కార్వాన్ నియోజకవర్గం
కార్వాన్ నియోజకవర్గంలో మజ్లిస్ పార్టీ అభ్యర్ధి, సిటింగ్ ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్ మరోసారి విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్ది, బిజెపి నేత అమర్‌సింగ్‌పై 49692 ఓట్ల ఆదిక్యతతో గెలిచారు. ఇక్కడ టిఆర్‌ఎస్ పక్షాన పోటీచేసిన టి.జీవన్ సింగ్‌కు సుమారు 24600 ఓట్లు వచ్చాయి. టిఆర్‌ఎస్, మజ్లిస్‌లు స్నేహపక్షాలే అయినా, హైదరాబాద్‌లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా టిఆర్‌ఎస్ తన సొంత అభ్యర్దులను పెట్టడం ద్వారా మజ్లిస్‌కు సహకరించిం దనుకోవచ్చు.
మొయినుద్దీన్‌కు 85401ఓట్లు రాగా, అమర్‌సింగ్‌కు 35709 ఓట్లు వచ్చాయి. మొయినుద్దీన్ ముస్లిం నేత. కార్వాన్ నియోజకవర్గంలో 2014లో మజ్లిస్ ఈసారి సిటింగ్ ఎమ్మెల్యే అప్సర్ ఖాన్‌కు కాకుండా కొత్త అభ్యర్ధి మొయినుద్దీన్‌కు పార్టీ అవకాశం ఇచ్చింది. ఈయన భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత బద్దం బాల్‌రెడ్డిని ఓడిరచారు. 1999లో ఎన్నికైన సయ్యద్ సజ్జాద్ మరణించడంతో 2003లో జరిగిన ఉప ఎన్నికలో తొలిసారిగా అప్సర్‌ఖాన్ ఎన్నికయ్యారు. అయితే అప్పుడు కేవలం మూడు నెలలు మాత్రమే ఈయన పదవిలో ఉన్నారు. అంతలో అసెంబ్లీ రద్దు అయిపోయింది. తిరిగి 2004లో తదుపరి 2009లో గెలిచారు.
2014లో టిక్కెట్ ఇవ్వలేదు. అంతకుముందు బిజెపి నేత బద్దం బాల్‌రెడ్డి మూడుసార్లు గెలిచారు. 1983లో ఇక్కడ గెలిచిన బాకర్ అగా 1978లో యాకుత్‌పురా నుంచి గెలిచారు. సయ్యద్ సజ్జాద్ 1989లో ఆసిఫ్‌నగర్‌లో, 1999లో కార్వాన్‌లో గెలిచారు. కార్వాన్ నియోజకవర్గానికి కాంగ్రెస్, కాంగ్రెస్‌ఐ కలిసి రెండుసార్లు, బిజెపి మూడుసార్లు, ఎమ్.ఐ.ఎమ్ ఆరుసార్లు, ఇండి పెండెంటు ఒకసారి విజయం సాధించారు. ఇక్కడ మూడుసార్లు రెడ్డి నేతలు, ముస్లింలు తొమ్మిది సార్లు , బిసిలు రెండుసార్లు గెలుపొందారు.
కార్వాన్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..
Comments
Please login to add a commentAdd a comment