గీత కార్మిక సొసైటీలను ఎక్సైజ్‌లో చేరుస్తాం | marging on geetha karmika socity in abkari department : padma rao | Sakshi
Sakshi News home page

గీత కార్మిక సొసైటీలను ఎక్సైజ్‌లో చేరుస్తాం

Published Fri, Dec 23 2016 2:08 AM | Last Updated on Mon, Aug 20 2018 2:21 PM

గీత కార్మిక సొసైటీలను ఎక్సైజ్‌లో చేరుస్తాం - Sakshi

గీత కార్మిక సొసైటీలను ఎక్సైజ్‌లో చేరుస్తాం

శాసన మండలిలో మంత్రి పద్మారావు హామీ
సాక్షి, హైదరాబాద్‌: గీత కార్మిక సొసైటీలను ఆబ్కారీ శాఖలోకి తిరిగి తీసుకువస్తామని ఎక్సైజ్‌ శాఖ మంత్రి పద్మారావుగౌడ్‌ సభకు హామీ ఇచ్చారు. సభ్యుడు గంగాధర్‌గౌడ్‌ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధా నమిస్తూ, వచ్చే సమావేశాల్లోపే ఈ పని పూర్తి చేస్తామని చెప్పారు. గీత కార్మిక సొసైటీలను బీసీ వెల్ఫ్‌ర్‌లో చేర్చటం వల్ల గీత కార్మికులకు అనుకున్న స్థాయిలో మేలు జరగలేదని, అందుకే త్వరలోనే ఎక్సైజ్‌శాఖలో కలుపుతామని చెప్పారు. పౌల్ట్రీ షెడ్‌ నిర్మాణంలో ఉపయోగించే పరికరాలకు ప్రస్తుతం 14.5 శాతం సుంకం వేస్తున్నారని, దాన్ని 5 శాతానికి తగ్గించాలని సభ్యుడు డాక్టర్‌ శ్రీనివాసరెడ్డి చేసిన విజ్ఞప్తికి మంత్రి తలసాని శ్రీనివాసయాద్‌ బదులిస్తూ త్వరలోనే సుంకాన్ని 5 శాతానికి తగ్గిస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement