హైదరాబాద్: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ రాష్ర్ట సమితి(టీఆర్‌ఎస్) బహిరంగ సభ సందర్భంగా హైదరబాద్‌లో పోలీసులు సోమవారం ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పరేడ్ మైదానం సమీపంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయి. సాధారణ ప్రయాణికులు సురభి గార్డెన్ నుంచి జూబ్లీ బస్‌స్టేషన్, స్వీకార్ ఉపకార్ మీదగా వైఎంసీఏ వైపు వెళ్లాల్సి ఉంటుంది. వైఎంసీఏ నుంచి ఎస్‌బీహెచ్ కూడలి వైపు వెళ్లే వారిని క్లాక్ టవర్, జేబీఎస్ వైపు పంపుతారు.