ts home minister
-
సై అంటూ.. చిందేసిన హోం మంత్రి
టీఆర్ఎస్ 14వ ఆవిర్భావ సభ సికింద్రాబాద్‌లోని పెరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా ప్రారంభమైంది. ముందుగా 'తెలంగాణ ధూంధాం'తో కళాకారులు, నాయకులు ప్రజల్లో ఉత్సాహాన్ని రేకెత్తించారు. ముఖ్యంగా.. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి తదితరులు తెలంగాణ పాటలకు వేసిన స్టెప్పులు అందరినీ అలరించాయి. వాళ్లిద్దరితో పాటు కొందరు మహిళా నేతలు, ఎంపీ జితేందర్ రెడ్డి కూడా కాలు కదిపారు. 'నడుస్తున్న పొద్దుమీద పొడుస్తున్న కాలమా.. పోరు తెలంగాణమా' అంటూ నేపథ్యంలో వినిపిస్తున్న పాటలకు వాళ్లంతా డాన్సులు చేశారు. -
ఎంఐఎం మాకు ఫ్రెండ్లీ పార్టీ: హోం మంత్రి
తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజకీయ పార్టీలకు మాత్రమే స్థానం ఉంటుందని రాష్ట్ర హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి అన్నారు. మజ్లిస్ పార్టీ (ఎంఐఎం) తమకు ఫ్రెండ్లీ పార్టీ అని కూడా నాయిని వ్యాఖ్యానించారు. తెలంగాణలో అసలు తెలుగుదేశం పార్టీకి స్థానం లేదని, టీడీపీ నుంచి మరికొంతమంది నాయకులు టీఆర్ఎస్లో చేరుతారని ఆయన చెప్పారు. తాజాగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి గులాబి కండువా కప్పుకోడానికి సిద్ధమైన నేపథ్యంలో నాయిని ఈ వ్యాఖ్యలు చేశారు.