Jubilee Hills Assembly Constituency
-
అజారుద్దీన్‌కు భారీ ఊరట.. ముందస్తు బెయిల్ మంజారు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత మహ్మద్ అజారుద్దీన్‌కు భారీ ఊరట లభించింది. అజారుద్దీన్‌కు మల్కాజిగిరి కోర్టు ముందస్తు బెయిల్ మంజారు చేసింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యుక్షనిగా ఉన్నప్పుడు భారీ అవినీతికు పాల్పడడారని అజారుద్దీన్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం విధితమే. ఈ వ్యవహారంలో సుప్రీం కోర్టు నియమించిన లావ్ నాగేశ్వర్రావు కమిటీ ఫిర్యాదు మేరకు ఆయనపై ఉప్పల్ పోలీస్ స్టేషన్లో నాలుగు కేసులు నమోదయ్యాయి. దీంతో అజారుద్దీన్ ముందస్తు బెయిల్ కోసం మల్కాజిగిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఫిటిషన్ను సోమవారం విచారించిన న్యాయస్ధానం అజారుద్దీన్ కు ముందస్తు బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే విధంగా పోలీసుల విచారణకు సహకరించాలని అజారుద్దీన్ ను కోర్టు ఆదేశించింది. కాగా అజారుద్దీన్ జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నారు. చదవండి: WC 2023: బంగ్లాదేశ్ అప్పీలు.. మాథ్యూస్ అవుట్! అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి! -
పొలిటికల్ ట్విస్ట్‌లు.. బీఆర్ఎస్లోకి పీజేఆర్ తనయుడు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన నేతలు ఇతర పార్టీలవైపు చూస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ నుంచి జూబ్లీహిల్స్ టికెట్ ఆశించి.. రాకపోవడంతో మాజీ ఎమ్మెల్యే పి. విష్ణువర్థన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరేందుకు రెడీ అయ్యారు. అలాగే, నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రమాదేవి, దరువు ఎల్లన్న సైతం బీఆర్ఎస్లో చేరుతున్నారు. కాగా, పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి అధికార బీఆర్ఎస్లో చేరుతున్నారు. కాసేపట్లో మంత్రి హరీష్‌రావు.. దోమలగూడలోని విష్ణువర్ధన్ రెడ్డి నివాసానికి చేరుకోనున్నారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్లోకి విష్ణువర్ధన్ రెడ్డిని ఆహ్వానించనున్నారు. మరోవైపు.. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌తో విష్ణువర్ధన్‌రెడ్డి ఆదివారం భేటీ అయ్యారు. బీఆర్ఎస్లో చేరికపై వీరిద్దరూ చర్చించినట్టు సమాచారం. దీంతో, ఆయన బీఆర్ఎస్లో చేరడం ఖాయమైంది. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ పార్టీ ఇటీవల ప్రకటించిన జాబితాలో తన పేరు లేకపోవడంతో విష్ణువర్ధన్‌రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్ టికెట్ ఆశించిన ఆయనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించలేదు. అజారుద్దీన్‌కు టికెట్ ఖాయం చేసింది. దీంతో విష్ణువర్ధన్‌రెడ్డి పార్టీ మారుతారనే ఊహాగానాలు వెలువడ్డాయి. తన అనుచరులతో సమావేశమైన విష్ణువర్ధన్ రెడ్డి.. వారి సూచనల మేరకు బీఆర్ఎస్లోకి చేరుతున్నట్టు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: పక్క పార్టీ నేతల కోసం తెలంగాణ బీజేపీ ఎదురుచూపులు -
జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో ఈసారి ఈ అభ్యర్థి గెలిస్తే హ్యాట్రిక్ ఖాయం...
జూబ్లిహిల్స్ నియోజకవర్గం జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో సిటింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాద్ ఈసారి టిఆర్ఎస్ పక్షాన పోటీచేసి విజయం సాదించారు. 2014లో ఆయన టిడిపి పక్షాన పోటీచేసి గెలుపొందారు. కాని తరుపరి పరిణామాలలో ఆయన టిఆర్ఎస్లో చేరి పోయారు. 2018లో టిఆర్ఎస్ పార్టీ టిక్కెట్‌పై పోటీచేసి తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్ రెడ్డిపై 8385 ఓట్ల మెజార్టీతో గెలిచారు. గోపీనాద్కు 42430 ఓట్లు రాగా, విష్ణువర్దన్ రెడ్డికి 34045 ఓట్లు వచ్చాయి. కాగా ఇక్కడ పోటీచేసిన స్వతంత్ర అబ్యర్ది నవీన్ యాదవ్ సుమారు 17 వేల ఓట్లు తెచ్చుకుని మూడో స్థానంలో ఉన్నారు. జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో 2014లో మాగంటి గోపినాధ్ తన సమీప ప్రత్యర్ధి, ఎమ్.ఐ.ఎమ్. నేత నవీన్ యాదవ్‌పై 9242 ఓట్ల ఆధిక్యతతో విజయం సాదించారు. అంతకుముందు 2009లో గెలిచిన విష్ణువర్ధనరెడ్డి 2014లో 33642 ఓట్లు తెచ్చుకున మూడో స్థానానికి పరిమితం అయ్యారు. విష్ణు దివంగత నేత, మాజీ మంత్రి పి.జనార్ధనరెడ్డి కుమారుడు. 2004లో ఖైరతాబాద్‌లో గెలుపొందిన జనార్ధనరెడ్డి ఆకస్మికంగా గుండెపోటుతో మరణించగా, 2008లో జరిగిన ఖైరతాబాద్ ఉప ఎన్నికలో విష్ణు విజయం సాధించారు. 2009లో ఏర్పడిన జూబ్లిహిల్స్ నియోజకవర్గం నుంచి రెండోసారి గెలిచి 2014లో ఓటమి చెందారు. జూబ్లిహిల్స్‌లో ఒకసారి రెడ్డి, రెండుసార్లు కమ్మ నేత గెలుపొందారు జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే...