వారిచ్చే సలహాలు, సూచనలను ఉప సంఘం ఆచరణలోకి తీసుకుంటుంది
రైతుభరోసాపై అసెంబ్లీలో ఒక్క రోజంతా చర్చ జరిగేలా చూస్తాం
మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
సాక్షిప్రతినిధి, వరంగల్: ప్రజల అభిప్రాయాలనే ప్రభుత్వ ఉత్తర్వులుగా..చరిత్రాత్మక నిర్ణయంగా తీసుకురావడంలో ఎలాంటి సందేహం లేదని, రైతుభరోసా విషయంలో కూడా ప్రజల అభిప్రా యమే జీవోగా రాబోతుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రైతుల అభిప్రా యాల మేరకు శాసనసభలో రైతుభరోసా పథకం రూపకల్పనకు చర్చిస్తామని చెప్పారు. సోమ వారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లోని కాన్ఫ రెన్స్ హాల్‌లో రైతుభరోసా పథకం అమలు కోసం విధివిధానాలపై ఉమ్మడి వరంగల్ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది.
మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క, సభ్యులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితోపాటు జిల్లామంత్రులు మంత్రి కొండా సురే ఖ, ధనసరి అనసూయ (సీతక్క), ప్రభుత్వ విప్ జాటోత్ రామచంద్రునాయక్, ఎంపీలు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, హాజరయ్యారు. వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదాదేవి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో రైతులు, రైతుసంఘాల ప్రతినిధులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ రైతుభరోసా విషయంలో సంపూర్ణంగా ప్రజలు ఏం చెబితే దాన్నే అమ లు చేస్తామన్నారు. అందరి సూచనలు నోట్ చేసు కున్నామని, వాటిని ప్రభుత్వం పరిశీలిస్తుందని, అందరి అభిప్రాయానికి తగినట్టుగా సబ్‌కమిటీ నిర్ణయం తీసుకుంటుందని భట్టి విక్రమార్క చెప్పా రు. వరంగల్ నుంచే ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ రైతు æభరోసా హామీ ఇచ్చారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రైతుభరోసాపై అసెంబ్లీలో ఒక రోజంతా చర్చిస్తామని, ఆ తర్వాత అసెంబ్లీలోనే నిర్ణయం తీసుకుంటామని భట్టి పేర్కొన్నారు.
రైతుల నోటా..వైఎస్ రాజశేఖరరెడ్డి మాట
హన్మకొండ అర్బన్: ఉమ్మడి వరంగల్ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడిన రైతుల్లో 90శాతం మంది దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి పేరు ప్రస్తావించారు. నాడు వైఎస్ వల్లనే ఉచిత విద్యుత్, మద్దతుధర, సబ్సిడీ విత్తనాలు, పంట బీమా వచ్చాయని తెలిపారు. ఆయన కాలంలో వ్యవసాయం పండుగలా సాగిందని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత వ్యవసాయం గురించి, రైతుల గురించి పట్టించుకున్న ప్రభుత్వం, నాయకులు లేరన్నారు. రైతును రాజును చేయడానికి వైఎస్ కృషి చేశాడని కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment