Hyderabad Common Districts
-
లాస్య నందితకే కంటోన్మెంట్ టికెట్
హైదరాబాద్: నాపై నమ్మకం ఉంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున కంటోన్మెంట్ నుంచి పోటీ చేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో సాయన్న కుటుంబం మా కుటుంబమే అంటూ ప్రకటించి కేసీఆర్ చూపిన అభిమానాన్ని ఎప్పటికీ మరిచిపోలేం. ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తా. – లాస్య నందిత -
రాజీవ్ కృషితోనే ఐటీ, టెలికాం అభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: దేశంలో సాంకేతిక విప్లవం తీసుకురావడమేకాక, రాజ్యాంగ సవరణలతో పల్లెసీమలకు సర్వ హక్కులు కలి్పంచి, సర్వతోముఖాభివృద్ధి కోసం కృషి చేసిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఈనాటి యువతకు ఒక స్ఫూర్తి అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కొనియాడారు. రాజీవ్ కృషితోనే దేశంలో ఐటీ, టెలికాం రంగాల అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ 79వ జయంతి సందర్భంగా ఆదివారం సోమాజీగూడలోని రాజీవ్ విగ్రహానికి టీపీసీసీ నేతలతో కలసి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రేవంత్ మాట్లాడుతూ పరిపాలనలో సమూల మార్పులు తెచ్చి అధికారాన్ని పేదల చేతిలో పెట్టిన నాయకుడు రాజీవ్ గాంధీ అన్నారు. మహిళలకు స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు, 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన ఘనత కూడా ఆయనదేనన్నారు. ప్రధాని మోదీ దేశ సంపదను తన మిత్రుడికి దోచిపెడుతుంటే, తెలంగాణలో కేసీఆర్ తన కుటుంబానికి దోచిపెడుతున్నారని, బీజేపీ, బీఆర్ఎస్లది ఫెవికాల్ బంధమని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఈ రెండు పార్టిలకు బుద్ధిచెప్పి రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకోవాలని రేవంత్ పిలుపునిచ్చారు. గాందీభవన్‌లోనూ.. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా గాం«దీభవన్లోనూ ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీపీసీసీ డాక్టర్స్ సెల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం, యూత్‌కాంగ్రెస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఫిషర్మెన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ చేశారు. రాజీవ్ గాంధీ జీవిత చరిత్రను వివరిస్తూ డాక్యుమెంటరీని ప్రదర్శించారు. ఆయా కార్యక్రమాల్లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఇతర నేతలు దీపాదాస్ మున్షీ, వి.హనుమంతరావు, మధుయాష్కీగౌడ్, మహేశ్‌కుమార్‌గౌడ్, అంజన్‌కుమార్ యాదవ్, సంగిశెట్టి జగదీశ్వర్‌రావు, శివసేనారెడ్డి, మెట్టుసాయికుమార్, రోహిణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్సి) నియోజకవర్గం ఘన చరిత్ర..ఇదే
సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్సి) నియోజకవర్గం కంటోన్మెంట్ని రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి జి.సాయన్న ఐదోసారి విజయం సాదించారు. ఆయన గతంలో నాలుగుసార్లు టిడిపి పక్షాన, ఈసారి టిఆర్ఎస్ తరుపున గెలిచారు. 2014లో ఆయన టిడిపి అభ్యర్దిగా గెలుపొందినా, తదుపరి జరిగిన పరిణామాలలో టిఆర్ఎస్లో చేరిపోయారు. తిరిగి ఈసారి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్దిగా పోటీచేసి తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణపై 37568 ఓట్ల ఆదిక్యతతో విజయం సాదించారు. ఇక్కడ బిజేపి తరపున పోటీచేసిన శ్రీ గణేష్‌కు 15500 ఓట్లు వచ్చాయి. సాయన్నకు 65752 ఓట్లు రాగా, సర్వే సత్యనారాయణకు 28184 ఓట్లు వచ్చాయి. మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో నాలుగుసార్లు గెలుపొందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ పి.శంకరరావు 2009లో సికింద్రాబాద్ కంటోన్మెంట్లో పోటీచేసి ఐదోసారి గెలుపొందినా 2014లో కాంగ్రెస్ పార్టీ ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదు. కంటోన్మెంట్లో రెండుసార్లు గెలిచిన బి.వి గురుమూర్తి, ఒకసారి ఖైరతాబాద్‌లో గెలిచారు. 1967లో ఇక్కడ గెలిచిన వి. రామారావు 1957లో షాబాద్‌లో, 1962లో చేవెళ్ళలో గెలిచారు. ఆయన మరణం కారణంగా జరిగిన ఉప ఎన్నికలో ఆయన భార్య వి.మంకమ్మ ఇక్కడ గెలిచారు. ఆ తర్వాత మరోసారి కూడా గెలుపొందారు. ఇక్కడ గెలిచిన వారిలో బి.వి గురుమూర్తి, ఎన్.ఎ.కృష్ణ. డి. నర్సింగరావులు, డాక్టర్ శంకరరావు మంత్రి పదవులు నిర్వహించారు. మరో నేత గురుమూర్తి రాజ్యసభ సభ్యనిగా కూడా వున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కు 14సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి ఏడుసార్లు, జనతా పార్టీ ఒకసారి తెలుగుదేశం పార్టీ ఆరుసార్లు గెలిచాయి. శంకరరావు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో సభ్యుడయ్యారు. కాని ఆ తర్వాత కాలంలో ఆయన సి.ఎమ్.తో విభేదాలలో ఇరుక్కుని పదవి కోల్పోయారు. అయితే ఈయన రాసిన లేఖ ఆధారంగా హైకోర్టు జగన్ ఆస్తులపై సిబిఐ విచారణకు ఆదేశించింది. ఆ తర్వాత జగన్‌ను సిబిఐ అరెస్టు చేయడంతో అదంతా రాజకీయ వివాదంగా మారింది. రాష్ట్రంలో కీలకమైన పరిణామానికి కారకుడైన శంకరరావు ముఖ్యమంత్రి కిరణ్‌ను తీవ్రంగా విమర్శించి మంత్రి పదవిని కోల్పోవడం విశేషం. తదుపరి కాంగ్రెస్ టిక్కెట్‌ను కూడా పొందలేక పోయారు. సర్వే సత్యనారాయణ ఒకసారి టిడిపి పక్షాన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఐ నుంచి సిద్దిపేట, మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గాలలో గెలుపొందారు. మల్కాజిగిరి జనరల్ స్థానం అయినప్పటికి కాంగ్రెస్ ఐ తరపున ఈయన పోటీచేసి గెలుపొందారు. ఆ తర్వాత కేంద్రంలో మంత్రి పదవి కూడా చేశారు. 2018లో కంటోన్మోంట్ నుంచి పోటీచేసి ఓటమి చెందారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్సి) నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
సికింద్రాబాద్ నియోజకవర్గం అభ్యర్థులు వీరే
సికింద్రాబాద్ నియోజకవర్గం సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి సిటింగ్ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న పద్మారావుగౌడ్ 2018లో మూడోసారి గెలిచారు. ఆయన ఈసారి మంత్రి పదవిని పొందలేకపోయారు. అయితే ఉపసభాపతి పదవి దక్కించుకున్నారు. పద్మారావు గౌడ్ 2018 ఎన్నికలలో 41141 ఓట్ల మెజార్టీతో తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్ది, మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్‌పై విజయం సాదించారు. ఆఖరు నిమిషంలో జ్ఞానేశ్వర్ కాంగ్రెస్ ఐ టిక్కెట్ పొంది పోటీచేసినా పలితం దక్కలేదు. పద్మారావుకు 73190 ఓట్లు రాగా, జ్ఞానేశ్వర్‌కు 32049 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసిన సతీష్‌గౌడ్‌కు 11700పైగా ఓట్లు వచ్చాయి. పద్మారావు తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు. పద్మారావు గౌడ సామాజికవర్గం నేత. సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గంలో ప్రముఖ సినీనటి జయసుధ కాంగ్రెస్ ఐ పక్షాన 2009లో టిడిపి నేత శ్రీనివాస యాదవ్ పై గెలిచారు. ఆమె 2014లో ఓటమి చెందారు. ఇక్కడ ఈమె సమీప ప్రత్యర్ధిగా కూడా ఉండలేకపోయారు. టిఆర్ఎస్ సీనియర్ నేత టి.పద్మారావు గౌడ్ 2014లో టిడిపి -బిజెపి కూటమి అభ్యర్ధి కె. వెంకటేష్‌గౌడ్‌ను 25979 ఓట్ల ఆదిక్యతతో ఓడిరచారు. పద్మారావుగౌడ్ తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ఆధ్వర్యంలో ఏర్పడిన తొలి మంత్రివర్గంలో సభ్యుడయ్యారు. శ్రీనివాసయాదవ్ సనత్‌నగర్‌కు మారి 2014, 2018లలో గెలుపొందారు. సికింద్రాబాద్‌లో శ్రీనివాస్‌యాదవ్ 1994, 1999లలోను, తిరిగి 2008లో జరిగిన ఉప ఎన్నికలోను గెలిచారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి ఏడుసార్లు, టిడిపి ఐదుసార్లు, టిఆర్ఎస్ మూడుసార్లు జనతా ఒక్కసారి గెలిచాయి. ఇక్కడ కె.సత్యనారాయణ మూడుసార్లు, ఎల్. నారాయణ రెండుసార్లు గెలిచారు. ఇక్కడ ఒకసారి గెలిచిన జె.బి. ముత్యాలరావు, మరోసారి గజ్వేల్‌లలో గెలుపొందారు. ముత్యాలరావు మహబూబ్‌నగర్‌లో, నాగర్‌కర్నూల్‌లో ఒక్కొక్కసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. కేంద్రమంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. 1952లో ఇక్కడ ద్విసభ్య నియోజకవర్గం నుంచి గెలిచిన వి.బి. రాజు 1957లో అసిఫ్నగర్లోను, 1967లో సిద్దిపేటలోను గెలిచారు. నీలం, కాసు మంత్రివర్గాలలో సభ్యునిగా వున్నారు. రాజ్యసభ సభ్యునిగా కూడా ఉన్నారు. సికింద్రాబాద్‌లో గెలిచిన అల్లాడి రాజకుమార్ గతంలో ఎన్.టి.ఆర్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. ఈయన రెండుసార్లు రాజ్యసభ సభ్యునిగా కూడా వున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గతంలో చంద్రబాబు క్యాబినెట్లో సభ్యునిగా వున్నారు. తదుపరి కెసిఆర్ క్యాబినెట్లో మంత్రి అయ్యారు. 2004లో గెలిచిన టిఆర్ఎస్ అభ్యర్ధి టి. పద్మారావు 2008లో టిఆర్ఎస్ తెలంగాణ వ్యూహంలో భాగంగా పదవికి రాజీనామా చేసి తిరిగి పోటీ చేసినా ఉప ఎన్నికలో ఓడిపోయారు. 2009లో సనత్‌నగర్‌లో మళ్ళీ పోటీ చేసి ఓడిపోయారు. 2014లో సికింద్రాబాద్ నుంచి గెలిచి కెసిఆర్ క్యాబినెట్లో మంత్రి అయ్యారు. 201లో గెలిచి ఉప సభాపతి అయ్యారు. సికింద్రాబాద్‌లో పన్నెండుసార్లు బీసీ వర్గాల నేతలు ఎన్నికయ్యారు. ఒకసారి బ్రాహ్మణ, ఒకసారి వెలమ, ఒక ఎస్.సి నేత,మరో సారి క్రిస్టియన్ నేత ఎన్నికయ్యారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
బహదూర్‌పుర నియోజకవర్గంలో హ్యాట్రిక్ కొనసాగనుందా..?
బహదూర్‌పుర నియోజకవర్గం బహదూర్‌పుర నియోజకవర్గంలో నాలుగోసారి మజ్లిస్ నేత మౌజం ఖాన్ విజయం సాదించారు. గతంలో ఉన్న అసిఫ్ నగర్ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికలోను, ఆ తర్వాత బహదూర్‌పుర నియోజకవర్గం నుంచి మూడుసార్లుగా మౌజం ఖాన్ గెలుస్తున్నారు. మౌజంఖాన్ ఈ ఎన్నికలో 82518 ఓట్ల ఆదిక్యతతో గెలుపొందారు. ఆయనకు 96993 ఓట్లు రాగా, సమీప టిఆర్ఎస్ ప్రత్యర్ది ఇనాయత్ అలీ బక్రీకి 14475 ఓట్లు వచ్చాయి. బిజెపి అభ్యర్ధి హనీఫ్ అలీకి 7800 ఓట్లు వచ్చాయి. మౌజం ఖాన్ ముస్లిం వర్గం నేత. 2014లో బహదూర్‌పురాలో మౌజంఖాన్ తెలంగాణలో అత్యధికంగా 95045 ఓట్ల మెజార్టీతో టిడిపి-బిజెపి కూటమి అభ్యర్ది రహమాన్ మహమూద్‌పై గెలుపొందారు. బహదూర్‌పుర నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
యాకుత్‌పురా నిజయోకవర్గానికి తదుపరిగా ఎన్నికయ్యేది ఎవరు..?
యాకూత్‌పుర నియోజకవర్గం యాకుత్‌పురా నియోజకవర్గం నుంచి మజ్లిస పక్ష అభ్యర్దిగా అహ్మద్ పాషా ఖాద్రి నాలుగోసారి గెలిచారు. ఆయన అంతకుముందు మూడుసార్లు చార్మినార్ నుంచి విజయం సాదించారు. యాకుత్‌పుర నుంచి ఐదుసార్లు గెలిచిన ముంతాజ్ అహ్మద్ ఖాన్ చార్మినార్‌కు మారి ఆరోసారి గెలవగా, అక్కడ నుంచి యాకుత్‌పురాకు ఖాద్రి మారి నాలుగో సారి గెలిచారు. ఫాషా ఖాద్రి తన సమీప టిఆర్ఎస్ అభ్యర్ది సామా సుందర్ రెడ్డిపై 46978 ఓట్ల మెజార్టీతో విజయం సాదించారు. ఫాషా ఖాద్రీకి 59595 ఓట్లు రాగా, సుందర్‌రెడ్డికి 22517 ఓట్లు వచ్చాయి. ఇక్కడ ఎమ్.బి.టి పక్షాన పోటీచేసిన మజీదుల్లాఖాన్‌కు 20400 ఓట్లు వచ్చాయి. అహ్మద్ పాషా ఖాద్రి ముస్లిం వర్గం నేత. 1957, 1962లలో మాత్రమే కాంగ్రెస్ ఇక్కడ గెలిచింది. 1962 నుంచి ఇక్కడ ఆ పార్టీకి అవకాశం రాలేదు. 1972లో ఇక్కడ గెలిచిన సలాఉద్దీన్ ఓవైసీ చార్మినార్, పత్తర్‌గట్టిల నుంచి మరో నాలుగుసార్లు గెలిచారు. ఈయన హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఆరుసార్లు గెలుపొందారు. 1985, 89లలో గెలిచిన మస్కతి, ఆ తర్వాత కాలంలో ఆ పార్టీకి దూరం అయి, తర్వాతకాలంలో టిడిపి తరుపున శాసన మండలికి ఎన్నికయ్యారు. ముంతాజ్ అహ్మద్ ఖాన్ 1994లో ఎమ్.బి.టి తరపున గెలిచి, ఆ తర్వాత ఐదుసార్లు మజ్లిస్ పక్షాన గెలిచారు. యాకూత్‌పుర నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు?
చాంద్రాయణగుట్ట నియోజకవర్గం శాసనసభలో మజ్లిస్ పక్ష నేత, మజ్లిస్ పార్టీ అదినేత అసదుద్దీన్ ఒవైసీ సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీ చాంద్రాయణగుట్ట నుంచి ఐదోసారి గెలిచారు. ఆయన ఈ నియోజకవర్గం నుంచి వరసగా 1999 నుంచి గెలుస్తున్నారు. ఈసారి కూడా ఆయన తన సమీప బిజెపి ప్రత్యర్ది సయ్యద్ షాహీజాదిపై 80263 ఓట్ల మెజార్టీతో విజయం సాదించారు. అక్బరుద్దీన్ ఒవైసీకి 95311 ఓట్లు రాగా, సయ్యద్‌కు కేవలం 15075 ఓట్లు వచ్చాయి. ఇక్కడ టిఆర్ఎస్ పక్షాన పోటీచేసిన ఎమ్.సీతారామిరెడ్డికి పద్నాలుగు వేల ఓట్లకు పైగా వచ్చాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాలుగో స్థానానికి పరిమితం అయింది. అక్బరుద్దీన్ ఒవైసీ ముస్లిం నేత. 2014లో అక్బరుద్దీన్ 59279 ఓట్ల ఆదిక్యతతో విజయం సాధించారు. అక్బరుద్దీన్ తండ్రి సలావుద్దీన్ ఆరుసార్లు లోక్ సభకు, ఐదుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. ఈయన సోదరుడు అసదుద్దీన్ ఒవైసీ రెండుసార్లు శాసనసభ, నాలుగు సార్లుగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. చాంద్రాయణగుట్టలో ఇంతకు ముందు ఐదుసార్లు అమానుల్లాఖాన్ గెలిచారు. ఈయన మూడుసార్లు ఇండిపెండెంటుగా, మరోసారి మజ్లిస్ అభ్యర్ధిగా, ఇంకోసారి సొంతంగా ఏర్పాటు చేసుకున్న ఎమ్.బి.టి పార్టీ తరుపున గెలిచారు. అయితే 1999లో అమానుల్లాఖాన్‌ను అక్బరుద్దీన్ ఓవైసీ ఓడిరచారు. చాంద్రాయణగుట్టలో మజ్లిస్ మళ్లీ గెలిచింది. అలాగే ఇక్కడ అన్నిసార్లు ముస్లింలే గెలిచారు. చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
చార్మినార్ నియోజకవర్గం తదుపరి అధికార పార్టీ..?
చార్మినార్ నియోజకవర్గం మజ్లిస్ పార్టీ నేత ముంతాజ్ అహ్మద్ ఖాన్ చార్మినార్ నియోజకవర్గం నుంచి ఆరోసారి గెలిచారు. అంతకుముందు ఆయన యాకుత్ పుర నుంచి ఐదుసార్లు గెలిచారు. చార్మినార్‌లో గతంలో మూడుసార్లు గెలిచిన ఖాద్రీ పాషా యాకూత్ పురాకు మారి నాలుగోసారి విజయంసాదించగా, అహ్మద్‌ఖాన్ చార్మినార్ నుంచి గెలవడం విశేషం. అహ్మద్ ఖాన్ 1994లో ఎమ్.బి.టి తరపున గెలిచారు. ఆతర్వాత మజ్లిస్‌లో చేరి వరసగా గెలుస్తున్నారు. అహ్మద్ ఖాన్ తన సమీప బిజెపి ప్రత్యర్ది ఉమా మహేంద్ర పై 32886 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక్కడ కాంగ్రెస్ ఐ తరపున పోటీచేసిన మహ్మద్ గౌస్‌కు 15700 ఓట్లు వచ్చాయి. ముంతాజ్ అహ్మద్ ఖాన్‌కు 53808 ఓట్లు రాగా, ఉమా మహేంద్ర కు 21222 ఓట్లు వచ్చాయి.అహ్మద్ ఖాన్ ముస్లిం నేత. హైదరాబాద్‌లోని చారిత్రాత్మకమైన చార్మినార్ శాసనసభ నియోజకవర్గంలో 1967 నుంచి కేవలం మజ్లిస్ పక్షమే గెలుస్తోంది. కొన్నిసార్లు ఇండిపెండెంట్లు గెలిచినట్లు రికార్డులు చెబుతున్నా, ఆ ఇండిపెండెంట్లు కూడా మజ్లిస్ పక్షంవారే. మజ్లిస్ పక్షానికి ఎన్నికల సంఘం గుర్తింపు లేనప్పుడు వారు ఇండిపెండెంట్లుగా పోటీచేసి గెలుపొందారు. మజ్లిస్ ప్రధాన నాయకుడు, దివంగత సలావుద్దీన్ ఓవైసీ 1967, 1978, 83లలో చార్మినార్ నుంచి, 1962లో ఫత్తర్‌గట్టి నుంచి, 1972లో యాకుత్‌పురా నుంచి గెలుపొందారు. 1962లో అప్పటి మంత్రి మాసూనా బేగంను ఓడిరచి చట్టసభలో ప్రవేశించారు. అప్పటి నుంచి ఓటమి ఎరుగని నేతగా ఐదుసార్లు అసెంబ్లీకి, ఆ తర్వాత 1984 నుంచి 1999 వరకు జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఆరుసార్లు గెలుపొందారు. సలావుద్దీన్ ఓవైసీ పెద్దకుమారుడు అసదుద్దీన్ ఓవైసీ చార్మినార్‌లో రెండుసార్లు శాసనసభకు హైదరాబాద్ లోక్‌సభ స్థానానికి నాలుగుసార్లు గెలుపొందారు. రెండో కుమారుడు అక్బరుద్దీన్ ఓవైసీ 1999 నుంచి ఐదుసార్లు చాంద్రా యణగుట్ట నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 1999లో తండ్రి, ఇద్దరు కుమారులు కూడా చట్టసభలలో ఉండడం కూడా ఒక అరుదైన రికార్డు. 1989లో చార్మినార్‌లో గెలుపొందిన విరాసత్ రసూల్‌ఖాన్ అంతకుముందు రెండుమార్లు అసిఫ్‌నగర్ నుంచి 2009లో నాంపల్లి నుంచి విజయం సాధించారు. చార్మినార్‌లో గెలిచినవారంతా ముస్లింలే కావడం విశేషం. చార్మినార్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
గోషామహల్ నియోజకవర్గంలో ఈసారి ప్రజల ఓటు ఎవరికీ..?
గోషామహల్ నియోజకవర్గం గోషామహల్ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్ది, సిటింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్ రెండోసారి గెలిచారు. 2018లో బిజెపి తెలంగాణ అసెంబ్లీలో గెలిచిన ఏకైక సీటు ఇది. రాజాసింగ్ తన సమీప టిఆర్ఎస్ ప్రత్యర్ది,మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాదోడ్ పై 17734 ఓట్ల ఆదిక్యతతో గెలిచారు. గతంలో రాదోడ్ బిజెపిలోనే ఉండారు. తదుపరి ఆయన టిఆర్ఎస్ లో చేరారు. కాని ఫలితం దక్కలేదు. మాజీ మంత్రి, కాంగ్రెస్ ఐ నేత ముకేష్ గౌడ్ 25217 ఓట్లతో మూడు స్థానంలో నిలిచారు. రాజాసింగ్ కు 61854 ఓట్లు రాగా, ప్రేమ్ సింగ్ రాదోడ్ కు 44120 ఓట్లు వచ్చాయి. రాజాసింగ్ 2014లో కూడా భారీ గా 46793 ఓట్ల ఆధిక్యతతో ముకేష్ పై గెలిచారు. 2014లో ఇక్కడ టిఆర్ఎస్ పక్షాన పోటీచేసిన ప్రేమకుమార్ ధూత్‌కు 6312 ఓట్లు లభించాయి. మాజీ మంత్రి ముకేష్ 1989, 2004లలో మహారాజ్‌గంజ్ నుంచి 2009లో గోషామహల్ నుంచి గెలిచారు. 2007 నుంచి రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో సభ్యునిగా ఉంటూ, తిరిగి గెలిచి వ్కెఎస్ క్యాబినెట్లోనూ ఆ తరువాత రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి క్యాబినెట్లోనూ ఉన్నారు. 1983లో టిడిపి పక్షాన గెలిచిన పి. రామస్వామి, 1994లో బిజెపి తరుపున చట్టసభకు నెగ్గారు. ఈయన 1984లో నాదెండ్ల భాస్కరరావు నెలరోజుల మంత్రివర్గంలో సభ్యునిగా వున్నారు. 1985లో గెలిచిన జి. నారాయణరావు సభాపతి పదవిబాధ్యతలు నిర్వహించారు. మహారాజ్‌గంజ్‌లో కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి నాలుగుసార్లు, టిడిపి రెండుసార్లు, బిజెపి రెండుసార్లు, సంయుక్త సోషలిస్టు పార్టీ ఒకసారి గెలిచాయి. మహారాజ్ గంజ్ లో ఎనిమిదిసార్లు బిసిలు గెలవగా,వారిలో ముగ్గురు గౌడ, నలుగురు మున్నూరు కాపు వర్గానికి చెందినవారు.ఒకసారి వెలమ, మరోసారి పిట్టి గెలుపొందారు. కాగా గోషా మహల్ లో మూడుసార్లుగా బిసి నేతలే ఎన్నికయ్యారు. గోషామహల్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
కార్వాన్ నియోజకవర్గానికి కొత్త నాయకుడు ఎవరు..?
కార్వాన్ నియోజకవర్గం కార్వాన్ నియోజకవర్గంలో మజ్లిస్ పార్టీ అభ్యర్ధి, సిటింగ్ ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్ మరోసారి విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్ది, బిజెపి నేత అమర్‌సింగ్‌పై 49692 ఓట్ల ఆదిక్యతతో గెలిచారు. ఇక్కడ టిఆర్ఎస్ పక్షాన పోటీచేసిన టి.జీవన్ సింగ్‌కు సుమారు 24600 ఓట్లు వచ్చాయి. టిఆర్ఎస్, మజ్లిస్‌లు స్నేహపక్షాలే అయినా, హైదరాబాద్‌లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా టిఆర్ఎస్ తన సొంత అభ్యర్దులను పెట్టడం ద్వారా మజ్లిస్‌కు సహకరించిం దనుకోవచ్చు. మొయినుద్దీన్‌కు 85401ఓట్లు రాగా, అమర్‌సింగ్‌కు 35709 ఓట్లు వచ్చాయి. మొయినుద్దీన్ ముస్లిం నేత. కార్వాన్ నియోజకవర్గంలో 2014లో మజ్లిస్ ఈసారి సిటింగ్ ఎమ్మెల్యే అప్సర్ ఖాన్‌కు కాకుండా కొత్త అభ్యర్ధి మొయినుద్దీన్‌కు పార్టీ అవకాశం ఇచ్చింది. ఈయన భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత బద్దం బాల్‌రెడ్డిని ఓడిరచారు. 1999లో ఎన్నికైన సయ్యద్ సజ్జాద్ మరణించడంతో 2003లో జరిగిన ఉప ఎన్నికలో తొలిసారిగా అప్సర్‌ఖాన్ ఎన్నికయ్యారు. అయితే అప్పుడు కేవలం మూడు నెలలు మాత్రమే ఈయన పదవిలో ఉన్నారు. అంతలో అసెంబ్లీ రద్దు అయిపోయింది. తిరిగి 2004లో తదుపరి 2009లో గెలిచారు. 2014లో టిక్కెట్ ఇవ్వలేదు. అంతకుముందు బిజెపి నేత బద్దం బాల్‌రెడ్డి మూడుసార్లు గెలిచారు. 1983లో ఇక్కడ గెలిచిన బాకర్ అగా 1978లో యాకుత్‌పురా నుంచి గెలిచారు. సయ్యద్ సజ్జాద్ 1989లో ఆసిఫ్‌నగర్‌లో, 1999లో కార్వాన్లో గెలిచారు. కార్వాన్ నియోజకవర్గానికి కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి రెండుసార్లు, బిజెపి మూడుసార్లు, ఎమ్.ఐ.ఎమ్ ఆరుసార్లు, ఇండి పెండెంటు ఒకసారి విజయం సాధించారు. ఇక్కడ మూడుసార్లు రెడ్డి నేతలు, ముస్లింలు తొమ్మిది సార్లు , బిసిలు రెండుసార్లు గెలుపొందారు. కార్వాన్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
నాంపల్లి నియోజకవర్గం అభ్యర్థికి హ్యాట్రిక్ అవకాశం...
నాంపల్లి నియోజకవర్గం 2009లో నియోజకవర్గ పునర్ విభజనలో అసిఫ్‌నగర్ నియోజకవర్గం రద్దై నాంపల్లి నియోజకవర్గం నూతనంగా ఏర్పడింది. నాంపల్లి నియోజకవర్గంలో మజ్లిస్ నేత జాఫర్ హుస్సేన్ రెండోసారి గెలిచారు. ఆయన తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది ఫిరోజ్ ఖాన్‌పై 9700 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పిరోజ్ ఖాన్ గతంలో ఫిరోజ్ ఖాన్ ప్రజారాజ్యం, టిడిపిల పక్షాన పోటీచేసి ఓడిపోయారు. ఈసారి కాంగ్రెస్ ఐ టిక్కెట్‌పై ప్రయత్నించినా లాభం దక్కలేదు. జాఫర్ హుస్సేన్‌కు 57940 ఓట్లు రాగా, పిరోజ్ ఖాన్‌కు 48265 ఓట్లు వచ్చాయి. ఇక్కడ టిఆర్ఎస్ పక్షాన పోటీచేసిన సిహెచ్ ఆనందకుమార్‌కు సుమారు పదిహేడు వేల ఓట్లు వచ్చాయి. నాంపల్లిలో 2014లో మజ్లిస్ పార్టీ విరాసత్ రసూల్‌ఖాన్‌ను మార్చి జాఫర్ హుస్సేన్‌కు అవకాశం ఇచ్చింది. రసూల్ ఖాన్ ఇక్కడ ఒకసారి గెలవగా, గతంలో రెండుసార్లు అసిఫ్‌నగర్ నుంచి ఒకసారి చార్మినార్ నుంచి విజయం సాధించారు. కొత్త నియోజకవర్గంగా నాంపల్లి ఏర్పడినప్పటినుంచి ముస్లింలే గెలుపొందారు. అసిఫ్‌నగర్ ప్రత్యేకత (2009లో రద్దు) 2009లో రద్దు అయిన అసిఫ్‌నగర్ నియోజకవర్గానికి 14సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి ఏడుసార్లు, ఇండిపెండెంట్లు నాలుగు సార్లు, ఎమ్.ఐ.ఎమ్. రెండుసార్లు, టిడిపి ఒకసారి గెలిచాయి. అయితే ఇండిపెండెంట్లుగా గెలిచిన వారంతా కూడా మజ్లిస్ వారే. 2009,2018లలో ఖైరతాబాద్ నుంచి గెలిచిన దానం నాగేందర్ అసిఫ్‌నగర్‌లో మూడుసార్లు గెలిచారు. అసిఫ్‌నగర్‌లో రెండుసార్లు కాంగ్రెస్ ఐ తరుపున గెలుపొందిన ఈయనకు 2004లో కాంగ్రెస్ ఐ పక్షాన అసెంబ్లీ టికెట్ కాకుండా లోక్‌సభ టికెట్ ఇవ్వడంతో నిరసనగా పార్టీని వదిలి టిడిపి పక్షాన పోటీ చేసి మూడోసారి గెలిచారు. కాని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కావడంతో ఆ పదవికి రాజీనామా చేసి తిరిగి పోటీలో నిలబడ్డారు. కాని గెలుపొందలేకపోయారు. తిరిగి 2009లో ఖైరతాబాద్ నుంచి పోటీచేసి గెలిచారు. ఆ తర్వాత 2018లో టిఆర్ఎస్ పక్షాన గెలిచారు. 2008 ఉప ఎన్నికలో గెలిచిన మౌజంఖాన్ ఆ తర్వాత 2009లో బహదూర్‌పుర నుంచి గెలిచారు. ప్రముఖ నేత విబిరాజు ఇక్కడ ఒకసారి, సికింద్రాబాదు, సిద్దిపేటల నుండి ఒక్కొక్కసారి గెలిచారు. వి.బి.రాజు రాజ్యసభ సభ్యునిగా కూడా ఎన్నికయ్యారు. అసిఫ్‌నగర్ నుంచి రెండుసార్లు గెలుపొందిన ఎమ్.ఎమ్. హషీం మరో రెండుసార్లు సికింద్రాబాద్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. హషీం శాసనమండలి సభ్యునిగా కూడా ఎన్నికై చెన్నారెడ్డి క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. వి.బి రాజు కూడా నీలం, కాసు, మంత్రివర్గాలలో పనిచేశారు. 1957లో గెలిచిన వి.బిరాజుపైన, అలాగే 1967లో తాండూరులో గెలిచిన చెన్నారెడ్డిపైన ఎన్నికల పిటిషన్లు వేసి రెండుసార్లు ఇద్దరిని అనర్హులను చేయించిన ఘనత వందేమాతరం రామ చంద్రరావుకు దక్కుతుంది. వందేమాతరం 1959లో ఉప ఎన్నికలో గెలుపొందారు. అలాగే 1962లో కూడా ఇండిపెండెంటుగా మేడ్చల్‌లో పోటీచేసి చెన్నారెడ్డి మేనమామ, మాజీ ఉప ముఖ్యమంత్రి కె.వి. రంగారెడ్డిని ఓడిరచిన ఘనత కూడా వందేమాతరం రామ చంద్రరావుకు దక్కుతుంది. ఇలా ముగ్గురు ప్రముఖులను ముప్పతిప్పలు పెట్టిన ఘనాపాటిగా ఈయన ప్రసిద్ధిగాంచారు. విబి రాజు బ్రాహ్మణ వర్గం వారు కాగా, వందేమాతరం రామచంద్రరావు వెలమ వర్గం వారు, బి.కృష్ణ, దానం నాగేందర్‌లు బిసి వర్గం వారు. మిగిలినవారు ముస్లింలు. నాంపల్లి నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
సనత్‌నగర్ ప్రజలు ఈసారి ఎన్నుకునే అభ్యర్థి ఎవరు..?
సనత్ నగర్ నియోజకవర్గం సనత్‌నగర్ నియోజకవర్గం నుంచి మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మరోసారి గెలిచారు. దీనితో ఆయన ఐదుసార్లు గెలిచినట్లయింది. ఒక ఉప ఎన్నికతో సహా మూడుసార్లు సికింద్రాబాద్ నుంచి, రెండుసార్లు సనత్‌నగర్ నుంచి గెలిచారు. 2014 ఎన్నికల వరకు ఆయన టిడిపిలో ఉండేవారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలలో ఆయన టిఆర్ఎస్లో చేరి కెసిఆర్ క్యాబినెట్లో మంత్రి కూడా అయ్యారు. 2018లో టిఆర్ఎస్ పక్షాన పోటీచేసి మరోసారి గెలిచి మళ్లీ మంత్రి కాగలిగారు. తలసాని తన సమీప తెలుగుదేశం ప్రత్యర్ది కూన వెంకటేష్ గౌడ్‌పై 30651 ఓట్ల మెజార్టీతో విజయం సాదించారు. తలసానికి 66464 ఓట్లు రాగా, వెంకటేష్ గౌడ్‌కు 35813 ఓట్లు తెచ్చుకున్నారు. మహాకూటమిలో భాగంగా ఇక్కడ టిడిపి పోటీచేసింది. కాగా ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసిన బవర్ లాల్ వర్మకు 14200 ఓట్లు వచ్చి మూడో స్థానంలో నిలిచారు. తలసాని యాదవ వర్గానికి చెందినవారు. సనత్ నగర్ నియోజకవర్గంలో 2014లో తలసాని శ్రీనివాసయాదవ్ టిఆర్ఎస్ అభ్యర్ధి విఠల్పై 27461 ఓట్ల ఆధిక్యతతో విజయం సాదించారు. 2014లో ఇక్కడ పోటీచేసిన కేంద్ర ప్రకృతి వైపరీత్యాల సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిదర్ రెడ్డి కనీసం రెండో స్థానంలో కూడా లేకపోవడం విశేషం. శశిదర్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి కుమారుడు. సనత్‌నగర్‌లో నాలుగుసార్లు విజయం సాధించారు. 1989లో ఇక్కడ నుంచి చెన్నారెడ్డి గెలిచాక ఓ ఏడాదిపాటు ముఖ్యమంత్రి పదవి నిర్వహించారు. అనంతరం ఆయన గవర్నరు పదవి చేపట్టడానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా 1992లో జరిగిన ఉప ఎన్నికలో శశిధర్‌రెడ్డి గెలిచారు. తదుపరి మరో మూడుసార్లు గెలుపొందారు. చెన్నారెడ్డి వికారాబాద్, తాండూరు, మేడ్చల్ నుంచి కూడా గతంలో గెలుపొంది మొత్తం ఆరుసార్లు ప్రాతినిధ్యం వహించారు. సనత్‌నగర్ అసెంబ్లి స్థానానికి కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి ఆరుసార్లు, టిడిపి నాలుగుసార్లు గెలిచాయి. టిఆర్ఎస్ ఒకసారి గెలిచింది. శ్రీనివాసయాదవ్ గతంలో చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో కూడా పనిచేశారు. టిడిపి నేత శ్రీపతి రాజేశ్వర్ సనత్‌నగర్‌లో రెండుసార్లు, అంతకు ముందు ముషీరాబాద్‌లో ఒకసారి గెలిచారు. ఎన్.టి.ఆర్ అభిమాన సంఘాల నాయకుడిగా పేరొందిన రాజేశ్వర్ గతంలో ఎన్.టి.ఆర్ క్యాబినెట్లో సభ్యునిగా కూడా వున్నారు. శశిధర్‌రెడ్డి అప్పట్లో కోట్ల విజయభాస్కరరెడ్డి క్యాబినెట్లో పనిచేశారు. సనత్ నగర్లో ఐదుసార్లు రెడ్డి సామాజికవర్గం నేతలు గెలిస్తే ఐదుసార్లు బిసి నేతలు, ఒకసారి కమ్మ నేత గెలుపొందారు. సనత్ నగర్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో ఈసారి ఈ అభ్యర్థి గెలిస్తే హ్యాట్రిక్ ఖాయం...
జూబ్లిహిల్స్ నియోజకవర్గం జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో సిటింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాద్ ఈసారి టిఆర్ఎస్ పక్షాన పోటీచేసి విజయం సాదించారు. 2014లో ఆయన టిడిపి పక్షాన పోటీచేసి గెలుపొందారు. కాని తరుపరి పరిణామాలలో ఆయన టిఆర్ఎస్లో చేరి పోయారు. 2018లో టిఆర్ఎస్ పార్టీ టిక్కెట్‌పై పోటీచేసి తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్ రెడ్డిపై 8385 ఓట్ల మెజార్టీతో గెలిచారు. గోపీనాద్కు 42430 ఓట్లు రాగా, విష్ణువర్దన్ రెడ్డికి 34045 ఓట్లు వచ్చాయి. కాగా ఇక్కడ పోటీచేసిన స్వతంత్ర అబ్యర్ది నవీన్ యాదవ్ సుమారు 17 వేల ఓట్లు తెచ్చుకుని మూడో స్థానంలో ఉన్నారు. జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో 2014లో మాగంటి గోపినాధ్ తన సమీప ప్రత్యర్ధి, ఎమ్.ఐ.ఎమ్. నేత నవీన్ యాదవ్‌పై 9242 ఓట్ల ఆధిక్యతతో విజయం సాదించారు. అంతకుముందు 2009లో గెలిచిన విష్ణువర్ధనరెడ్డి 2014లో 33642 ఓట్లు తెచ్చుకున మూడో స్థానానికి పరిమితం అయ్యారు. విష్ణు దివంగత నేత, మాజీ మంత్రి పి.జనార్ధనరెడ్డి కుమారుడు. 2004లో ఖైరతాబాద్‌లో గెలుపొందిన జనార్ధనరెడ్డి ఆకస్మికంగా గుండెపోటుతో మరణించగా, 2008లో జరిగిన ఖైరతాబాద్ ఉప ఎన్నికలో విష్ణు విజయం సాధించారు. 2009లో ఏర్పడిన జూబ్లిహిల్స్ నియోజకవర్గం నుంచి రెండోసారి గెలిచి 2014లో ఓటమి చెందారు. జూబ్లిహిల్స్‌లో ఒకసారి రెడ్డి, రెండుసార్లు కమ్మ నేత గెలుపొందారు జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే... -
ఖైరతాబాద్ నియోజకవర్గం: ఈసారి అధికారం ఎవరిది?
ఖైరతాబాద్ నియోజకవర్గం ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గంలో ఈ సారి మాజీ మంత్రి దానం నాగేందర్ టిఆర్ఎస్ పక్షాన పోటీచేసి విజయం సాదించారు. ఆయన తన సమీప బిజెపి ప్రత్యర్ది, 2014లో గెలిచిన చింతల రామచంద్రారెడ్డిపై 28402 ఓట్ల ఆదిక్యతతో విజయం సాదించారు. నాగేందర్ గతంలో మూడుసార్లు కాంగ్రెస్ ఐ పక్షాన, ఒకసారి టిడిపి పక్షాన కూడా గెలిచారు. 2009-2014 మధ్య కాంగ్రెస్ ఐ మంత్రివర్గాలలో మంత్రిగా పనిచేశారు. 2014లో కాంగ్రెస్ఐ పక్షాన పోటీచేసి ఓటమి చెందిన తర్వాత కొంతకాలానికి ఆయన టిఆర్ఎస్లో చేరిపోయారు. 2018లో టిక్కెట్ పొంది విజయం సాదించారు. కాగా ఇక్కడ మహాకూటమిలో కాంగ్రెస్ ఐ అభ్యర్ధిగా పోటీచేసిన దాసోజు శ్రావణ్ సుమారు 33500 ఓట్లతో మూడోస్థానానికి పరిమితం అయ్యారు. నాగేందర్‌కు 63063 ఓట్లు రాగా, చింతల రామచంద్రారెడ్డికి 34666 ఓట్లు వచ్చాయి. నాగేందర్ మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందినవారు. ఖైరతాబాద్‌లో ఆరుసార్లు రెడ్డి సామాజికవర్గం నేతలు, నాలుగుసార్లు బిసి (మున్నూరుకాపు)నేతలు గెలవగా రెండుసార్లు వెలమ, ఒకసారి వైశ్య సామాజికవర్గం గెలిచాయి. నగరంలో ప్రాధాన్యత కలిగిన ఖైరతాబాద్ నియోజకవర్గం 1967 నుంచి ఏర్పడిరది. కాంగ్రెస్. కాంగ్రెస్ (ఐ)లు ఏడుసార్లు, టిడిపి రెండుసార్లు, బిజెపి ఒకసారి టిఆర్ఎస్ ఒకసారి గెలుపొందాయి. ఒకసారి ఇండిపెండెంటు నెగ్గారు. కాంగ్రెస్ ఐ ప్రముఖుడు పి. జనార్దనరెడ్డి ఐదుసార్లు గెలుపొందగా, 1967-72 టరమ్‌లో ఎన్.కృష్ణారావు ఉప ఎన్నికలోను, ఆ తర్వాత సాధారణ ఎన్నికలోను గెలిచారు. పి. జనార్ధన్‌రెడ్డి ఆకస్మిక మరణంతో జరిగిన ఉప ఎన్నికలో ఆయన కుమారుడు విష్ణువర్దన్ రెడ్డి గెలిచారు. తదుపరి 2009లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి మరోసారి గెలిచారు. నగరంలో గతంలో ముఖ్యనేతగా ప్రసిద్ది వహించిన బి.వి.గురుమూర్తి ఒకసారి ఇక్కడ గెలవగా, అంతకుముందు సికింద్రాబాద్ కంటోన్మెంటు నుంచి రెండుసార్లు విజయం సాధించారు. ఇక్కడ గెలిచినవారిలో ఇద్దరు తప్ప మిగిలినవారంతా మంత్రి పదవులు నిర్వహించడం విశేషం. బి.వి.గురుమూర్తి గతంలో నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరరెడ్డి మంత్రివర్గాలలో పనిచేయగా, పి.జనార్దనరెడ్డి 1981లో టి.అంజయ్య, 82లో భవనం వెంకట్రామ్ల మంత్రి వర్గాలలోను, 1991, 92లలో నేదురుమల్లి జనార్దనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గాలలోను బాధ్యతలు నిర్వహించారు. ఎమ్.రామచంద్రరావు 1983లో ఎన్.టి.రామారావు మంత్రివర్గంలో ఉన్నారు.1984 తెలుగుదేశం సంక్షోభంలో రామచంద్రరావు నెలరోజుల నాదెండ్ల క్యాబినెట్లో కూడా పనిచేశారు. కె. విజయరామారావు 1999 ఎన్నికల తర్వాత చంద్రబాబు మంత్రివర్గంలో చేరారు. బి.వి.గురుమూర్తి1954లో రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు. దానం నాగేందర్ అంతకుముందు ఆసిఫ్‌నగర్‌లో మూడుసార్లు గెలిచారు. నాగేందర్ 2004లో టిడిపి పక్షాన పోటీ చేసి గెలుపొందడం విశేషం. అయితే కాంగ్రెస్ ఐ అధికారంలోకి రావడంతో ఆయన ఎమ్మెల్యే పదవికి, టిడిపికి రాజీనామా చేసి తిరిగి అసిఫ్‌నగర్‌లో పోటీ చేసినా గెలవలేకపోయారు. 2009లో ఖైరతాబాద్‌లో గెలిచాక వైఎస్ క్యాబినెట్లో, తదుపరి రోశయ్య, కిరణ్ క్యాబినెట్ లలో పనిచేశారు. 2014లో ఓడిపోయారు. 2018లో టిఆర్ఎస్ నుంచి గెలిచారు. 1999లో కెసిఆర్‌కు బదులుగా విజయరామారావుకు చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వడంతో రాష్ట్ర చరిత్రే మారిపోయిందన్న అబిప్రాయం ఉంది. అసంతృప్తికి గురైన కెసిఆర్ తదుపరి కొంతకాలం ఉప సభాపతిగా ఉండి, ఉప సభాపతి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, టిఆర్ఎస్ ను స్థాపించి, తెలంగాణ రాష్ట్ర సాదనలో కీలక పాత్ర పోషించి ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. విజయరామారావు సిబిఐ డైరెక్టర్‌గా రిటైర్ అయిన తర్వాత టిడిపిలో చేరి ఖైరతాబాద్‌లో గెలిచి మంత్రి అయ్యారు. ఆ విధంగా రాష్ట్ర విభజనకు ఇది ఒక కీలకమైన మలుపుగా చెబుతారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
అంబర్‌పేట నియోజకవర్గంలో గెలుపు ఎవరిది?
