
పూల పండుగకు వేళయ్యింది. గురువారం సద్దుల బతుకమ్మ సందర్భంగా వాకిళ్లన్నీ పూదోటలుగా మారనుండగా ఊరూవాడ ఆడబిడ్డల ఆటాపాటలతో హోరెత్తనున్నది. ఈ నేపథ్యంలో నగరంలో పోలీసులు ఆంక్షలు విధించారు.
ఇవాళ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు పోలీస్ విభాగం ప్రకటించింది. అమరవీరుల స్మారకస్థూపం నుండి అప్పర్ ట్యాంక్ బండ్‌లోని బతుకమ్మ ఘాట్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. ఈ ఆంక్షలు ఈరోజు సాయంత్రం 4గంటల నుండి రాత్రి 11గంటల వరకు కొనసాగుతున్నాయని హైదరాబాద్ నగర పోలీసులు అధికారికంగా ప్రకటించారు.
ట్రాఫిక్ ప్రాంతాల్లో వెళ్లే వారు ప్రత్యమ్నాయా మార్గాలు ఎంచుకోవాలని కోరారు. పండుగ వేడుకలు ప్రశాంతంగా ముగిసేలా ప్రజలు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.