Padma Rao Goud
-
పజ్జన్నకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
ఢిల్లీ : సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ (పజ్జన్న) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. డెహ్రాడూన్ పర్యటనలో ఉన్న పద్మారావుకు గుండెపోటు వచ్చింది. దీంతో అప్రమత్తమైన అనుచరులు ఆయన్ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పలు వైద్య పరీక్షల అనంతరం డాక్టర్లు పజ్జన్న గుండెకు స్టంట్ వేశారు. దీంతో ఆయనకు ప్రాణాపాయం తప్పింది. -
TS : కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా..రాజకీయ నేతలు (ఫొటోలు)
-
రసవత్తరంగా మారనున్న లష్కర్ పోరు
సాక్షి, సిటీబ్యూరో/సికింద్రాబాద్: సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. ఇప్పటికే బీజేపీ నుంచి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్లను ఆ పార్టీలు ప్రకటించగా, తాజాగా బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.పద్మారావుగౌడ్ పేరును ప్రకటించారు. ముగ్గురూ ప్రజాబలంతో ఎదిగిన నేతలే. నాగేందర్, పద్మారావులకు క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో అనుబంధం ఎక్కువనే పేరుంది. ఇటీవలీ దాకా ఒకే పారీ్టలో, ఒకే నాయకత్వం కింద కలిసి పని చేసిన వారిద్దరు ఇప్పుడు నువ్వా? నేనా? అని తేల్చుకునేందుకు సిద్ధం కావడంతో ఈ నియోజకవర్గం రాష్ట్రంలోనే ప్రత్యేక ఆకర్షణగా మారింది. దానం నాగేందర్ అనగానే ఇంకా బీఆర్ఎస్లో ఉన్నట్లుగానే ప్రజలకు గుర్తుంది. ఆయన కాంగ్రెస్‌లో చేరినట్లు తెలిసినప్పటికీ, ఇంకా బలంగా నమోదు కాలేదు. దీంతో నాగేందర్, పద్మారావు అనగానే ఇద్దరూ ఒకే పార్టీ కదా .. అంటున్న వారు సైతం ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరూ తమ ప్రచారాన్ని ఎలా నిర్వహిస్తారన్నది వేచి చూడాల్సిందే. గెలుస్తాం: కేసీఆర్ ధీమా పార్టీ అభ్యరి్థగా పద్మారావును ప్రకటించే సందర్భంగా నియోజకవర్గంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ మాట్లాడుతూ.. బీజేపీ నుంచి కేంద్రమంత్రి పోటీలో ఉన్నారని వెరవాల్సిన పనిలేదని.. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ 2004లో తొలిసారిగా పద్మారావు ఎమ్మెల్యేగా పోటీ చేసింది అప్పటి రాష్ట్ర కేబినెట్ మంత్రి పైనే (తలసాని శ్రీనివాస్‌యాదవ్) అయినా ఆయనను ఓడించారని గుర్తు చేసినట్లు తెలిసింది. పద్మారావు గురించి మీకు తెలియంది కాదు. ఇటీవలి ఎన్నికల్లో మీరంతా మీ గెలుపు కోసం కష్టపడ్డారు. ఈ లోక్‌సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు గాను ఆరింట (నాంపల్లి మినహా) మనమే గెలిచాం. ప్రస్తుతం పార్టీ కష్టకాలంలో ఉంది. ఇప్పుడు పార్టీ కోసం మరింత ఎక్కువగా కష్టపడి గెలిపించాలని హితబోధ చేసినట్లు సమాచారం. పద్మారావు అభ్యరి్థత్వానికి అందరూ ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో ఆయన పేరు ప్రకటించారు. ఐదింట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో అంబర్‌పేట, ముషీరాబాద్, సనత్‌నగర్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, నాంపల్లి, సికింద్రాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లుండగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో నాంపల్లిలో మాత్రం ఎంఐఎం అభ్యర్థి గెలవగా, మిగతా ఆరు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచారు. వారిలో ఖైరతాబాద్ నుంచి గెలిచిన దానం నాగేందర్ ఇప్పుడు సికింద్రాబాద్ లోక్‌సభకు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. సికింద్రాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి గెలిచిన పద్మారావు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో తలపడుతున్నారు. త్వరలోనే ప్రచారంలోకి.. అభ్యర్థిత్వం ఖరారు కావడంతో పద్మారావు ఆదివారం నియోజకవర్గంలోని పార్టీ నేతలతో సమావేశం కానున్నట్లు సమాచారం. సోమవారం హోలీ ముగిశాక మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. అదే సమావేశంలో జనరల్ బాడీ సమావేశ తేదీని నిర్ణయించే అవకాశం ఉందని పార్టీ ముఖ్య నాయకుడొకరు తెలిపారు. -
కేసీఆర్ ఫార్మ్ హౌస్ కి పద్మారావు గౌడ్
-
లష్కర్ బరిలో పద్మారావు?
సాక్షి, సిటీబ్యూరో/సికింద్రాబాద్: లోక్‌సభ ఎన్నికలు మూడు ప్రధాన పార్టీలకు సవాల్‌గా మారడంతో అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి అడుగులేస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని పరిధిలోని చార్మినార్ మినహా మిగతా మూడు నియోజకవర్గాలు మరింత కీలకంగా మారాయి. మిగతా రాష్ట్రమంతా ఒక ఎత్తు.. నగర పరిధిలోని నియోజకవర్గాలు మరో ఎత్తు అన్నట్లుగా వాటిలో గెలుపు కోసం తగిన వ్యూహాలు రచిస్తున్నాయి. అందుకనుగుణంగా ఆలోచనలు చేస్తున్నాయి. కేంద్రంలో మరోసారి అధికారమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా ఈసారి అత్యధిక స్థానాల్లో గెలవాలనే తలంపులో బీజేపీ ఉంది. అందులో భాగంగా అందరికంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించడంతో ఇప్పటికే ప్రచారం నిర్వహిస్తున్నారు. రాజధానిలో సత్తా చాటాలనే లక్ష్యంతో ఉన్న కాంగ్రెస్‌లో రోజుకో పేరు తెరపైకి వస్తోంది. సికింద్రాబాద్ లోక్‌సభ స్థానాన్నే పరిగణనలోకి తీసుకుంటే మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ నుంచి మొదలై ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు ఖరారైనట్లు చెబుతున్నారు. ఇద్దరూ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరినవారే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో గెలిచేందుకు పార్టీలోకి కొత్తగా చేరే వారికై నా సరే ఇవ్వాలన్న తలంపులో ఆ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. అధికారికంగా వెల్లడించేంత వరకు ఏ మార్పులైనా జరగవచ్చు. సీనియర్నే పోటీలో ఉంచాలని.. ఇక బీఆర్ఎస్ పరిస్థితి మరోలా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో తమ పార్టీ నేతలే గెలిచినప్పటికీ, లోక్‌సభ విషయానికొచ్చేసరికి ఆ పార్టీలో పెద్దగా ఆసక్తి కనబడటం లేదు. ఎలాగూ ఇవ్వాలనుకున్న వారికే అధిష్టానం టిక్కెట్ ఇస్తుందనే ఉద్దేశంతో టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు కనబడటం లేదు. ముఖ్యంగా సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు నేతలు వెనుకాడుతున్నట్లు తెలుస్తోంది. అక్కడ ప్రత్యర్థి పార్టీలైన బీజేపీ నుంచి కిషన్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా దానం నాగేందర్లను దృష్టిలో ఉంచుకున్న పార్టీ అగ్రనేతలు వారిని ఎదుర్కొనగల నేతను బరిలో దింపాలని భావిస్తున్నారు. ఇందుకు సిట్టింగ్ ఎమ్మెల్యేనే బరిలో దింపాలనే ఆలోచనతో సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుగౌడ్‌ను పోటీకి దింపనున్నట్లు తెలిసింది. తన బదులు తన కుమారుడు రామేశ్వర్గౌడ్కు అవకాశమివ్వాల్సిందిగా పద్మారావు కోరినప్పటికీ, ఈ ఎన్నికలు పార్టీ మనుగడకే కీలకమైనవైనందున సీనియర్లే ఉండాలని, పోటీ తప్పదని సంకేతాలిచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నియోజకవర్గం నుంచి క్రితం సారి పోటీ చేసిన తలసాని సాయికిరణ్‌కు కానీ, లేదా ఆయన తండ్రి శ్రీనివాస్యాదవ్కుగానీ టికెట్ ఇస్తారని పార్టీ వర్గాలు తొలుత భావించాయి. ప్రస్తుత సమాచారం మేరకు పద్మారావునే బరిలో దింపేందుకు బీఆర్ఎస్ యోచించినట్లు తెలిసింది. మంగళవారం ఢిల్లీలో ఉన్న మంత్రులు కేటీఆర్, హరీష్‌రావులను పద్మారావు, ఆయన కుమారుడు కలిసిన సందర్భంగా పద్మారావును పోటీకి సిద్ధంగా ఉండాలని చెబుతూ, అందుకు కారణాలు వివరించినట్లు సమాచారం. -
సికింద్రాబాద్ నియోజకవర్గం అభ్యర్థులు వీరే
సికింద్రాబాద్ నియోజకవర్గం సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి సిటింగ్ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న పద్మారావుగౌడ్ 2018లో మూడోసారి గెలిచారు. ఆయన ఈసారి మంత్రి పదవిని పొందలేకపోయారు. అయితే ఉపసభాపతి పదవి దక్కించుకున్నారు. పద్మారావు గౌడ్ 2018 ఎన్నికలలో 41141 ఓట్ల మెజార్టీతో తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్ది, మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్‌పై విజయం సాదించారు. ఆఖరు నిమిషంలో జ్ఞానేశ్వర్ కాంగ్రెస్ ఐ టిక్కెట్ పొంది పోటీచేసినా పలితం దక్కలేదు. పద్మారావుకు 73190 ఓట్లు రాగా, జ్ఞానేశ్వర్‌కు 32049 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసిన సతీష్‌గౌడ్‌కు 11700పైగా ఓట్లు వచ్చాయి. పద్మారావు తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు. పద్మారావు గౌడ సామాజికవర్గం నేత. సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గంలో ప్రముఖ సినీనటి జయసుధ కాంగ్రెస్ ఐ పక్షాన 2009లో టిడిపి నేత శ్రీనివాస యాదవ్ పై గెలిచారు. ఆమె 2014లో ఓటమి చెందారు. ఇక్కడ ఈమె సమీప ప్రత్యర్ధిగా కూడా ఉండలేకపోయారు. టిఆర్ఎస్ సీనియర్ నేత టి.పద్మారావు గౌడ్ 2014లో టిడిపి -బిజెపి కూటమి అభ్యర్ధి కె. వెంకటేష్‌గౌడ్‌ను 25979 ఓట్ల ఆదిక్యతతో ఓడిరచారు. పద్మారావుగౌడ్ తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ఆధ్వర్యంలో ఏర్పడిన తొలి మంత్రివర్గంలో సభ్యుడయ్యారు. శ్రీనివాసయాదవ్ సనత్‌నగర్‌కు మారి 2014, 2018లలో గెలుపొందారు. సికింద్రాబాద్‌లో శ్రీనివాస్‌యాదవ్ 1994, 1999లలోను, తిరిగి 2008లో జరిగిన ఉప ఎన్నికలోను గెలిచారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి ఏడుసార్లు, టిడిపి ఐదుసార్లు, టిఆర్ఎస్ మూడుసార్లు జనతా ఒక్కసారి గెలిచాయి. ఇక్కడ కె.సత్యనారాయణ మూడుసార్లు, ఎల్. నారాయణ రెండుసార్లు గెలిచారు. ఇక్కడ ఒకసారి గెలిచిన జె.బి. ముత్యాలరావు, మరోసారి గజ్వేల్‌లలో గెలుపొందారు. ముత్యాలరావు మహబూబ్‌నగర్‌లో, నాగర్‌కర్నూల్‌లో ఒక్కొక్కసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. కేంద్రమంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. 1952లో ఇక్కడ ద్విసభ్య నియోజకవర్గం నుంచి గెలిచిన వి.బి. రాజు 1957లో అసిఫ్నగర్లోను, 1967లో సిద్దిపేటలోను గెలిచారు. నీలం, కాసు మంత్రివర్గాలలో సభ్యునిగా వున్నారు. రాజ్యసభ సభ్యునిగా కూడా ఉన్నారు. సికింద్రాబాద్‌లో గెలిచిన అల్లాడి రాజకుమార్ గతంలో ఎన్.టి.ఆర్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. ఈయన రెండుసార్లు రాజ్యసభ సభ్యునిగా కూడా వున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గతంలో చంద్రబాబు క్యాబినెట్లో సభ్యునిగా వున్నారు. తదుపరి కెసిఆర్ క్యాబినెట్లో మంత్రి అయ్యారు. 2004లో గెలిచిన టిఆర్ఎస్ అభ్యర్ధి టి. పద్మారావు 2008లో టిఆర్ఎస్ తెలంగాణ వ్యూహంలో భాగంగా పదవికి రాజీనామా చేసి తిరిగి పోటీ చేసినా ఉప ఎన్నికలో ఓడిపోయారు. 2009లో సనత్‌నగర్‌లో మళ్ళీ పోటీ చేసి ఓడిపోయారు. 2014లో సికింద్రాబాద్ నుంచి గెలిచి కెసిఆర్ క్యాబినెట్లో మంత్రి అయ్యారు. 201లో గెలిచి ఉప సభాపతి అయ్యారు. సికింద్రాబాద్‌లో పన్నెండుసార్లు బీసీ వర్గాల నేతలు ఎన్నికయ్యారు. ఒకసారి బ్రాహ్మణ, ఒకసారి వెలమ, ఒక ఎస్.సి నేత,మరో సారి క్రిస్టియన్ నేత ఎన్నికయ్యారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
టీఆర్ఎస్ను వీడుతానన్న వార్తల్లో వాస్తవం లేదు
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ మంగళవారం మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలపై ఇరువురి మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ టీఆర్ఎస్కు రాజీనామా చేసిన నేపథ్యంలో పద్మారావు కూడా పార్టీని వీడుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరిగింది. పద్మారావుతో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి భేటీ కావడం ఈ వార్తలకు ఊతం ఇచ్చింది. అయితే తాను పార్టీని వీడుతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, ఉద్యమ సమయం నుంచి ఉన్న అనుబంధం కొనసాగుతుందని ఈనెల 16న పద్మారావు ఒక ప్రకటన విడుదల చేశారు. మరోవైపు పద్మారావుగౌడ్‌తో భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని కిషన్‌రెడ్డి ప్రకటించారు. ఇదిలా ఉంటే మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో పద్మారావుగౌడ్ కూడా పాల్గొంటారని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. (క్లిక్ చేయండి: బీజేపీలోకి ‘బూర’తో పాటు మరో ముగ్గురు?) -
పద్మారావు గౌడ్, రసమయి మధ్య వాగ్వాదం.. షాక్‌లో టీఆర్ఎస్ నేతలు
సాక్షి, హైదరాబాద్: ఐదో రోజు తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శనివారం ఉదయం అసెంబ్లీ సమావేశం ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఈ క్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు, అధికార పార్టీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రశ్నోత్తరాల సమయంలో రసమయి ప్రశ్నలు అడుగుతుండగా డిప్యూటీ స్పీకర్ పద్మారావు.. మైక్ కట్ చేసి ఎమ్మెల్యే గొంగడి సునీతకు మైక్ ఇచ్చారు. ఇంతలో దీనిపై రసమయి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సభలో మాట్లాడదాం అంటే మాట్లాడే అవకాశాలు రావు.. కనీసం ప్రశ్నలు అడిగే అవకాశం కూడా ఇవ్వకుంటే ఎలా? అని అసహనం వ్యక్తం చేశారు. ప్రశ్నలే అడగవద్దు అన్నప్పుడు తమకు ప్రశ్నలు ఎందుకు ఇవ్వడం అంటూ అసంతృప్తి వ్యక్తపరిచారు. తాను ప్రశ్నలే అడుగుతున్నానని వాదించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆయన వ్యాఖ్యలపై పద్మారావు స్పందిస్తూ.. తొందరగా ప్రశ్నలే అడగండి.. ప్రసంగాలు వద్దూ అంటూ వ్యాఖ్యలు చేశారు. గంటన్నరలో 10 ప్రశ్నలు పూర్తి చేసుకోవాలని చెప్పారు. దీంతో అసహనం వ్యక్తం చేస్తూ రసమయి తన కుర్చీలో సైలెంట్‌గా కూర్చుండిపోయారు. -
‘రేవంత్ ఉన్నడా.. నాకు బాగా దగ్గరోడు ఆయన’
సాక్షి, లాలాపేట: ‘రేవంత్ ఉన్నడా ..నాకు బాగా దగ్గరోడు ఆయన’ అని తెలంగాణ అసెంబ్లీ ఉప సభాపతి తీగుళ్ల పద్మారావు గౌడ్ ..టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి అన్నారు. మంగళవారం లాలాపేటలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదును ప్రారంభించి పద్మారావు గౌడ్ మాట్లాడుతున్న క్రమంలో అదే సమయంలో లాలాపేట మీదుగా తార్నాక వైపు రేవంత్‌రెడ్డి వాహన శ్రేణీ ర్యాలీ వెళుతోది. దీంతో పద్మారావు గౌడ్.. తన ప్రసంగాన్ని ఆపి అటు వైపు చూస్తు రేవంత్ ఉన్నాడా ఆ ర్యాలీలో...ఆయన నాకు బాగా దగ్గరోడు అంటూ వ్యాఖ్యలు చేశారు. సమావేశం ముగిసే వరకు పద్మారావు వ్యాఖ్యలపై కార్యకర్తలంతా చర్చించుకుంటూ కూర్చున్నారు. చదవండి: బ్లేడుతో తల్లి బెదిరింపు.. తానే కోసుకున్న బాలుడు మా కూతురికే.. ప్రపంచ సుందరి కిరీటం! -
కాబోయే సీఎం కేటీఆర్‌కు కంగ్రాట్స్
సాక్షి, సికింద్రాబాద్ (హైదరాబాద్): ‘మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్.. అతి త్వరలోనే కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్‌కు శాసనసభ, రైల్వే కార్మికులు, అందరి తరఫున కంగ్రాట్స్ చెబుతున్నా.. మీరు ముఖ్యమంత్రి అవ్వగానే సికింద్రాబాద్ ప్రాంత రైల్వే కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. ఉద్యమానికి, తెలంగాణ ప్రభుత్వానికి రైల్వే ఉద్యోగులు అండగా ఉంటున్నారు. మీరు ముఖ్యమంత్రి అయ్యాక వారిని ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాలి..’అని రైల్వే కార్మికుల తరఫున మంత్రి కేటీఆర్‌ను శాసనసభ డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావుగౌడ్ కోరారు. చదవండి: (సీఎం పీఠంపై కేటీఆర్: పెరుగుతున్న మద్దతు) సికింద్రాబాద్‌లో గురువారం దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం జరిగిన ఉద్యోగులు, కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పజ్జన్న (పద్మారావు)ను తాను చిచ్చా అని పిలుస్తా అని చెప్పారు. పద్మారావును తన బాబాయ్ అని అన్నారు. అయితే పద్మారావు ‘కాబోయే సీఎంకు కంగ్రాట్స్’అంటూ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించలేదు. ఇటు పద్మారావు ప్రసంగ సమయంలోనూ ఆయన చిరునవ్వుతోనే ఉన్నారు. హైస్పీడ్ రైళ్ల ద్వారానే ప్రగతి సాధ్యం.. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టడమేనని మంత్రి కేటీఆర్ అన్నారు. ‘ప్రధాన నగరాలకు సత్వర రవాణా మార్గాలుండటం ద్వారా దేశ ప్రగతి సత్వరంగా సాధ్యమవుతుంది. రైల్వే వ్యవస్థను కేంద్రం విస్మరిస్తోంది. సబ్కా సాథ్.. సబ్కా విశ్వాస్ తమ నినాదం అంటున్న మోదీ ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలను నిర్లక్ష్యం చేస్తోంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాలకు ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఇవ్వడంలో కేంద్రం జాప్యం తగదు. వచ్చే బడ్జెట్లో దక్షిణాది రాష్ట్రాలకు.. ముఖ్యంగా తెలంగాణకు పెద్దపీట వేయాలి. లేనిపక్షంలో రైల్వే ఉద్యో గులు తీసుకునే కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. కాజీపేటలో వ్యాగన్ కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం కేంద్రం 135 ఎకరాల స్థలం అడిగితే రాష్ట్ర ప్రభుత్వం 300 ఎకరాలు కేటాయించింది. ఆరున్నర ఏళ్ల కాలం పూర్తయినా నేటికీ నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. తెలంగాణలో కొత్త లైన్లకు కూడా మోక్షం లభించలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకు రైల్వే సమస్యలు, కార్మికుల సమస్యలకు సత్వర పరిష్కారం చూపేందుకు సిద్ధంగా ఉన్నాం..’అని కేటీఆర్ హామీనిచ్చారు. దక్షిణ మధ్య రైల్వే జాతీయ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు వి.శ్రీనివాస్‌గౌడ్, పువ్వాడ అజయ్ కుమార్, డీఆర్ఎం ఏకే గుప్తా, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కె.పాపారావు, ఎంప్లాయిస్ నేతలు ప్రభాకర్, గంట రవీందర్, మురళీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
అల రాజకీయ ప్రయాణంలో..
ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. ఇంట గెలవకున్నా రచ్చ గెలిచిన వారున్నారు. హైదరాబాద్ నగరంలో రెండు రకాల వాళ్లూ ఉన్నారు. స్థానిక ఎన్నికల్లో కార్పొరేటర్‌గా తొలి అడుగు వేసి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన వారు ఎందరో ఉన్నారు. వీరిలో కార్పొరేటర్‌గా గెలిచిన వారూ, ఓడినవారూ ఉన్నారు. అయినప్పటికీ ఉన్నతపదవులు పొందారు. గతంలో రాజకీయ ప్రముఖుల ఎదుగుదలలో బల్దియాకార్పొరేటర్ పదవి ఎంతో కీలకంగా పని చేసింది. చాలా మంది నేతలు గల్లీ స్థాయి నుంచి ఉన్నత స్థానాలకు ఎదిగారు. కార్పొరేటర్ ఎన్నికల్లో తొలి అడుగు వేసి.. అనంతరం ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులుగా ఎదిగిన నేతలు నగరంలో చాలా మందే ఉన్నారు. వారిలో మంత్రి తలసాని, డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్, రాజాసింగ్, తీగల కృష్ణారెడ్డి, సుధీర్‌రెడ్డి, రేణుకాచౌదరి తదితరులు ఉన్నారు. ఎంఐఎం వ్యవస్థాపకుడు.. సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ సైతం నగరపాలకసంస్థ కార్పొరేటర్‌గా పనిచేశారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రివర్గ ప్రముఖుల్లో ఒకరిగా ఉన్నారు. ఎంతటివారికైనా సవాల్ విసరడంలో దిట్ట. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి క్షేత్రస్థాయి టూర్ ఏర్పాటు చేయడం తెలిసిందే. హిస్సాంగంజ్ మోండా నుంచి 1986లో కార్పొరేటర్‌గా మొదటి ప్రయత్నంలో ఓడిపోయినప్పటికీ, మలి ప్రయత్నంలో 1994లోటీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిచారు. మంత్రి పదవి సైతం పొందారు. 2014లో టీడీపీ నుంచే గెలిచినప్పటికీ అనంతరం టీఆర్ఎస్లో చేరారు. తొలుత సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి బరిలో దిగగా ప్రస్తుతం సనత్‌నగర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సుధీర్‌రెడ్డి తొలుత అక్బర్‌బాగ్ డివిజన్ నుంచి సుధీర్‌రెడ్డి కార్పొరేటర్‌గా గెలిచారు. రెండు పర్యాయాలు కార్పొరేటర్‌గా నెగ్గిన ఆయన ఆతర్వాత పీసీసీలో ముఖ్య పదవుల్లో కొనసాగారు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హుడా చైర్మన్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఎల్బీనగర్ ఎమ్మెల్యేగా, మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. పద్మారావు గౌడ్ తలసాని శ్రీనివాస్‌యాదవ్‌పై 1986లో కాంగ్రెస్ నుంచి గెలిచి కార్పొరేటర్‌గా నెగ్గారు. అనంతరం 2002లోనూ టీఆర్ఎస్ నుంచి మరోమారు కార్పొరేటర్‌గా గెలిచి, 2004లోఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో కూడా గెలిచి ఎక్సైజ్ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్‌గా ఉండటం తెలిసిందే. విచిత్రమేమిటంటే ఒకప్పుడు సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి నెగ్గిన శ్రీనివాస్‌యాదవ్ సనత్‌నగర్‌కు మారారు. సనత్‌నగర్‌లో ఓడిన పద్మారావు, సికింద్రాబాద్ నుంచి గెలిచారు. రేణుకా చౌదరి రాజకీయ ప్రయాణం కేంద్రమంత్రిగా, రాజ్యసభసభ్యు రాలిగా పనిచేసిన రేణుకాచౌదరి రాజకీయ ప్రయాణం కార్పొరేటర్ నుంచే మొదలైంది. 1986లో బంజారాహిల్స్ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా గెలిచి, టీడీపీలో క్రమేపీ ఉన్నతస్థాయి కెదిగారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరారు. మీసం తిప్పిన తీగల కృష్ణారెడ్డి 1986లో కార్పొరేటర్‌గా ఓటమి చవిచూసినా, టీడీపీ హయాంలో మూడు పర్యాయాలు హుడా చైర్మన్‌గా పనిచేశారు. ప్రత్యక్ష ఎన్నికల్లో నగర మేయర్‌గా విజయఢంకా మోగించారు. టీడీపీ నగర అధ్యక్షునిగా మూడుసార్లు పనిచేశారు. అనంతరం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తరువాత టీఆర్ఎస్లో చేరారు. ఇంకా..పలువురు ♦ 1986లో కార్పొరేటర్‌గా ఓటమిచెందిన జి.సాయన్న అనంతరం టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. టీఆర్ఎస్లోనూ ఎమ్మెల్యేగా ఎన్నికవడం తెలిసిందే. ♦ 1986లో కార్పొరేటర్‌గా గెలిచిన ముఠా గోపాల్ ఆర్టీసీ రీజినల్ చైర్మన్‌గా, టీడీపీ నగరశాఖ అధ్యక్షునిగా మూడు పర్యాయాలు పనిచేశారు. ప్రస్తుతం ముషీరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ♦ తొలుత 1986లో పాతబస్తీలోని అలియాబాద్ నుంచి సి.కృష్ణయాదవ్ కార్పొరేటర్‌గా గెలిచి సత్తా చాటారు. తర్వాత హిమాయత్‌నగర్ నియోజకవర్గం నుంచి టీడీపీ నుంచి గెలిచారు. గెలవడమేకాక పశుసంవర్ధకశాఖ మంత్రిగా, కార్మికశాఖ మంత్రిగా, విప్‌గా పనిచేశారు. ♦ఎంఐఎం వ్యవస్థాపకుడు.. సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ సైతం నగరపాలకసంస్థ కార్పొరేటర్‌గా పనిచేశారు. మల్లేపల్లి డివిజన్‌నుంచి ఆయన కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. ఎంఐఎం నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న ముంతాజ్ అహ్మద్‌ఖాన్, సయ్యద్ పాషాఖాద్రీ, అహ్మద్బలాలా , జాఫర్ హుస్సేన్, కౌసర్ మొహియుద్దీన్, బీజేపీ నుంచి కార్వాన్ ఎమ్మెల్యే రాజాసింగ్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మణ్ సైతం కార్పొరేటర్ స్థాయి నుంచి ఎదిగిన వారే. -
డిప్యూటీ స్పీకర్ తీరుపై నెటిజన్ల విమర్శలు
-
ఆ వాయిస్ నాది కాదు: పద్మారావు గౌడ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ డిప్యూటీ స్పీకర్ టి. పద్మారావు గౌడ్ కరోనావైరస్ చికిత్సకు సంబంధించి తాను చెప్పినట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో క్లిప్ నకిలీదని చెప్పారు. ఆ ఆడియో క్లిప్‌లో మాట్లాడింది తాను కాదని ధృవీకరించారు. ఇటీవలే ఆయనకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. (తెలంగాణ డిప్యూటీ స్పీకర్‌కు కరోనా) పద్మారావు గౌడ్ తన సన్నిహితుడు ఒకరితో మాట్లాడుతూ, హాస్పటల్ నుంచి డిశార్జ్ అయ్యానని, ప్రస్తుతం బాగున్నాని తెలిపినట్లు ఆ ఆడియోలో ఉంది. ఇంకా ఆయన మాట్లాడుతూ కరోనా చికిత్స కోసం సొంటి, లవంగాలు, యాలాకులు ఇంకా మరిన్ని పదార్థాలు కలిపి దంచి పొడిచేసుకోని దానిని వేడి నీటితో కలిపి రోజు తీసుకోవాలని సూచించినట్లు ఉంది. తనకి హాస్పటల్లో పారాసిటమాల్, దగ్గు మందు ఇచ్చినట్లు చెప్పారు. మిగిలిన వారందరికి కూడా ఈ విషయాన్ని చెప్పమని ఆయన చెప్పినట్లు ఆ ఆడియో క్లిప్‌లో ఉంది. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. దీనిపై పద్మరావు గౌడ్ స్పష్టతనిస్తూ ఆ ఆడియోలో ఉన్న వాయిస్ తనది కాదని తేల్చి చెప్పారు. తాను ప్రజలందరి ఆశీర్వాదాలతో ఆరోగ్యంగా ఉన్నానని, హోం కార్వంటైన్‌లో ఉన్నట్లు ఆయన తెలిపారు. దీనికి సంబంధించి ఆయన ట్వీట్ చేశారు. చదవండి: కరోనా: ఆస్పత్రుల్లో లైవ్ డ్యాష్ బోర్డులు ఏర్పాటు There is a audio clip being circulating across Social Media & WhatsApp which is completely fake & baseless. I am doing fine and in home quarantine. Thank you all for your prayers. — T. Padma Rao (@TPadmaRao) July 8, 2020 -
తెలంగాణ డిప్యూటీ స్పీకర్‌కు కరోనా
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో కరోనా వైరస్ సాధారణ ప్రజలతోపాటు ప్రజా ప్రతినిధులను సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ముఖ్యంగా టీఆర్ఎస్ నేతలను కరోనా వైరస్ వెంటాడుతోంది. ఇటీవల హోంశాఖ మంత్రి మమమూద్ అలీకి కరోనా సోకగా, తాజాగా తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ జరిగింది. మూడు రోజుల నుంచి జ్వరం గొంతునొప్పితో బాధపడుతున్న ఆయనకు వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించారు. పద్మారావుతోపాటు మరో నలుగురు కుటుంబ సభ్యులు సైతం కోవిడ్ బారిన పడ్డారు. వీరంతా ప్రస్తుతం సికింద్రాబాద్‌లో హోం క్వారంటైన్లో ఉన్నారు. (తెలంగాణ హోంమంత్రికి కరోనా పాజిటివ్) తెలంగాణలో కరోనా బారిన పడుతున్న రాజకీయ నేతల సంఖ్య పెరుగుతోంది. టీఆర్ఎస్ పార్టీలో కరోనా సోకిన నేతల్లో పద్మారావు అయిదవ వ్యక్తి. ఇప్పటి వరకు టీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, గణేష్ గుప్తా, హోంమంత్రి మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావు కరోనా బారినపడ్డారు. ఈ నేపథ్యంలో చాలా మంది రాజకీయ నేతలు, ప్రజా ప్రతినిధుల ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఇక సోమవారం ఒక్కరోజే తెలంగాణలో 973 కొత్త కేసులు వెలుగు చూశాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 15 వేలు దాటింది. మొత్తం 15,394 కేసులు నమోదవ్వగా 253 మంది మృత్యువాతపడ్డారు. కరోనాతో కోలుకున్న వారి సంఖ్య 5,582 ఉండగా.. ప్రస్తుతం 9,559 యాక్టివ్ కేసులు ఉన్నాయి. (మళ్లీ లాక్డౌన్.. సిద్ధంగా ఉన్నారా?) -
ఆ నలుగురు పిల్లలకు అండగా ఉంటాం
సికింద్రాబాద్: అనారోగ్యంతో తల్లిదండ్రులు మృతి చెందడంతో అనాథలుగా మారిన నలుగురు పిల్లలకు అండగా ఉంటామని శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ హామీ ఇచ్చారు. సీతాఫల్మండి డివిజన్ బీదలబస్తీకి చెందిన రాధ అనే మహిళ భర్త కొద్ది నెలల క్రితమే మృతి చెందాడు. కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో రాధ కూడా మృతి చెందింది. కూలీనాలీ చేసుకుని బతికే రాధకు నలుగురు సంతానం. ముగ్గురు బాలురు, ఒక బాలిక ఉన్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన నలుగురు పిల్లలు ప్రస్తుతం అమ్మమ్మ సంరక్షణలో ఉన్నారు. మంగళవారం రాధ పిల్లలను పరామర్శించిన పద్మారావుగౌడ్ వారికి నెలకు సరిపడా రేషన్ సరకులు అందించారు. తక్షణ ఖర్చుల నిమిత్తం రూ.10 వేల సహాయాన్ని అందించారు. పిల్లలకు ప్రభుత్వ పరంగా అవసరమైన సహాయ సహకారాలు అందించాలని రెవెన్యూ అధికారులను పద్మారావుగౌడ్ ఆదేశించామన్నారు. నలుగురు పిల్లలకు గురుకుల పాఠశాలలో ఉచిత విద్యాబోధనలు అందిస్తామని హామీ ఇచ్చారు. -
వలస కూలీలకు పద్మారావు చేయూత
-
ఆర్టీసీ భవన్లో డిప్యూటీ స్పీకర్ క్యాంపు కార్యాలయం
సాక్షి, సికింద్రాబాద్: మెట్టుగూడ ప్రధాన రహదారిలోని ఆర్టీసీ భవనం ఇకపై తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ క్యాంపు కార్యాలయంగా మారనుంది. మెట్టుగూడ నుంచి తార్నాకకు వెళ్లే దారిలో ఈ భవనం ఉంది. ఆర్టీసీ ఎండీ కోసం నిర్మించిన ఈ భవనం ఆర్టీసీ చైర్మన్ల నివాస భవనంగా కొనసాగింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో రవాణ శాఖ మంత్రిగా పనిచేసిన ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు, ఆయన కుంటుంబం కొద్ది సంవత్సరాల పాటు ఈ భవనంలోనే నివసించారు. నాలుగేళ్ల క్రితం సీఎం హోదాలో సికింద్రాబాద్ పర్యటనకు వచ్చిన కేసీఆర్ ఇదే భవనంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అప్పట్లోనే ఎక్సైజ్ మంత్రి హోదాలో పద్మారావు ఈ భవనాన్ని క్యాంపు కార్యాలయంగా వాడుకుందామని ఆలోచించారు. ఆ తరువాత మినిస్టర్ క్వార్టర్స్‌కు కొంతకాలం మకాం మార్చారు. కొద్ది రోజుల క్రితం శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన పద్మారావుగౌడ్ ఆర్టీసీ భవనాన్ని క్యాంపు కార్యాలయంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. మినిస్టర్ క్వార్టర్స్‌కు వెళ్లడం కంటే తన నియోజకవర్గ పరిధిలోని ఆర్టీసీ భవనాన్ని క్యాంపు కార్యాలయంగా వినియోగించుకోవాలనుకున్న ఆయన నిర్ణయానికి సీఎం అంగీకారం తెలిపినట్టు తెలిసింది. శనివారం డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ తన అనుచరులతో కలిసి ఆర్టీసీ భవనాన్ని సందర్శించారు. నీల ప్రభాకర్, ఓడియన్ శ్రీనివాస్, సుంకు రాంచందర్, అశోక్‌గౌడ్, శైలేందర్, మంత్రి తనయుడు రామేశ్వర్‌గౌడ్, తెలంగాణ ఉద్యోగ జేఏసీ నేత చందు గంగపుత్ర పాల్గొన్నారు. -
నా ప్రేమ మీవల్లే సక్సెస్ అయింది: బాల్క సుమన్
సాక్షి, హైదరాబాద్ : అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైన సికింద్రాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌కు సభలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చెన్నూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ.. పద్మారావు గౌడ్‌తో తన వ్యక్తిగత అనుబంధం గురించి సభలోని సభ్యులతో పంచుకున్నారు. తన ప్రేమ వివాహానికి పద్మారావు గౌడ్ అన్నీ తానై ముందు నిలిచారని.. ఆయన వల్లే తన వివాహం జరిగిందని చెప్పారు. ఈ విషయం సభలో చెప్పవద్దో లేదో తనకు తెలియదని, కానీ పద్మారావు గౌడ్‌తో తనకున్న అనుబంధం గురించి చెప్పడానికి ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నానని తెలిపారు. ఉద్యమ సమయంలో టీఆర్ఎస్వి అధ్యక్షుడిగా పనిచేస్తున్నప్పుడు, వివాహానికి తన అత్త మామలు ఒప్పుకోలేదన్నారు. తాను ప్రేమించిన అమ్మాయి పద్మారావు సామాజిక వర్గానికే చెందినవారని, ఆ సమయంలో తనకంటూ ఏది లేదు కాబట్టి అత్త మామలు పిల్లనివ్వడానికి వెనుకాడారని చెప్పారు. దాంతో పద్మారావు అన్ననే వారితో మాట్లాడి ఒప్పించారని, భవిష్యత్తులో సుమన్ ఎమ్మెల్యే అవుతాడని పద్మారావు భరోసా ఇవ్వడంతో తన అత్త మామలు పెళ్లికి ఒప్పుకున్నట్టు సుమన్ తెలిపారు. పద్మారావు గౌడ్ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు తెలియజేశారు. -
సీఎల్పీ నేత భట్టిని కలిసిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం సమావేశం అయ్యారు. (డిప్యూటీ స్పీకర్‌గా పద్మారావు) డిప్యూటీ స్పీకర్ పదవి ఏకగ్రీమయ్యేలా టీఆర్ఎస్ అధిష్టానం ప్రయత్నాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే కాంగ్రెస్, మజ్లిస్, బీజేపీ పార్టీ నేతలతో సంప్రదింపులు జరపగా, ఏకగ్రీవ ఎన్నికకు ఎంఐఎ, బీజేపీ ఆమోదం తెలిపాయి. కాంగ్రెస్ పార్టీ కూడా సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినా తుది నిర్ణయం మాత్రం తెలపలేదు. దీంతో డిప్యూటీ స్పీకర్ ఎన్నికలో తమకు సహకరించాలంటూ కేటీర్ ఇవాళ ఉదయం సీఎల్పీ కార్యాలయంలో భట్టి విక్రమార్కను కలిశారు. ఈ అంశంపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చించిన అనంతరం తమ నిర్ణయం చెబుతామని భట్టి విక్రమార్క తెలిపారు. ఈ భేటీకి కేటీఆర్‌తో పాటు డిప్యూటీ స్పీకర్ అభ్యర్థి పద్మారావు గౌడ్, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. -
డిప్యూటీ స్పీకర్‌గా పద్మారావు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ ఉపసభాపతిగా తిగుళ్ల పద్మారావుగౌడ్ ఎన్నిక కానున్నారు. డిప్యూటీ స్పీకర్‌గా పద్మారావుగౌడ్ పేరును ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ఖరారు చేశారు. దీంతో పద్మారావుగౌడ్ శనివారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక నిర్వహణ కోసం అసెంబ్లీ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు గురువారమే నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యేలందరికీ లిఖితపూర్వక సమాచారం ఇచ్చారు. డిప్యూటీ స్పీకర్ పదవికి నామినేషన్ల దాఖలు ప్రక్రియ శనివారంతో ముగియనుండగా, సోమవారం ఎన్నిక ప్రక్రియ జరగనుంది. అదేరోజు పద్మారావు బాధ్యతలు చేపట్టనున్నారు. అధికార టీఆర్ఎస్ అభ్యర్థి ఒక్కరే నామినేషన్ దాఖలు చేస్తుండటంతో పద్మారావు ఎన్నిక ఏకగ్రీవం కానుంది. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలోనే... తిగుళ్ల పద్మారావుగౌడ్ టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుల్లో పద్మారావు ఒకరు. 2004, 2014, 2018 ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2008 సికింద్రాబాద్ ఉప ఎన్నికల్లో, 2009 ఎన్నికల్లో సనత్‌నగర్‌లో ఓడిపోయారు. 2014 నుంచి 2018 వరకు కేసీఆర్ ప్రభుత్వంలో ఆబ్కారీ, యువజన సర్వీసులు, క్రీడల మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికవుతున్నారు. సీఎం కేసీఆర్ తరహాలోనే.. మంత్రిగా పని చేసిన తర్వాత డిప్యూటీ స్పీకర్‌గా పని చేసిన సందర్భాలు ఉమ్మడి రాష్ట్రంలో అరుదుగానే ఉన్నాయి. 1995 నుంచి 1999 వరకు చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో కేసీఆర్ రవాణా మంత్రిగా పని చేశారు. 1999 ఎన్నికల తర్వాత మళ్లీ ఏర్పడిన చంద్రబాబు మంత్రివర్గంలో కేసీఆర్‌కు మంత్రిగా అవకాశం దక్కలేదు. అప్పుడు కేసీఆర్ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఇలాంటి తరహాలోనే పద్మారావు మంత్రి తర్వాత డిప్యూటీ స్పీకర్ పదవిని చేపడుతున్నారు. -
కటింగ్ బాబూ.. కటింగ్..
సూర్యాపేట: విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి మంగళవారం సూర్యాపేట పట్టణంతో పాటు మండలంలో కూలి పనులు చేశారు. వివిధ రకాల పనులు చేసి రూ.2,37,500 సంపాదించారు. సూర్యాపేట బిగ్‌బాస్ క్షౌ రశాలలో బాలుడికి కటింగ్ కూడా చేశారు. చాయ్.. గరమ్ చాయ్.. హైదరాబాద్: వరంగల్ టీఆర్ఎస్ బహిరంగసభకు నిధుల సమీకరణలో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మంగళవారం పలుచోట్ల కూలి పనులు చేశారు. రికార్డు స్థాయిలో రూ.16.50 లక్షలు సంపాదించి కూలి నంబర్–1గా నిలిచారు. సనత్‌నగర్ టిఫిన్ సెంటర్లో టిఫిన్, లక్కీ హోటల్లో చాయ్, బీకేగూడలో పుస్తకాల అమ్మకం, జలవిహార్ వాటర్ జోన్లో టికెట్ల అమ్మారు. చేపలమ్మా.. చేపలూ.. హైదరాబాద్: బౌద్ధనగర్ వీధుల్లో మంత్రి పద్మారావుగౌడ్ మంగళవారం చేపలు విక్రయించారు. దీంతో పాటు వివిధ కూలీ పనులు చేసిన మంత్రి రూ.15 లక్షల ఆదాయం ఆర్జించారు. చిటికెలో చేస్తా.. సిమెంట్ పని.. హైదరాబాద్: హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి గాంధీనగర్‌లో కూలీగా పనిచేసి మొత్తం రూ.3,51,232 సంపాదించారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న కళాజ్యోతి ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేసినందుకు గాను రూ.1,00,116 చెక్కును అందుకున్నారు. గాంధీనగర్‌లోని ఉదయ్ ఆదితి డెవలపర్స్ వద్ద సిమెంట్ పని చేసి రూ. 2,51,116 సంపాదించారు. కూల్ కూల్ ఐస్‌క్రీమ్.. హైదరాబాద్: గులాబీ కూలిలో భాగంగా ఎంపీ కే.కేశవరావు బంజారాహిల్స్ ఓరిస్ హోటల్లో ప్రత్యేకంగా తయారు చేసిన ఐస్‌క్రీమ్‌కు తెలంగాణ ఐస్‌క్రీమ్‌గా నామ కరణం చేశారు. ఇందుకు గాను కేకే రూ.2 లక్షలు అందుకున్నారు. శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ ఆయన వెంట ఉన్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ నోవా ఇంజినీరింగ్ కాలేజీలో పాఠాలు చెప్పి మరో రూ.2 లక్షలు సంపాదించారు. -
గీత కార్మిక సొసైటీలను ఎక్సైజ్‌లో చేరుస్తాం
శాసన మండలిలో మంత్రి పద్మారావు హామీ సాక్షి, హైదరాబాద్: గీత కార్మిక సొసైటీలను ఆబ్కారీ శాఖలోకి తిరిగి తీసుకువస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావుగౌడ్ సభకు హామీ ఇచ్చారు. సభ్యుడు గంగాధర్‌గౌడ్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధా నమిస్తూ, వచ్చే సమావేశాల్లోపే ఈ పని పూర్తి చేస్తామని చెప్పారు. గీత కార్మిక సొసైటీలను బీసీ వెల్ఫ్‌ర్‌లో చేర్చటం వల్ల గీత కార్మికులకు అనుకున్న స్థాయిలో మేలు జరగలేదని, అందుకే త్వరలోనే ఎక్సైజ్‌శాఖలో కలుపుతామని చెప్పారు. పౌల్ట్రీ షెడ్ నిర్మాణంలో ఉపయోగించే పరికరాలకు ప్రస్తుతం 14.5 శాతం సుంకం వేస్తున్నారని, దాన్ని 5 శాతానికి తగ్గించాలని సభ్యుడు డాక్టర్ శ్రీనివాసరెడ్డి చేసిన విజ్ఞప్తికి మంత్రి తలసాని శ్రీనివాసయాద్ బదులిస్తూ త్వరలోనే సుంకాన్ని 5 శాతానికి తగ్గిస్తామని హామీ ఇచ్చారు. -
నేనొస్తున్నా... మీరంతా రండి..
♦ గీత కార్మికులకు పిలుపు.. ♦ 16న చిట్టాపూర్‌లో ‘సాక్షి’ హరితహారం ♦ ఇదో మంచి ప్రయత్నం ♦ ప్రశంసించిన మంత్రి పద్మారావుగౌడ్ గజ్వేల్ : ‘ విరివిగా ఈత వనాలు పెంచాల్సిన అవసరాన్ని ‘సాక్షి’ గుర్తుచేసింది. హరితహారంలో భాగంగా ఈనెల 16న దుబ్బాక మండలం చిట్టాపూర్‌లో ఈత మొక్కలు నాటేందుకు ముందుకు వచ్చింది. ఈత వనాలు నాటే కార్యక్రమానికి నేను వస్తున్నా.. మీరంతా రండి’ అంటూ ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావుగౌడ్ గీత కార్మికులకు పిలుపునిచ్చారు. బుధవారం గజ్వేల్ మండలం పిడిచెడ్‌లో ఈత మొక్కలు నాటే కార్యక్రమానికి హాజరైన మంత్రి ‘సాక్షి’ తో మాట్లాడుతూ... చిట్టాపూర్‌లో ఈత మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం స్ఫూర్తిదాయకమన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి చేపడుతున్న హరితహారంలో ఈత వనాల పెంపునకు ప్రాధాన్యతనిస్తున్నదన్నారు. ఈ సంకల్పాన్ని నెరవేర్చడానికి ‘సాక్షి’ తమతో కలిసిరావడం ఆనందంగా ఉందన్నారు. గీత కార్మికుల ఉపాధి కోసం హైదరాబాద్ నగరంలో ప్రభుత్వం 50 వేల కల్లు దుకాణాలు ప్రారంభించినట్టు చెప్పారు. ప్రమాదవశాత్తు మరణించిన గీత కార్మికలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియో చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పరిహారం బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం స్పెషల్ గ్రాంటు నిధులు మంజూరు చేయనుందన్నారు. -
అర్ధరాత్రి..సెక్యూరిటీ లేకుండా.. బుల్లెట్ పై మంత్రి
హైదరాబాద్: ఓ వ్యక్తి ఎంత ఎత్తుకు ఎదిగినా.. చిన్న చిన్న కోర్కెలు వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి కోర్కెలు తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు గౌడ్ ను వెంటాడాయో ఏమో.. అర్ధరాత్రి సెక్యూరిటీని వదిలేసి హైదరాబాద్ లోని పంజాగుట్ట-సికింద్రాబాద్ రోడ్డుపై రయ్ రయ్ మంటూ రాయల్ ఎన్ ఫీల్డ్ పై షికారు చేశారు. మంత్రి అయ్యాక మీటింగ్, సందర్శకులతో బిజీగా ఉండే పద్మారావు ఆటవిడుపు కోసం తన కార్యకర్తలతో కలిసి రోడ్లపై ఎంజాయ్ చేశారు. తన అభిమానులు, కార్యకర్తల కోరికను తొలుత సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం. అయితే చివరికి రాయల్ ఎన్ ఫీల్డ్ పై రైడ్ చేస్తూ.. తన కార్యకర్తను వెనుక కూచోపెట్టుకుని ఫ్లై ఓవర్లపై పద్మారావు ఎంజాయ్ రైడ్ ముగించారు.