అంబర్‌పేట నియోజకవర్గం 2009లో నియోజకవర్గ పునర్ విభజనలో హిమాయత్‌నగర్ నియోజకవర్గం రద్దై అంబర్‌పేట నియోజకవర్గం నూతనంగా ఏర్పడింది. అంబర్‌పేట నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత జి.కిషన్ రెడ్డిని టిఆర్ఎస్ పక్షాన పోటీచేసిన కొత్త అభ్యర్ది కాలేరు వెంకటేష్ ఓడిరచడం విశేషం. వరసగా మూడుసార్లు హిమయత్ నగర్, అంబర్‌పేటల నుంచి గెలిచిన కిషన్ రెడ్డి 2018లో 1016 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికలలో కిషన్ రెడ్డి గెలుపొంది కేంద్రంలో సహాయ మంత్రి కావడం.. తదుపరి కేంద్ర క్యాబినెట్ మంత్రిగా ప్రమోషన్ పొందడం మరో ప్రత్యేకత. కాగా అంబర్‌పేటలో వెంకటేష్ తొలిసారి గెలిచారు. వెంకటేష్‌కు 61558 ఓట్లు రాగా, కిషన్‌రెడ్డికి 60542 ఓట్లు వచ్చాయి. ఇక్కడ నుంచి పోటీచేసిన తెలంగాణ జనసమితి అభ్యర్ది రమేష్ ముదిరాజ్‌కు కేవలం నాలుగువేల పైచిలుకు ఓట్లు మాత్రమే వచ్చాయి. కాలేరు వెంకటేష్ బీసి వర్గాలలోని వంజారా సామాజిక వర్గానికి చెందినవారు. అంబర్‌పేట నియోజకవర్గంలో 2014లో జి.కిషన్‌రెడ్డి మూడోసారి తన సమీప ప్రత్యర్ధి టిఆర్ఎస్ నేత ఎడ్ల సుధాకరరెడ్డిపై 62598 బారీ ఆదిక్యతతో విజయం సాధించారు. కిషన్‌రెడ్డి పార్టీ ఉమ్మడి రాష్ట్ర శాఖ అద్యక్షుడుగా, శాసనసభ పక్ష నేతగా కూడా వ్యవహరించారు. 2014లో ఇక్కడ పోటీచేసిన కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు 16575 ఓట్లు మాత్రమే తెచ్చుకుని మూడో స్థానానికి పరిమితం అయ్యారు. కాంగ్రెస్ నేత వి.హెచ్ ఒకసారి హిమయత్ నగర్ నుంచి గెలుపొంది మంత్రిపదవి పొందారు. ఆ తర్వాత పిసిసి అద్యక్షుడు అయ్యారు. తదుపరి మూడుసార్లుగా రాజ్యసభ సభ్యత్వం పొందారు. హిమాయత్‌నగర్ (2009లో రద్దు) రాజధాని నగరంలో పలు సంచలనాలకు కేంద్రంగా ఉన్న హిమాయత్‌నగర్ శాసనసభ నియోజకవర్గం 1978లో ఏర్పడిది. ఈ నియోజకవర్గంలో ఎన్నికై ముఖ్యమ్కెన పదవులు చేపట్టాలనుకున్న కొందరు ముఖ్యులు ఓటమి పాలవడం ఇక్కడి ప్రత్యేకత. రెండు సార్లు జరిగిన ఉప ఎన్నికలలో ఇద్దరు ప్రముఖులు ఓటమికి గురి అయితే, భారతీయ జనతా పార్టీ ముఖ్య నేత ఎ.నరేంద్ర ఆ రెండుసార్లు గెలుపొందడం విశేషం. 1983లో శాసనసభకు ఎన్నికైన తెలుగుదేశం శాసనసభ్యుడు జి. నారాయణరావు గౌడ్ ఆకస్మిక మరణంతో జరిగిన ఉప ఎన్నికలో అప్పట్లో తెలుగుదేశం పార్టీలో ప్రధాన పాత్రధారులలో ఒకరుగా ఉన్న పర్వతనేని ఉపేంద్ర ఇక్కడ పోటీచేయగా, బిజెపి నేత నరేంద్ర చేతిలో ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత 1992లో కాంగ్రెస్ ఎమ్మెల్యే వి.హనుమంతరావు రాజ్యసభకు ఎన్నికైన కారణంగా రాజీనామా చేయడంతో ఏర్పడిన ఖాళీకి జరిగిన ఉప ఎన్నికలో మాజీ ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి పదవికి పోటీదారులలో ఒకరిగా ఉన్న సి.జగన్నాధరావు కాంగ్రెస్ ఐ అభ్యర్దిగా పోటీచేయగా, అప్పుడు కూడా బిజెపి అభ్యర్దిగా పోటీచేసిన నరేంద్ర గెలుపొందడం విశేషం. వి.హెచ్ కూడా మంత్రి పదవి చేసి, తదుపరి ఏపిసిసి అధ్యక్షుడు అయి, అనంతరం రాజ్యసభకు మూడుసార్లు ఎన్నికయ్యారు. రెండు ఉప ఎన్నికలతో సహా 9సార్లు ఎన్నికలు జరిగితే బిజెపి నాలుగుసార్లు, టిడిపి మూడుసార్లు జనతా, కాంగ్రెస్ ఐలు ఒక్కొక్కసారి గెలిచాయి. ఇక్కడ టిడిపి పక్షాన గెలిచిన కృష్ణయాదవ్ రాష్ట్ర మంత్రి అవడం ఒక విశేషమైతే ఆయన స్టాంపుల కుంభకోణంలో ఇరుక్కుని జైలు పాలవడం మరో ప్రత్యేకత. బిజెపి మాజీ నేత నరేంద్ర తదుపరి కాలంలో టిఆర్ఎస్లో చేరి ఎంపిగా గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు. 1978లో జనతా పార్టీ తరపున హిమాయత్‌నగర్‌లో శాసనసభకు ఎన్నికైన లక్ష్మీకాంతమ్మ అంతకుముందు 1957లో ఖమ్మం నుంచి కూడా గెలిచారు. ఆమె తదుపరి మూడుసార్లు ఖమ్మం నుంచి కాంగ్రెస్ ఎమ్.పి.గా ఉన్నారు. ఇక్కడ తొమ్మిదిసార్లు బిసి నేతలు గెలుపొందగా ఒకసారి కమ్మ, మరోసారి రెడ్డి నేతలు గెలుపొందారు. అంబర్‌పేట నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
మలక్‌పేట నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే
మలక్‌పేట నియోజకవర్గం మలక్‌పేట సిటింగ్ ఎమ్మెల్యే, మజ్లిస్ నేత అహ్మద్ బలాలా మూడోసారి గెలు పొందారు. ఆయన తన సమీప టిడిపి ప్రత్యర్ది ముజఫర్ అలీపై 17572 ఓట్ల మెజార్టీతో గెలిచారు. బలాలాకు 53281 ఓట్లు రాగా, ముజఫర్ అలీకి 29769 ఓట్లు వచ్చాయి. మహాకూటమిలో భాగంగా టిడిపి ఇక్కడ పోటీచేసింది. ఇక్కడ బిజెపి పక్షాన పోటీ చేసిన ఆలె జితేంద్రకు సుమారు 20900 ఓట్లు వచ్చాయి. హైదరాబాద్‌లో ఏడు స్థానాలలో మజ్లిస్ పట్టు నిలుపుకోగా, వాటిలో మలక్‌పేట ఒకటి. అహ్మద్ బలాలా ముస్లిం నేత. నియోజకవర్గాల పునర్విభజన తరువాత మలక్‌పేట నియోజకవర్గం పూర్తిగా ఎమ్.ఐ.ఎమ్‌కు అనుకూలంగా మారింది. దాంతో తొలిసారిగా 2009లో ఇక్కడ నుంచి మజ్లిస్ పక్షాన అహ్మద్బిన్ అబ్దుల్ బలాల మూడోసారి కూడా ఎన్నికయ్యారు. గతంలో మీర్ అహ్మద్ అలీఖాన్ రెండుసార్లు, జి.సరోజని పుల్లారెడ్డి రెండుసార్లు, ఎన్.ఇంద్రసేనారెడ్డి మూడుసార్లు, మల్రెడ్డి రంగారెడ్డి రెండుసార్లు గెలిచారు. మల్రెడ్డి ఒకసారి టిడిపి తరుఫున, మరోసారి కాంగ్రెస్ ఐ పక్షాన గెలిచారు. సరోజిని పుల్లారెడ్డి, మీర్ అహ్మద్ అలీఖాన్,కె. ప్రభాకర్‌రెడ్డిలు మంత్రి పదవి నిర్వహించిన వారిలో ఉన్నారు. ప్రభాకరరెడ్డి డిప్యూటీ స్పీకరు పదవి కూడా చేసారు. జనతా పార్టీ పక్షాన గెలిచిన ఈయన తరువాత కాంగ్రెస్‌లో చేరారు. 1989లో ఇక్కడ గెలుపొందిన సుధీర్‌కుమార్ కేంద్ర మాజీ మంత్రి పి.శివశంకర్ కుమారుడు. శివశంకర్ గతంలో సికింద్రాబాద్, తెనాలి లోక్‌సభ నియోజకవర్గాల నుంచి గెలుపొందారు. గుజరాత్ నుంచి రాజ్యసభ సభ్యుడయ్యారు. సిక్కిం, కేరళ గవర్నరుగా కూడా పనిచేసారు. తదుపరి కాలంలో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఈయన మరో కుమారుడు డాక్టర్ వినయ్‌కూడా ప్రజారాజ్యంలో చేరి నిజామాబాద్‌లో పోటీచేసి ఓడిపోయారు. 2014లో ముషీరాబాద్‌లో పోటీచేసి ఓటమి చెందారు. మలక్‌పేటలో ఇప్పటివరకు కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ కలిసి ఆరుసార్లు, బిజెపి మూడుసార్లు,మజ్లిస్ మూడుసార్లు పిడిఎఫ్, జనతా, టిడిపిలు ఒక్కోసారి గెలిచాయి. ఇక్కడ ఎనిమిదిసార్లు రెడ్లు, ఆరుసార్లు ముస్లింలు, ఒకసారి బిసి(మున్నూరు కాపు) నేతలు గెలుపొందారు. మలక్‌పేట నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
ముషీరాబాద్ నియోజకవర్గంలో పోటీ చేసిన అభ్యర్థులు వీళ్లే..
ముషీరాబాద్ నియోజకవర్గం ముషీరాబాద్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన ముఠా గోపాల్ ఎన్నికయ్యారు. ఆయన తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది అనిల్‌కుమార్‌పై 36888 ఓట్ల ఆదిక్యతతో విజయం సాదించారు. ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసిన సిటింగ్ ఎమ్మెల్యే, 2019 వరకు బిజెపి తెలంగాణ అద్యక్షుడుగా ఉన్న డాక్టర్ కె.లక్ష్మణ్ సుమారు 30800 ఓట్లు తెచ్చుకుని మూడో స్థానానికి పరిమితం అయ్యారు. తొలిసారి ఎన్నికైన ముఠా గోపాల్ గంగపుత్రుల సమాజికవర్గానికి చెందినవారు. గోపాల్‌కు 72919 ఓట్లు రాగా, కాంగ్రెస్ ఐ మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ కుమారుడైన అనిల్‌కుమార్‌కు 36031 ఓట్లు వచ్చాయి. డాక్టర్ కె.లక్ష్మణ్ ముషీరాబాద్ నుంచి రెండోసార్లు గెలిచారు. 1999లో టిడిపితో కూటమి ఉన్నప్పుడు గెలవగా మళ్లీ 2014లో అదే కూటమి పక్షాన విజయం సాధించారు. 2014లో టిఆర్ఎస్ సమీప ప్రత్యర్ధి ముఠా గోపాల్‌పై 27386 ఓట్ల ఆధిక్యతతో లక్ష్మణ్ గెలిచారు. 2018లో గోపాల్ పైనే ఓడిపోయారు. గతంలో ముషీరాబాద్‌లో మాజీ ముఖ్యమంత్రి టి. అంజయ్య మూడుసార్లు గెలుపొందగా, మూడు దశాబ్ధాల తరువాత ఆయన భార్య మణెమ్మ రెండుసార్లు గెలుపొందడం విశేషం. అంజయ్య మరణించిన తరువాత లోక్‌సభ ఎన్నికలలో ఆమె పోటీచేసి గెలుపొందారు. ఆ తరువాత కొన్నేళ్లుగా క్రియాశీల రాజకీయాలలో పెద్దగా లేరనే చెప్పాలి. అయితే 2008లో టిఆర్ఎస్ తెలంగాణ వ్యూహంలో భాగంగా 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసినప్పుడు, ముషీరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న నాయని నరసింహారెడ్డి కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసారు. దరిమిలా జరిగిన ఉప ఎన్నికలో పోటీచేయించడం కోసం ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అభ్యర్దుల అన్వేషణ చేసి చివరికి మణెమ్మను ఎంపిక చేసారు. ఆ ఉపఎన్నికలో గెలుపొందిన మణెమ్మ 2009 సాధారణ ఎన్నికలోనూ గెలిచారు. ఈ విధంగా భార్యాభర్తలిద్దరూ ఎమ్మెల్యేలుగాను, ఎమ్.పిలు గాను పనిచేసిన అరుదైన రికార్డును అంజయ్య, మణెమ్మలు సొంతం చేసుకున్నారు. అంజయ్య వివిధ మంత్రివర్గాలలోను, 1981లో ముఖ్య మంత్రిగాను పనిచేసారు. ముఖ్యమంత్రి అయ్యాక మెదక్ జిల్లా రామాయంపేట నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అంతకుముందు ఒకసారి 1957లో ఆర్మూరులో గెలిచారు. మొత్తం ఐదుసార్లు గెలిచారు. రాజ్యసభ సభ్యుడిగా కూడా ఈయన ఒకసారి ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రి పదవి కూడా నిర్వహించారు. టిఆర్ఎస్ నేతగా ఉన్న నాయని నరసింహారెడ్డి 1978లో జనతా పార్టీ పక్షాన పోటీచేసి అంజయ్యను ఓడిరచి సంచలనం సృష్టించారు. నాయిని 1978, 1985లలో జనతా పార్టీ తరుఫున గెలిచారు. తిరిగి 2004లో టిఆర్ఎస్లో చేరి విజయం సాధించారు. నాయని 2004లో ఎన్నికైన తరువాత కొంతకాలం రాజశేఖరరెడ్డి క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. 2014 ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రం లో కెసిఆర్ క్యాబినెట్లో హోం మంత్రి అయ్యారు. తదుపరి ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 1983లో ఇక్కడ గెలిచిన నేత శ్రీపతి రాజేశ్వర్ 1985, 1999లలో సనత్‌నగర్ నుంచి గెలుపొందారు. ఎన్.టి.ఆర్. క్యాబినెట్లలో మంత్రిగా కూడా పనిచేసారు. కాంగ్రెస్ నాయకుడు ఎమ్.కోదండరెడ్డి రెండుసార్లు విజయం సాధించారు. 1957లో గెలుపొందిన సీతయ్య గుప్త, 1962లో బేగంబజార్ నుంచి గెలిచారు. 1952లో ఇక్కడ విజయం సాధించిన జి.ఎస్. మేల్కొటే మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ముషీరాబాద్‌లో కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ కలిసి తొమ్మిదిసార్లు, జనతాపార్టీ రెండుసార్లు,టిఆర్ఎస్ రెండుసార్లు, బిజెపి రెండుసార్లు, టిడిపి ఒక్కోసారి గెలుపొందాయి. ఈ నియోజకవర్గంలో పదిసార్లు రెడ్డి నేతలు గెలిస్తే నాలుగుసార్లు బిసి నేతలు(మున్నూరుకాపు) గెలిచారు. ఒకసారి బ్రాహ్మణ, మరోసారి వైశ్య నేత గెలుపొందారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..