సికింద్రాబాద్ నియోజకవర్గం
సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి సిటింగ్ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న పద్మారావుగౌడ్ 2018లో మూడోసారి గెలిచారు. ఆయన ఈసారి మంత్రి పదవిని పొందలేకపోయారు. అయితే ఉపసభాపతి పదవి దక్కించుకున్నారు. పద్మారావు గౌడ్ 2018 ఎన్నికలలో 41141 ఓట్ల మెజార్టీతో తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్ది, మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్‌పై విజయం సాదించారు. ఆఖరు నిమిషంలో జ్ఞానేశ్వర్ కాంగ్రెస్ ఐ టిక్కెట్ పొంది పోటీచేసినా పలితం దక్కలేదు. పద్మారావుకు 73190 ఓట్లు రాగా, జ్ఞానేశ్వర్‌కు 32049 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసిన సతీష్‌గౌడ్‌కు 11700పైగా ఓట్లు వచ్చాయి.
పద్మారావు తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు. పద్మారావు గౌడ సామాజికవర్గం నేత. సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గంలో ప్రముఖ సినీనటి జయసుధ కాంగ్రెస్ ఐ పక్షాన 2009లో టిడిపి నేత శ్రీనివాస యాదవ్ పై గెలిచారు. ఆమె 2014లో ఓటమి చెందారు. ఇక్కడ ఈమె సమీప ప్రత్యర్ధిగా కూడా ఉండలేకపోయారు. టిఆర్‌ఎస్ సీనియర్ నేత టి.పద్మారావు గౌడ్ 2014లో టిడిపి -బిజెపి కూటమి అభ్యర్ధి కె. వెంకటేష్‌గౌడ్‌ను 25979 ఓట్ల ఆదిక్యతతో ఓడిరచారు. పద్మారావుగౌడ్ తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ఆధ్వర్యంలో ఏర్పడిన తొలి మంత్రివర్గంలో సభ్యుడయ్యారు.
శ్రీనివాసయాదవ్ సనత్‌నగర్‌కు మారి 2014, 2018లలో గెలుపొందారు. సికింద్రాబాద్‌లో శ్రీనివాస్‌యాదవ్ 1994, 1999లలోను, తిరిగి 2008లో జరిగిన ఉప ఎన్నికలోను గెలిచారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్, కాంగ్రెస్‌ఐ కలిసి ఏడుసార్లు, టిడిపి ఐదుసార్లు, టిఆర్‌ఎస్ మూడుసార్లు జనతా ఒక్కసారి గెలిచాయి. ఇక్కడ కె.సత్యనారాయణ మూడుసార్లు, ఎల్. నారాయణ రెండుసార్లు గెలిచారు. ఇక్కడ ఒకసారి గెలిచిన జె.బి. ముత్యాలరావు, మరోసారి గజ్వేల్‌లలో గెలుపొందారు.
ముత్యాలరావు మహబూబ్‌నగర్‌లో, నాగర్‌కర్నూల్‌లో ఒక్కొక్కసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. కేంద్రమంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. 1952లో ఇక్కడ ద్విసభ్య నియోజకవర్గం నుంచి గెలిచిన వి.బి. రాజు 1957లో అసిఫ్‌నగర్‌లోను, 1967లో సిద్దిపేటలోను గెలిచారు. నీలం, కాసు మంత్రివర్గాలలో సభ్యునిగా వున్నారు. రాజ్యసభ సభ్యునిగా కూడా ఉన్నారు. సికింద్రాబాద్‌లో గెలిచిన అల్లాడి రాజకుమార్ గతంలో ఎన్.టి.ఆర్ క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్నారు. ఈయన రెండుసార్లు రాజ్యసభ సభ్యునిగా కూడా వున్నారు.
తలసాని శ్రీనివాస్ యాదవ్ గతంలో చంద్రబాబు క్యాబినెట్‌లో సభ్యునిగా వున్నారు. తదుపరి కెసిఆర్ క్యాబినెట్‌లో మంత్రి అయ్యారు. 2004లో గెలిచిన టిఆర్‌ఎస్ అభ్యర్ధి టి. పద్మారావు 2008లో టిఆర్‌ఎస్ తెలంగాణ వ్యూహంలో భాగంగా పదవికి రాజీనామా చేసి తిరిగి పోటీ చేసినా ఉప ఎన్నికలో ఓడిపోయారు. 2009లో సనత్‌నగర్‌లో మళ్ళీ పోటీ చేసి ఓడిపోయారు. 2014లో సికింద్రాబాద్ నుంచి గెలిచి కెసిఆర్ క్యాబినెట్‌లో మంత్రి అయ్యారు. 201లో గెలిచి ఉప సభాపతి అయ్యారు. సికింద్రాబాద్‌లో పన్నెండుసార్లు బీసీ వర్గాల నేతలు ఎన్నికయ్యారు. ఒకసారి బ్రాహ్మణ, ఒకసారి వెలమ, ఒక ఎస్.సి నేత,మరో సారి క్రిస్టియన్ నేత ఎన్నికయ్యారు.
సికింద్రాబాద్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..
Comments
Please login to add a commentAdd a comment