస్ సింహగర్జన.. నేడు టీఆర్ఎస్ బహిరంగ సభ.. ఇరు పార్టీలు ఒకే వేదికను ఎంచుకోవడం ఒక ఎత్తయితే సింహగర్జనకు వచ్చిన జనానికి మించి నేడు జరిగే బహిరంగ సభలో జనం భారీగా కనిపించాలని టీఆర్ఎస్ నాయకులు ఏర్పాట్లు చేస్తుండటం మరో ఎత్తు. ప్యాలెస్ ప్రాంగణంలో పెద్దపెద్ద కటౌట్లు.. ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలతో హడావుడి చేశారు. ఇరుపార్టీల సందడి చూస్తుంటే ఏడాది ముందుగానే ఇక్కడి నాయకులు బల ప్రదర్శనకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపనలు జిల్లాలో నేడు ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పర్యటించనున్నారు. పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. ఉదయం 10.20 గంటలకు కొత్తకోట చేరుకొని అక్కడ చేనేత కార్మికులను కలుసుకుంటారు. అటునుంచి మదనాపురం చేరుకొని డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి అక్కడ పాఠశాలలో నిర్వహించనున్న సభలో పాల్గొంటారు. అటు నుంచి కానాయపల్లిలో మిషన్‌భగీరథ బల్క్ సప్లయి ప్రారంభించి వనపర్తి మండలంలోని అచ్యుతాపురం గ్రామానికి 12.15 నిమిషాలకు చేరుకుంటారు. అక్కడ గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించి మిషన్ భగీరథ ఇంట్రా విలేజ్ పనులను సైతం ప్రారంభించనున్నారు. 12.30 నిమిషాల నుంచి వనపర్తి పట్టణంలో పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో పాల్గొంటారు. సాయంత్రం 5.30 గంటలనుంచి 7.30 వరకు జిల్లాకేంద్రంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. రాజుకున్న ఎన్నికల వేడి సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాది ఉన్నా జిల్లాలో రాజకీయ వేడి అపుడే రాజుకుంది. ఒక పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించి విజయవంతం చేస్తే మరో పార్టీ దానికి ప్రత్యామ్నాయంగా మరో కార్యక్రమాన్ని రూపొందిస్తోంది. ఆ వేదికగా ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు చేయడం మొదలెట్టారు. సరిగ్గా 25 రోజుల కిందట పాలిటెక్నిక్ మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సింహగర్జన కార్యక్రమం విజయవంతమైంది. ఇప్పుడు అదే మైదానంలో టీఆర్ఎస్ పార్టీ బహిరంగసభ నిర్వహించనుంది. అయితే భారీ స్థాయిలో జనా న్ని సమీకరించేంందుకు పది రోజులుగా ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేసుకుని గ్రామాల్లో పర్యటిస్తున్నారు. చోటామోటా నాయకుల సహకారంతో కనీసం 20వేల మందికి పైగా సభకు తరలించాలని వ్యూహం రచించారు. కేటీఆర్ ప్రసంగంపై చర్చలు మంత్రి కేటీఆర్ కొన్నిరోజులుగా ఏ జిల్లాలో పర్యటించినా, ఏ సభల్లో పాల్గొన్నా ప్రధాన ప్రతిపక్ష మైన కాంగ్రెస్‌పై, ఆ పార్టీ నాయకులపై మాటల యుద్ధం చేస్తున్న విషయం తెలుస్తూనే ఉంది. అయితే 25 రోజుల కిందట కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన సింహగర్జనలో రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే జి.చిన్నారెడ్డిలు కేసీఆర్‌పై ఆయన కుటుంబంపై, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పైనా మాటలతో విరుచుకు పడ్డారు. ఇప్పుడు అదే ప్రాంతంలో నిర్వహించే బహిరంగ సభలో కేటీఆర్ ఎలాంటి ప్రసంగం చేస్తారోనని సర్వత్రా చర్చనీయాంశమైంది. సింగిరెడ్డి దంపతుల విస్తృత ప్రచారం బహిరంగ సభను విజయవంతం చేయాలని సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నిరంజన్‌రెడ్డి ఓ పక్క, ఆయన సతీమణి వాసంతి ఓ పక్క గ్రామాల్లో పర్యటిస్తున్నారు. గురువారం శ్రీరంగాపురం, జానంపేట, వెంకటాపురం గ్రామాల్లో ఆయన సతీమణి పర్యటిం చగా, జిల్లా కేంద్రం, మదనాపురంలో ఏర్పాటుచేసే బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను నిరంజన్‌రెడ్డి పర్యవేక్షించారు. మొదటి సారి గా మంత్రి కేటీఆర్ జిల్లాకు రానున్న నేపథ్యంలో కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చి ఘనస్వాగతం పలకాలనీ, సభకు భారీగా జనాన్ని తీసుకరావాలని సూచించారు. -
టీఆర్ఎస్ సమావేశం రసాభాస
సాక్షి, మధిర(ఖమ్మం జిల్లా): అధికార పార్టీ మధిర నియోజకవర్గ స్థాయి సమావేశంలో కార్యకర్తలు కుర్చీలతో కొట్టుకున్నారు. మధిర రెడ్డిగార్డెన్ ఫంక్షన్ హాల్లో బుధవారం టీఆర్ఎస్ నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు పూర్తిగా అమలు జరగాలంటే కార్యకర్తలు సమర్థవంతంగా పనిచేయాలని ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరావు అన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు బేగ్ మాట్లాడుతూ.. వేరే పార్టీల నుంచి వచ్చిన కొందరు అభివృద్ధి జరగటంలేదని అనటం సరికాదని, ఇష్టం లేనివారు బయటకు వెళ్లవచ్చని అనడంతో సమావేశంలో కలకలం రేగింది. కొందరు వాగ్వాదానికి దిగారు. కుర్చీలు విసురుకున్నారు. తాము లేకుండానే నాయకులు అయ్యారా అంటూ ఆరోపణలకు దిగారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బేగ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై ఎంపీ పొంగులేటి జోక్యం చేసుకుని వారికి సర్దిచెప్పి సముదాయించారు. అనంతరం సమావేశం కొనసాగింది. -
చివరి రక్తం బొట్టు వరకూ పోరాడుతా: కేసీఆర్
వరంగల్: తన శరీరంలోని చివరి రక్తం బొట్టు వరకూ తెలంగాణ వ్యతిరేక శక్తులపై పోరాడుతూనే ఉంటానని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. టీఆర్ఎస్ గెలిస్తే ఒకడు చెవులు కోసుకుంటానని, మరొకడు గడ్డం పెంచుకుంటానని అంటున్నారని, 2019 ఎన్నికల్లో మనం విజయం సాధించాక ఎవరు ఏం కోసుకుంటారో చూద్దామని చెప్పారు. పదహారేళ్ల ఏళ్ల కిందట టీఆర్ఎస్ పార్టీ ఏర్పడినప్పుడు.. పార్టీ ఉండబోదని అన్నారని, కానీ అలా ఉండదని అన్నవాళ్లే ఇప్పుడు పోయారని అన్నారు. టీఆర్ఎస్ ఇప్పుడు సాధించిన కీర్తి, విజయాల క్రెడిట్ పార్టీ శ్రేణులదేనని కొనియాడారు. స్వరం నుంచి జయశంకర్ సార్ మనల్ని ఆశ్వీరదిస్తున్నారని పేర్కొన్నారు. గురువారం వరంగల్‌లో జరుగుతున్న టీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సభకు హాజరైన రైతులకు పాదాభివందనం, పార్టీ శ్రేణులకు ఉద్యమాభివందనం చేశారు. ఓరుగల్లు.. పోరుగల్లు.. అంటూ పార్టీ శ్రేణులను ఉత్సాహ పరిచారు. అన్నం తిన్నమో.. అటుకులు బుక్కినమో.. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, కష్టాలు ఎదుర్కొన్నా ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేవరకు వదిలిపెట్టలేదని, ఇప్పుడు సాధించిన తెలంగాణను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటున్నామని చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న ఆరు నెలల్లోనే కరెంటు సమస్యను అధిగమించాం. కరెంటు పోకుండా, ఒక్క బోర్ మోటార్ కాలిపోకుండా చర్యలు తీసుకున్నాం తెలంగాణలో వ్యవసాయం బోర్లపై ఆధారపడి జరుగుతుంది రైతులకు ఇబ్బందులు రాకుండా విజయవంతంగా విద్యుత్‌ను అందిస్తున్నాం పవర్ హాలీడే లేకుండా మూడు షిఫ్టులలోనూ పరిశ్రమలకు విద్యుత్‌ను అందిస్తున్నాం దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ పథకాలకు రూ. 40వేలకోట్లు అందజేస్తున్నాం పరమపథం పథకం కింద నిరుపేదలు చనిపోతే.. వారి మృతదేహాలను ఆస్పత్రి నుంచి ఇళ్లకు ఉచితంగా తరలించే సేవలు అందిస్తున్నాం ఈ ఏడాది ముగిసేలోపే ప్రతి గ్రామానికి ’మిషన్ భగీరథ’ కింద తాగునీరు అందనుంది పాలన సంస్కరణలలో భాగంగా కొత్త జిల్లాలు, కొత్త మండలాలను ఏర్పాటుచేశాం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుపరిచేందుకు, వెనుకబడిన, అణగారిన కులాల అభివృద్ధి చర్యలు తీసుకున్నాం రాష్ట్రానికి ప్రతిరోజూ 650 లారీల గొర్రెలు రోజూ దిగుమతి అవుతున్నాయి ఈ పరిస్థితి మార్చేందుకు ప్రతి గొల్ల, కురుమ కుటుంబానికి 21 గొర్రెలను అందించబోతున్నాం మొత్తం 80 లక్షల గొర్రెలు సరఫరా చేస్తాం. ఈ పథకం ద్వారా మన గొల్ల, కురుమ సోదరులు రూ. 20 కోట్ల సంపదను సృష్టించబోతున్నారు నాయి బ్రాహ్మణుల కోసం 25వేల నవీన క్షౌరశాలలు ఏర్పాటుకు రూ. లక్ష సబ్సిడీ ఇవ్వబోతున్నాం. ఐదుకోట్ల ఈత, తాటికల్లు చెట్లు పెంచే చర్యలు చేపడుతున్నాం మందు కల్లుపోవాలి, మంచి కల్లు రావాలి తెలంగాణలో ధనిక రైతాంగముండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అందుకే వచ్చే మే నెల నుంచి రూ. 4వేల చొప్పున రెండువిడతలుగా సబ్సిడీ రైతులకు అందజేయబోతున్నాం కాంగ్రెస్ నేతలు శిఖండిలా ప్రాజెక్టులు కట్టకుండా అడ్డుపడుతున్నారు నాడు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోకుండా కాంగ్రెస్ నేతలు నోళ్లు మూసుకొని ఉన్నారు అందుకే తెలంగాణ ఇలా మారింది. నా రక్తంలోని చివరిబొట్టు వరకూ తెలంగాణ వ్యతిరేక శక్తులతో పోరాడుతాను 2019 ఎన్నికల్లో విజయం టీఆర్ఎస్దే -
టీఆర్ఎస్ కార్యకర్తల బస్సులో మంటలు!
తృటిలో తప్పిన ముప్పు మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది యాదాద్రి: ఓరుగల్లులో జరుగుతున్న టీఆర్ఎస్ ఆవిర్భావ సభకు బస్సులో వెళుతున్న పార్టీ కార్యకర్తలకు పెనుముప్పు తప్పింది. టీఆర్ఎస్ కార్యకర్తలతో ప్రయాణిస్తున్న బస్సు క్యాబిన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భువనగిరి బైపాస్ వద్ద ఈ ఘటన జరిగింది. డ్రైవర్‌తోపాటు, బస్సులోని వారు మంటలను చూడటంతో ప్రమాదం తప్పింది. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకొని మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. -
వరంగల్ జనసంద్రాన్ని తలపిస్తోంది!
వరంగల్: ఆకాశాన్ని బద్దలుకొట్టి మరీ తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ సాధించారని, ఇప్పుడు సాధించుకున్న రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మలిచేందుకు ఆయన కష్టపడుతున్నారని టీఆర్ఎస్ ఎంపీ, సీనియర్ నేత కే కేశవరావు అన్నారు. వరంగల్‌లో జరుగుతున్న టీఆర్ఎస్ ఆవిర్భావ సభలో కేకే ప్రసంగించారు. గత మూడేళ్లలో ఎవరూ ఊహించని అభివృద్ధిని టీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిందని పేర్కొన్నారు. అశేష జనావళి తరలివచ్చిన వరంగల్ జనసంద్రాన్ని తలపిస్తున్నదని పేర్కొన్నారు. టీఆర్ఎస్ సర్కారు మూడేళ్లలో ఏం సాధించిందో తెలియజేయడానికే వరంగల్‌లో ఈ సభను ఏర్పాటుచేసినట్టు తెలిపారు. -
వరంగల్ జనసంద్రాన్ని తలపిస్తోంది!
-
భారీ ట్రాఫిక్‌లో చిక్కుకున్న మంత్రి కేటీఆర్!
వరంగల్: ఓరుగల్లు వేదికగా జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) 16వ ఆవిర్భావ బహిరంగ సభ హోరెత్తుతోంది. ఈ సభకు తెలంగాణ నలుమూలల నుంచి భారీగా ప్రజలను, పార్టీ శ్రేణులను నేతలు తరలించారు. దీంతో సభ ప్రాంగణం జనసందోహంతో నిండిపోయింది. సభావేదిక ఆటపాటలతో, ధూమ్‌ధామ్ నృత్యాలను ఆహూతులను అలరిస్తోంది. మరికాసేపట్లో బహిరంగ సభ ప్రారంభం కానుండగా.. హైదరాబాద్-వరంగల్ రహదారిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పెద్ద ఎత్తున వాహనాలు ఓరుగల్లు వైపు వస్తుండటంతో ఆ దారి ట్రాఫిక్‌తో కిక్కిరిసిపోయింది. ఈ ట్రాపిక్లోనే పలువురు మంత్రులు చిక్కుకున్నట్టు సమాచారం. మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డిలు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు. భారీ ట్రాఫిక్‌లో కేటీఆర్ చిక్కుకోవడంతో ఆయన సభకు రావడం కష్టమేనని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. -
సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు
హన్మకొండ : ఈ నెల 27న వరంగల్ లో నిర్వహించనున్న టీఆర్ఎస్ బహిరంగ సభ ఏర్పాట్లను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి హరీశ్‌రావు మంగళవారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఆశీర్వదించేందుకు ప్రజలు సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు. పార్టీ బహిరంగ సభకు అంచనాలకు మించి జనం హాజరవుతారన్నారు. బహిరంగ సభాస్థలంలో ఏర్పాట్లు అద్భుతంగా జరుగుతున్నాయని వెల్లడించారు. మరోసారి చరిత్ర తిరగరాసే విధంగా బహిరంగ సభను నిర్వహిస్తామని హరీశ్‌రావు స్పష్టం చేశారు. సభకు హాజరయ్యేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. -
సై అంటూ.. చిందేసిన హోం మంత్రి
టీఆర్ఎస్ 14వ ఆవిర్భావ సభ సికింద్రాబాద్‌లోని పెరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా ప్రారంభమైంది. ముందుగా 'తెలంగాణ ధూంధాం'తో కళాకారులు, నాయకులు ప్రజల్లో ఉత్సాహాన్ని రేకెత్తించారు. ముఖ్యంగా.. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి తదితరులు తెలంగాణ పాటలకు వేసిన స్టెప్పులు అందరినీ అలరించాయి. వాళ్లిద్దరితో పాటు కొందరు మహిళా నేతలు, ఎంపీ జితేందర్ రెడ్డి కూడా కాలు కదిపారు. 'నడుస్తున్న పొద్దుమీద పొడుస్తున్న కాలమా.. పోరు తెలంగాణమా' అంటూ నేపథ్యంలో వినిపిస్తున్న పాటలకు వాళ్లంతా డాన్సులు చేశారు. -
నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ రాష్ర్ట సమితి(టీఆర్ఎస్) బహిరంగ సభ సందర్భంగా హైదరబాద్‌లో పోలీసులు సోమవారం ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పరేడ్ మైదానం సమీపంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయి. సాధారణ ప్రయాణికులు సురభి గార్డెన్ నుంచి జూబ్లీ బస్‌స్టేషన్, స్వీకార్ ఉపకార్ మీదగా వైఎంసీఏ వైపు వెళ్లాల్సి ఉంటుంది. వైఎంసీఏ నుంచి ఎస్బీహెచ్ కూడలి వైపు వెళ్లే వారిని క్లాక్ టవర్, జేబీఎస్ వైపు పంపుతారు. -
మాది పేదలపక్షం
పేదల సంక్షేమం, వ్యవసాయం, పారిశ్రామికానికి ప్రాధాన్యం టీఆర్ఎస్ విస్తృత స్థాయి భేటీలో మూడు ప్రాథమ్యాలను ఆవిష్కరించిన కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణను ఎలా ముందుకు తీసుకెళ్లాలో సమాలోచనలు చేశాం. టీఆర్ఎస్ ప్రభుత్వం మూడు లక్ష్యాలతో పనిచేస్తుంది. నిరుపేదల పక్షపాతిగా ఉంటుంది. వారి సంక్షేమానికే తొలి ప్రాధాన్యం. రెండోది వ్యవసాయం. ఈ రంగం నుంచి ఖజానాకు ఆదాయం తక్కువైనా ఎక్కువ మంది ప్రజలకు అదే ఆధారం. రైతన్నలు సల్లగుంటేనే మనం పిడికెడు అన్నం తింటం.. సుఖంగా శాంతంగా ఉంటం. మూడోది, రాష్ట్రం ఆర్థికంగా పురోగతి సాధించాలంటే, యువతకు ఉపాధి అవకాశాలు రావాలంటే పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించాల్సి ఉంటుంది. ఈ దిశలో పని విధానాన్ని విభజన చేసుకుని ముందుకుపోతున్నాం’ అని టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని కొంపల్లిలో మంగళవారం జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యాలు, ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలు, ఇతర అంశాలను కార్యకర్తలకు ఆయన ఈ సందర్భంగా వివరించారు. రాష్ట్రంలో అర్హుడైన ప్రతి ఒక్క వ్యక్తికీ సాయం చేస్తామని, వెనక్కి పోయే ప్రసక్తే లేదని కేసీఆర్ తెలిపారు. ఆకలి చావుల నేతన్నలు, వివిధ వృత్తుల్లో కష్టాలు పడుతున్న వారి బాధలన్నీ వరుసగా పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. పంట రుణాల మాఫీకి రూ. 17 వేల కోట్ల భారాన్ని మోశామన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం అక్కడి రైతులను, డ్వాక్రా మహిళలను మోసం చేశారని విమర్శించారు. దళితులకు మూడెకరాల భూమి పంపిణీ కార్యక్రమం ఈ బడ్జెట్ తర్వాత వేగవంతమవుతుందని, ఉద్యోగుల పంపిణీని కమలనాథన్ కమిటీ పూర్తి చేశాక కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేపడతామని పేర్కొన్నారు. అమరవీరుల కుటుంబాలను ఆదుకోవడానికి రెండో విడత సిద్ధమవుతున్నామని, ప్రతీ జిల్లా కేంద్రంలో అమరవీరుల స్తూపం నిర్మిస్తామని సీఎం ప్రకటించారు. ఏటా జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంత్రులు, అధికారులు తొలుత అమరవీరులకు నివాళులర్పించాకే జాతీయ జెండావిష్కరణ చేస్తారన్నారు. ఇందుకు రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు ఇస్తామన్నారు. అత్యుత్తమ పారిశ్రామిక విధానం తెచ్చాం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సింగిల్ విండో విధానంలో పారిశ్రామిక చట్టాన్ని తెచ్చిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందని, కేవలం 15 రోజుల్లోనే ఒకే చోట అన్ని రకాల అనుమతులిస్తామని, ఈ విధానానికి దేశ, విదేశాల నుంచి అభినందనలు అందాయని సీఎం పేర్కొన్నారు. ఇన్ఫోసిస్ అధినేత నారాయణ మూర్తి కూడా దీన్ని అభినందించారని చెప్పారు. ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్, పోలీసు శాఖ ఆధునీకరణ, షీ టీమ్స్ ఏర్పాటు, మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, మైనారిటీల సంక్షేమం, లంబాడ తండాలను పంచాయతీలుగా మార్చడం, పెన్షన్లు, రేషన్ బియ్యం, హాస్టళ్లకు సన్నబియ్యం పంపిణీ వంటి ప్రభుత్వ పథకాల గురించి కార్యకర్తలకు కేసీఆర్ వివరించారు. విద్యుత్ కష్టాలూ తొలగుతాయ్ గత టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు విద్యుత్ రంగంపై నిర్లక్ష్యం వహించడంతో ఇప్పుడు కష్టాలు తప్పడం లేదని, త్వరలోనే అవి తొలగిపోతాయని సీఎం పేర్కొన్నారు. ఎన్టీపీసీ నుంచి 4 వేల మెగావాట్లు, జెన్కో నుంచి 6000 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. కృష్ణ పట్నం నుంచి రావాల్సిన విద్యుత్‌ను చంద్రబాబు అడ్డుకుంటున్నాడని, సీలేరు కరెంటుకూ ఎగబడుతున్నాడని విమర్శించారు. భూపాలపల్లి నుంచి 600 మెగావాట్లు, జైపూర్ నుంచి 1200 మెగావాట్ల విద్యుత్ అందనుందన్నారు. ప్రస్తుతం 1300 మెగావాట్లు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని, ఈ సీజన్ వరకు ఇబ్బంది పడినా, మూడేళ్ల తర్వాత రెప్పపాటు కూడా కరెంటు పోకుండా నిరంతర విద్యుత్ అందిస్తామన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాజకీయాల్లో ఓపిక ఉండాలి ‘రాజకీయాల్లో అందరికీ పదవులు రావు. కొందరికి అనుకోకుండా వస్తాయి. తమ వంతు కోసం ఎదురు చూడాలి. ఓపిక ఉండాలి. తొందరపడితే భవిష్యత్తు దెబ్బతింటుంది. పార్టీకి ఇబ్బందులు ఉంటాయి. సామాజిక, కుల సమీకరణలుంటాయి. చెట్టు నీడనే ఉండాలి. కచ్చితంగా పండు దొరుకుతుంది. ఈ మధ్యే మనం పక్కా రాజకీయ పార్టీగా మారాం. మరో 34 అసెంబ్లీ నియోజకవర్గాలు పెరగనున్నాయి. రాష్ట్రంలో మరో పార్టీకి భవిష్యత్తు లేదు. టీఆర్ఎస్కు మాత్రమే స్థానం ఉంటుంది’ అని కార్యకర్తలకు కేసీఆర్ హితవు చెప్పారు. ఓపికతో ఉంటే పదవులు ఎలా దక్కుతాయో చెప్పడానికి.. నిజామాబాద్ జెడ్పీ చైర్మన్ అనిత, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఉదంతాలను ఉదహరించారు. నియోజకవర్గాల్లో నేతలంతా సమన్వయంతో పనిచేయాలని, తాను కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌తో మాట్లాడానని, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ మొదలవుతుందని ఆయన చెప్పారని వివరించారు. నామినేటెడ్ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. వ్యవసాయ మార్కెట్ల పాత కమిటీల రద్దుపై కోర్టు తీర్పు ఉన్నందున ఆర్డినెన్సు జారీ చేశామని, ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు వస్తాయని చెప్పారు. ఒకే ఒక్కడు! టీఆర్ఎస్ విస్త్రృత స్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ మాత్రమే ప్రసంగించారు. దాదాపు గంటన్నరపాటు ఆయన ప్రసంగించాక సమావేశం ముగిసింది. మిగిలిన నేతలెవరికీ అవకాశమివ్వకపోవడం గమనార్హం. అభిప్రాయాలు చెప్పకుండానే సమావేశాన్ని ముగించడం పార్టీ నాయకుల్లో చర్చనీయాంశమైంది. వేదికపైకి పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, 12 మంది స్టీరింగ్ కమిటీ సభ్యులు మినహా ఎవరినీ ఆహ్వానించలేదు. పార్టీ ప్రజా ప్రతినిధులంతా వేదిక కిందే ఉండిపోయారు. సీఎం సభకు వచ్చే వరకు రసమయి బాలకిషన్ సహా పలువురు కళాకారులు ఆడిపాడారు. కాగా, ఈ భేటీకి మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య హాజరయ్యారు. ఆయన కూర్చున్న చోటుకు ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెళ్లి పలకరించడం అందరి దృష్టిని ఆకర్షించింది. -
కార్యకర్తలే వెన్నూదన్ను
ప్రభుత్వ కార్యక్రమాల్లో మమేకం చేసేందుకు కార్యాచరణ హైదరాబాద్‌లో నేడు టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం పార్టీ వర్గాల్లో విభేదాలపై దృష్టి, జిల్లాల్లో సమన్వయానికి సూచనలు టీఆర్ఎస్ బలోపేతానికి దిశానిర్దేశం చేయనున్న సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: పార్టీ సంస్థాగత నిర్మాణంపై తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) నాయకత్వం దృష్టి పెట్టింది. ప్రభుత్వ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యకర్తల సేవలను మరింతగా వినియోగించుకోవాలన్న ఆలోచనకు వచ్చింది. సార్వత్రిక ఎన్నికల వరకు పార్టీ కార్యకలాపాలు విస్తృతంగా జరిగినప్పటికీ ఆ తర్వాత అవి పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో అన్ని జిల్లాల్లో పార్టీ కేడర్‌లో నిస్తేజం ఆవరించింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ శ్రేణులను ఉత్తేజపరిచేందుకు పార్టీ అధ్యక్షుడు, సీఎం కె.చంద్రశేఖర్‌రావు సిద్ధమయ్యారు. ఇందులోభాగంగానే మంగళవారం హైదరాబాద్‌లోని కొంపల్లిలో రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సందర్భంగా చర్చించనున్నారు. అన్ని స్థాయిల్లోనూ నేతలకు, కార్యకర్తలకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. పాత, కొత్త కలయికతో కయ్యం ఎన్నికల ముందు, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ పార్టీల నుంచి పలువురు నేతలు తమ అనుచరగణంతో పాటు టీఆర్ఎస్లో చేరారు. ఇతర పార్టీల తరఫున ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్పర్సన్లు కూడా అధికార పార్టీవైపు వచ్చారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో మొదటి నుంచీ పనిచేస్తున్న వారికి, కొత్తగా పార్టీలో చేరిన వారికి మధ్య పొసగడం లేదు. ముఖ్యంగా కాంగ్రెస్, టీడీపీల నుంచి టీఆర్ఎస్లోకి వచ్చిన ఎమ్మెల్యేలతో ఆయా నియోజకవర్గాల్లో పాత, కొత్త కార్యకర్తల మధ్య సమన్వయం లేకుండా పోయింది. ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్లో చేరిన తుమ్మల నాగేశ్వర్రావు వర్గానికి అప్పటికే జిల్లా నాయకుడిగా ఉన్న పార్లమెంటరీ కార్యదర్శి వెంకట్రావు అనుచరులకు మధ్య పొసగడం లేదంటున్నారు. హైదరాబాద్‌లోనూ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, పద్మారావుగౌడ్ అనుచరులూ కలిసి పనిచేయలేకపోతున్నారు. ఆదిలాబాద్ జిల్లా ముథోల్, వరంగల్ జిల్లా డోర్నకల్‌లోనూ ఎమ్మెల్యేల చేరికతో ఇదే పరిస్థితి తలెత్తుతోందని పార్టీ వర్గాలు అంటున్నాయి. నల్లగొండ జిల్లా కోదాడలో నియోజకవర్గ ఇన్చార్జికి, పార్టీలోకి వచ్చిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్గానికి మధ్య పొంతన కుదరడం లేదు. దాదాపు అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉందంటున్నారు. దీనిపై పార్టీ నాయకత్వం దృష్టి సారించింది. విస్తృత స్థాయి భేటీలో పార్టీ అధ్యక్షుడు ఈ విషయమై పలు సూచనలు చేయనున్నట్లు సమాచారం. కాగా, పార్టీ అధ్యక్షునిగా ఉన్న సీఎం కేసీఆర్ వచ్చే ఏప్రిల్‌లో తిరిగి అధక్షుడిగా ఎన్నికయ్యే అవకాశముందంటున్న టీఆర్ఎస్ వర్గాలు మరో కొత్త అంశాన్ని తెరపైకి తెస్తున్నాయి. సీఎంగా తీరిక లేకుండా గడిపే ఆయన పార్టీ వ్యవహారాలనూ పూర్తి స్థాయిలో పర్యవేక్షించడం కష్టం కనుక తనకు సహాయకారిగా ఉండేందుకు వర్కింగ్ ప్రెసిడెంట్‌ను నియమిస్తారన్న ప్రచారం జరుగుతోంది. అయితే, మంగళవారం నాటి సమావేశంలో ఈ ప్రస్తావన తెస్తారా లేదా అని పార్టీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది. ప్రభుత్వానికి దూరంగా కార్యకర్తలు వాస్తవానికి పార్టీ కార్యకర్తల ద్వారానే ఏ ప్రభుత్వమైనా అభివృద్ధి సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని చూస్తుంది. కానీ, టీఆర్ఎస్ కార్యకర్తలను ప్రభుత్వంతో మమేకం చేయడంలో నాయకత్వం దృష్టి పెట్టలేదన్న అభిప్రాయం బలంగా ఉంది. దీనికి కొందరు ‘ఆసరా’ పెన్షన్ల పథకాన్ని ఉదహరిస్తున్నారు. కేవలం అధికార యంత్రాంగాన్నే నమ్మడం, స్థానిక నాయకత్వాన్ని విశ్వాసంలోకి తీసుకోకపోవడంతో అవినీతికీ ఆస్కారం ఏర్పడిందని చెబుతున్నారు. పెన్షన్ల విషయంలో చివరకు నాయకులు గ్రామాలకు వెళ్లలేని స్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిలో మార్పుతెచ్చేందుకు ఇకపై ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా కార్యకర్తలను వినియోగించుకోవాలనే ఆలోచనలో అధినేత ఉన్నట్లు చెబుతున్నారు. ఈ అంశాలన్నింటిపైనా సీఎం దిశా నిర్దేశం చేయడంతో పాటు సంస్థాగత కార్యక్రమాల షెడ్యూలును కూడా ప్రకటించే అవకాశముంది. సభ్యత్వ నమోదు కూడా మంగళవారం నుంచే మొదలయ్యే వీలుందని తెలుస్తోంది. ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టేందుకు పార్టీ అడహక్ కమిటీని ప్రకటించే అవకాశముంది. అదేమాదిరిగా జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో నగర పార్టీ బాధ్యతలను పంచాయతీరాజ్ శాఖా మంత్రి కేటీఆర్‌కు అప్పగించే వీలుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
పదేళ్ల సమస్యకు మూడు నెలల్లో పరిష్కారమా?
-
పదేళ్ల సమస్యకు మూడు నెలల్లో పరిష్కారమా?
హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ సమస్యకు 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనే కారణమని సీఎం కేసీఆర్ విమర్శించారు. పదేళ్లుగా ఉన్న కరెంట్ సమస్య 3 నెలల్లో ఎలా పరిష్కారం అవుతుందని ఆయన ప్రశ్నించారు. తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే తెలంగాణ శాపంగా మారతాయని అన్నారు. ఏం చేసినా ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. ఆదివారం జరిగిన టీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఉద్యమకారులెవరో ప్రజలకు తెలుసునని అన్నారు. పదవులను తృణప్రాయంగా వదిలిన పార్టీ తమదని గుర్తుచేశారు. రుణమాఫీ చేస్తాం, హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. -
సీమాంధ్రకు వైఎస్ జగనే సీఎం: కేసీఆర్
హైదరాబాద్: సీమాంధ్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) కె. చంద్రశేఖరరావు అన్నారు. ఏపీలో జగన్ సీఎం కాబోతున్నారని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వందకుపై అసెంబ్లీ సీట్లు వస్తాయని తమ సర్వేలో తేలిందన్నారు. సీమాంధ్రలో ఏర్పడే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామన్నారు. సీమాంధ్రతో అనేక సమస్యలతో చర్చించుకోవాల్సివుంటుందన్నారు. చంద్రబాబు నాయుడు కథ ముగిసిందన్నారు. తెలంగాణ, సీమాంధ్రలో టీడీపీ మట్టికరవడం ఖాయమన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలిచే అసెంబ్లీ స్థానాలు 23 నుంచి 35 దాటవని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ నాయకులు పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో భేటీ ముగిసిన తర్వాత కేసీఆర్ విలేకరులతో మాట్లాడారు. ఎవరి మద్దతు లేకుండా తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందన్నారు. మే 17 తర్వాత టీఆర్ఎస్ అధికార పార్టీ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తమ పార్టీ సత్తా చాటుతుందన్నారు. తాము క్యాంపులు పెడుతున్నట్టు ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలను కేసీఆర్ తోసిపుచ్చారు. క్యాంపులు పెట్టాల్సిన కర్మ తమకు లేదన్నారు. పిచ్చి ప్రచారం మానుకోవాలని హెచ్చరించారు. మీడియా హుందాతనం కాపాడుకోవాలని హితవు పలికారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు ఎట్టిపరిస్థితుల్లో మద్దతు ఇవ్వబోమన్నారు. కేంద్రంలో తమ మొదటి ప్రాధాన్యత యూపీఏ ప్రభుత్వానికేనని, లేకుంటే థర్డ్ ఫ్రంట్‌కు మద్దతిస్తామన్నారు. సోనియా, రాహుల్ గాంధీ పట్ల తమకు వ్యతిరేకత లేదని కేసీఆర్ చెప్పారు. పొన్నాల లక్ష్మయ్య బ్రోకర్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగుల విభజన, భవనాల కేటాయింపులు ప్రతిపాదనలే ఇవి ఆఖరి నిర్ణయాలు కాదన్నారు. -
సెప్టెంబర్ 6న కరీంనగర్లో టిఆర్ఎస్ బహిరంగ సభ
ఢిల్లీ: సెప్టెంబర్ 6న కరీంనగర్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు టీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ తెలిపారు. లక్షలాది మందితో ఈ సభను నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఏపీ ఎన్జీవోలు స్పష్టంగా సమస్యలు చెప్పలేకపోతున్నారన్నారు. సీమాంధ్ర ఉద్యమం తమ ఇబ్బందులు చెప్పడంలో విఫలమైందని ఆయన అభిప్రాయపడ్డారు. మందా జగన్నాధం మాట్లాడుతూ హైదరాబాద్‌లో సీమాంధ్ర ప్రజలకు పూర్తి భద్రత కల్పిస్తామని చెప్పారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రెండు కళ్ల సిద్థాంతాన్ని మళ్లీ మొదలుపెట్టారని కడియం శ్రీహరి విమర్శిచారు. చంద్రబాబు నాయుడు గోడ మీద పిల్లిలా వ్యవహరిస్తున్నారని పోచారం శ్రీనివాస రెడ్డి మండిపడ్డారు. -
పార్టీ నేతలతో కెసిఆర్ కీలక సమావేశం
-
పార్టీ నేతలతో కెసిఆర్ కీలక సమావేశం
హైదరాబాద్: మెదక్ జిల్లా ఫామ్ హౌస్‌లో టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. రాష్ట్రాన్ని విభజిస్తున్నట్లు ప్రకటించిన తరువాత పార్టీ ముఖ్య నేతలతో ఆయన మొదటి సమావేశమయ్యారు. దాంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలతోపాటు సీనియర్ నేతలను ఆహ్వానించారు. పార్లమెంటులో ఆహాభద్రత బిల్లు ప్రవేశపెడుతున్న సందర్భంగా కాంగ్రెస్ విప్ జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవల టిఆర్ఎస్లో చేరిన ఎంపి వివేక్, మందా జగన్నాధంలు విప్ పేరుతో పార్టీకి దూరంగా ఉంటున్నారు. వారిని కూడా ఈ సమావేశానికి ఆహ్వానించినట్లు తెలిసింది. ఈ సమావేశంలో భవిష్యత్ వ్యూహంపైన, పార్టీ ఉనికిని కాపాడుకోనే ప్రయత్నం గురించి చర్చిస్తారని తెలుస్తోంది. రాష్ట్ర విభజన జరిగితే పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసే అంశం కూడా చర్చిస్తారని తెలుస్తోంది.