పదేళ్ల సమస్యకు మూడు నెలల్లో పరిష్కారమా? | kcr blames congress for electricity problem in telangana | Sakshi
Sakshi News home page

పదేళ్ల సమస్యకు మూడు నెలల్లో పరిష్కారమా?

Published Sun, Oct 5 2014 2:58 PM | Last Updated on Wed, Sep 5 2018 1:45 PM

పదేళ్ల సమస్యకు మూడు నెలల్లో పరిష్కారమా? - Sakshi

పదేళ్ల సమస్యకు మూడు నెలల్లో పరిష్కారమా?

హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ సమస్యకు 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనే కారణమని సీఎం కేసీఆర్ విమర్శించారు. పదేళ్లుగా ఉన్న కరెంట్ సమస్య 3 నెలల్లో ఎలా పరిష్కారం అవుతుందని ఆయన ప్రశ్నించారు. తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే తెలంగాణ శాపంగా మారతాయని అన్నారు. ఏం చేసినా ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.

ఆదివారం జరిగిన టీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఉద్యమకారులెవరో ప్రజలకు తెలుసునని అన్నారు. పదవులను తృణప్రాయంగా వదిలిన పార్టీ తమదని గుర్తుచేశారు. రుణమాఫీ చేస్తాం, హామీలన్నీ నెరవేరుస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement