
జూబ్లిహిల్స్ నియోజకవర్గం
జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో సిటింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాద్ ఈసారి టిఆర్‌ఎస్ పక్షాన పోటీచేసి విజయం సాదించారు. 2014లో ఆయన టిడిపి పక్షాన పోటీచేసి గెలుపొందారు. కాని తరుపరి పరిణామాలలో ఆయన టిఆర్‌ఎస్‌లో చేరి పోయారు. 2018లో టిఆర్‌ఎస్ పార్టీ టిక్కెట్‌పై పోటీచేసి తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్ రెడ్డిపై 8385 ఓట్ల మెజార్టీతో గెలిచారు. గోపీనాద్‌కు 42430 ఓట్లు రాగా, విష్ణువర్దన్ రెడ్డికి 34045 ఓట్లు వచ్చాయి. కాగా ఇక్కడ పోటీచేసిన స్వతంత్ర అబ్యర్ది నవీన్ యాదవ్ సుమారు 17 వేల ఓట్లు తెచ్చుకుని మూడో స్థానంలో ఉన్నారు.
జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో 2014లో మాగంటి గోపినాధ్ తన సమీప ప్రత్యర్ధి, ఎమ్.ఐ.ఎమ్. నేత నవీన్ యాదవ్‌పై 9242 ఓట్ల ఆధిక్యతతో విజయం సాదించారు. అంతకుముందు 2009లో గెలిచిన విష్ణువర్ధనరెడ్డి 2014లో 33642 ఓట్లు తెచ్చుకున మూడో స్థానానికి పరిమితం అయ్యారు. విష్ణు దివంగత నేత, మాజీ మంత్రి పి.జనార్ధనరెడ్డి కుమారుడు. 2004లో ఖైరతాబాద్‌లో గెలుపొందిన జనార్ధనరెడ్డి ఆకస్మికంగా గుండెపోటుతో మరణించగా, 2008లో జరిగిన ఖైరతాబాద్ ఉప ఎన్నికలో విష్ణు విజయం సాధించారు. 2009లో ఏర్పడిన జూబ్లిహిల్స్ నియోజకవర్గం నుంచి రెండోసారి గెలిచి 2014లో ఓటమి చెందారు. జూబ్లిహిల్స్‌లో ఒకసారి రెడ్డి, రెండుసార్లు కమ్మ నేత గెలుపొందారు
జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే...