
సై అంటూ.. చిందేసిన హోం మంత్రి
టీఆర్ఎస్ 14వ ఆవిర్భావ సభ సికింద్రాబాద్లోని పెరేడ్ గ్రౌండ్స్లో ఘనంగా ప్రారంభమైంది. ముందుగా 'తెలంగాణ ధూంధాం'తో కళాకారులు, నాయకులు ప్రజల్లో ఉత్సాహాన్ని రేకెత్తించారు. ముఖ్యంగా.. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి తదితరులు తెలంగాణ పాటలకు వేసిన స్టెప్పులు అందరినీ అలరించాయి.
వాళ్లిద్దరితో పాటు కొందరు మహిళా నేతలు, ఎంపీ జితేందర్ రెడ్డి కూడా కాలు కదిపారు. 'నడుస్తున్న పొద్దుమీద పొడుస్తున్న కాలమా.. పోరు తెలంగాణమా' అంటూ నేపథ్యంలో వినిపిస్తున్న పాటలకు వాళ్లంతా డాన్సులు చేశారు.