సభ ఏర్పాట‍్లను పరిశీలించిన మంత్రులు | TRS Public Meeting in Warangal On April 27th | Sakshi
Sakshi News home page

సభ ఏర్పాట‍్లను పరిశీలించిన మంత్రులు

Published Tue, Apr 18 2017 11:06 AM | Last Updated on Tue, Sep 5 2017 9:05 AM

TRS Public Meeting in Warangal On April 27th

హన్మకొండ : ఈ నెల 27న వరంగల్ లో నిర్వహించనున్న టీఆర్‌ఎస్ బహిరంగ సభ ఏర్పాట్లను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి హరీశ్‌రావు మంగళవారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఆశీర్వదించేందుకు ప్రజలు సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు.
 
పార్టీ బహిరంగ సభకు అంచనాలకు మించి జనం హాజరవుతారన్నారు. బహిరంగ సభాస్థలంలో ఏర్పాట్లు అద్భుతంగా జరుగుతున్నాయని వెల్లడించారు. మరోసారి చరిత్ర తిరగరాసే విధంగా బహిరంగ సభను నిర్వహిస్తామని హరీశ్‌రావు స్పష్టం చేశారు. సభకు హాజరయ్యేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement