
6వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయండి
ఆరువేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి రంగం సిద్ధం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ జెన్కోను ఆదేశించారు. విద్యుత్ రంగంపై ఆయన సోమవారం నాడు అధికారులతో సమీక్షించారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను గుర్తించాలని సూచించారు.
ఎన్‌టీపీసీ రామగుండంలో 4వేల మెగావాట్ల థర్మల్ పవర్ ఉత్పత్తి కోసం పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ఛత్తీస్‌గఢ్ నుంచి 2వేల మెగావాట్ల విద్యుత్ తెచ్చేలా పవర్‌లైన్ల ఏర్పాటుకు పనులు ప్రారంభించాలని తెలిపారు. జలవిద్యుత్ ఉత్పత్తికి నదులపై ప్రత్యేక సర్వే చేపట్టాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.