
సాక్షి, లాలాపేట: ‘రేవంత్ ఉన్నడా ..నాకు బాగా దగ్గరోడు ఆయన’ అని తెలంగాణ అసెంబ్లీ ఉప సభాపతి తీగుళ్ల పద్మారావు గౌడ్ ..టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి అన్నారు. మంగళవారం లాలాపేటలో టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదును ప్రారంభించి పద్మారావు గౌడ్ మాట్లాడుతున్న క్రమంలో అదే సమయంలో లాలాపేట మీదుగా తార్నాక వైపు రేవంత్‌రెడ్డి వాహన శ్రేణీ ర్యాలీ వెళుతోది. దీంతో పద్మారావు గౌడ్.. తన ప్రసంగాన్ని ఆపి అటు వైపు చూస్తు రేవంత్ ఉన్నాడా ఆ ర్యాలీలో...ఆయన నాకు బాగా దగ్గరోడు అంటూ వ్యాఖ్యలు చేశారు. సమావేశం ముగిసే వరకు పద్మారావు వ్యాఖ్యలపై కార్యకర్తలంతా చర్చించుకుంటూ కూర్చున్నారు.
చదవండి: బ్లేడుతో తల్లి బెదిరింపు.. తానే కోసుకున్న బాలుడు
మా కూతురికే.. ప్రపంచ సుందరి కిరీటం!
Comments
Please login to add a commentAdd a comment