సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన నేతలు ఇతర పార్టీలవైపు చూస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ నుంచి జూబ్లీహిల్స్ టికెట్ ఆశించి.. రాకపోవడంతో మాజీ ఎమ్మెల్యే పి. విష్ణువర్థన్ రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరేందుకు రెడీ అయ్యారు. అలాగే, నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రమాదేవి, దరువు ఎల్లన్న సైతం బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు.
కాగా, పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి అధికార బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. కాసేపట్లో మంత్రి హరీష్‌రావు.. దోమలగూడలోని విష్ణువర్ధన్ రెడ్డి నివాసానికి చేరుకోనున్నారు. ఈ సందర్బంగా బీఆర్‌ఎస్‌లోకి విష్ణువర్ధన్ రెడ్డిని ఆహ్వానించనున్నారు. మరోవైపు.. బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌తో విష్ణువర్ధన్‌రెడ్డి ఆదివారం భేటీ అయ్యారు. బీఆర్‌ఎస్‌లో చేరికపై వీరిద్దరూ చర్చించినట్టు సమాచారం. దీంతో, ఆయన బీఆర్‌ఎస్‌లో చేరడం ఖాయమైంది.
ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ పార్టీ ఇటీవల ప్రకటించిన జాబితాలో తన పేరు లేకపోవడంతో విష్ణువర్ధన్‌రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్ టికెట్ ఆశించిన ఆయనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించలేదు. అజారుద్దీన్‌కు టికెట్ ఖాయం చేసింది. దీంతో విష్ణువర్ధన్‌రెడ్డి పార్టీ మారుతారనే ఊహాగానాలు వెలువడ్డాయి. తన అనుచరులతో సమావేశమైన విష్ణువర్ధన్ రెడ్డి.. వారి సూచనల మేరకు బీఆర్‌ఎస్‌లోకి చేరుతున్నట్టు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: పక్క పార్టీ నేతల కోసం తెలంగాణ బీజేపీ ఎదురుచూపులు
Comments
Please login to add a commentAdd a comment