
ఢిల్లీ : సికింద్రాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ (పజ్జన్న) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. డెహ్రాడూన్ పర్యటనలో ఉన్న పద్మారావుకు గుండెపోటు వచ్చింది. దీంతో అప్రమత్తమైన అనుచరులు ఆయన్ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పలు వైద్య పరీక్షల అనంతరం డాక్టర్లు పజ్జన్న గుండెకు స్టంట్ వేశారు. దీంతో ఆయనకు ప్రాణాపాయం తప్పింది.