vishnuvardan reddy
-
పొలిటికల్ ట్విస్ట్‌లు.. బీఆర్ఎస్లోకి పీజేఆర్ తనయుడు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన నేతలు ఇతర పార్టీలవైపు చూస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ నుంచి జూబ్లీహిల్స్ టికెట్ ఆశించి.. రాకపోవడంతో మాజీ ఎమ్మెల్యే పి. విష్ణువర్థన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరేందుకు రెడీ అయ్యారు. అలాగే, నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రమాదేవి, దరువు ఎల్లన్న సైతం బీఆర్ఎస్లో చేరుతున్నారు. కాగా, పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి అధికార బీఆర్ఎస్లో చేరుతున్నారు. కాసేపట్లో మంత్రి హరీష్‌రావు.. దోమలగూడలోని విష్ణువర్ధన్ రెడ్డి నివాసానికి చేరుకోనున్నారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్లోకి విష్ణువర్ధన్ రెడ్డిని ఆహ్వానించనున్నారు. మరోవైపు.. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌తో విష్ణువర్ధన్‌రెడ్డి ఆదివారం భేటీ అయ్యారు. బీఆర్ఎస్లో చేరికపై వీరిద్దరూ చర్చించినట్టు సమాచారం. దీంతో, ఆయన బీఆర్ఎస్లో చేరడం ఖాయమైంది. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ పార్టీ ఇటీవల ప్రకటించిన జాబితాలో తన పేరు లేకపోవడంతో విష్ణువర్ధన్‌రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్ టికెట్ ఆశించిన ఆయనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించలేదు. అజారుద్దీన్‌కు టికెట్ ఖాయం చేసింది. దీంతో విష్ణువర్ధన్‌రెడ్డి పార్టీ మారుతారనే ఊహాగానాలు వెలువడ్డాయి. తన అనుచరులతో సమావేశమైన విష్ణువర్ధన్ రెడ్డి.. వారి సూచనల మేరకు బీఆర్ఎస్లోకి చేరుతున్నట్టు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: పక్క పార్టీ నేతల కోసం తెలంగాణ బీజేపీ ఎదురుచూపులు -
అజారుద్దీన్‌కు టికెట్.. విష్ణువర్థన్ రెడ్డి రియాక్షన్ ఇదే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. టికెట్ ఆశించి భంగపడిన నేతలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అధికార పార్టీ సహా ప్రతిపక్ష పార్టీ నేతలు ఇతర పార్టీలవైపు చూస్తున్నారు. సమయం చూసి వేరే పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్‌లో టికెట్ ఆశించినా అది దక్కకపోవడంతో పీజేఆర్ తనయుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వివరాల ప్రకారం.. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా జూబ్లీహిల్స్ టికెట్ దక్కకపోవడంతో విష్ణువర్ధన్ రెడ్డి సీరియస్ అవుతున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ జూబ్లీహిల్స్ టికెట్‌ను మాజీ క్రికెటర్, సీనియర్ నేత అజారుద్దీన్‌కు కేటాయించింది. ఈ క్రమంలో విష్ణువర్ధన్ రెడ్డి శనివారం పార్టీ అనుచరులతో సమావేశం కానున్నారు. హైకమాండ్ తీరుపై విష్ణువర్ధన్ రెడ్డి కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విష్ణువర్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నాకు ఎందుకు టిక్కెట్ ఇవ్వలేదో అర్థం కావడం లేదు. ఒకే కుటుంబంలో రెండు టిక్కెట్లు చాలా మందికి ఇచ్చారు. మాకెందుకు ఆ నిబంధన అడ్డు వచ్చింది? నేను జూబ్లీహిల్స్‌లో గెలుస్తానని అన్ని రిపోర్టులు చెప్తున్నాయి. కావాలనే నాకు టిక్కెట్ ఇవ్వలేదు. టికెట్ ఇస్తామని ఢిల్లీ పెద్దలు చాలాకాలంగా చెబుతూనే ఉన్నారు. కానీ, అనూహ్యంగా జాబితాలో నా పేరు లేకపోవడంతో నేనే షాక్ అయ్యాను. పార్టీకి ఎవరు ముఖ్యమో అది ముందు గమనించాలి. కార్యకర్తల సమావేశం తర్వాత నా భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తాను. నన్ను పార్టీ నుంచి పొమ్మనలేక పొగ పెడుతున్నారు. నేనే వేరే పార్టీలో చేరితే మంచి స్థానం ఇస్తామని ఇప్పటికే పలు ఆఫర్లు వచ్చాయి’’ అని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అనుచరులతో భేటీ తర్వాతే పార్టీ మార్పు లేదా తదితర అంశాలపై నిర్ణయం తీసుకుంటానన్నారు. ఇది కూడా చదవండి: రేవంత్‌కు కొత్త టెన్షన్.. 19 స్థానాల్లో ఎవరు? -
చంద్రబాబుపై బీజేపీ విష్ణువర్ధన్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ అధినేత చంద్రబాబుపై బీజేపీ ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మాయలో పడేందుకు బీజేపీ సిద్దంగా లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా, విష్ణువర్ధన్ రెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘చంద్రబాబుకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం గుర్తుకు వస్తుంది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ప్రధాని మోదీని అవమానించలేదా?. చంద్రబాబు హయంలో అమిత్‌షాపై రాళ్ల దాడి చేయించలేదా?. అధికారం కోల్పోయాక ప్రధాని నరేంద్ర మోదీ చుట్టూ.. చంద్రబాబు తిరుగుతున్నారు. చంద్రబాబు మేకవన్నే పులి. బీజేపీతో పొత్తు ఉంటుందని ప్రజలను మభ్యపెడుతున్నారు’ అంటూ మండిపడ్డారు. -
ఏమండోయ్ నాని గారు.. క్షమాపణలు చెప్పించండి
సాక్షి, అమరావతి : విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నానిపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గత ఐదేళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఏమీ చేయలేదని చంద్రబాబు నాయుడు ఆరోపించగా.. తాజాగా కేశినేని గత ఐదేళ్ల కాలాన్ని స్వర్ణయుగమంటూ వ్యాఖ్యానించడంపై ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు. ఏపీకి కేంద్రం చేసిన సాయాన్ని గుర్తుచేసి.. చంద్రబాబు చేత క్షమాపణలు చెప్పించండని అన్నారు. (ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం) ‘ఏమండోయ్ నాని గారు (కేశినేని నాని).. చంద్రబాబు నాయుడు గతంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, బీజేపీ గత ఐదేళ్లలో రాష్ట్రానికి ఏమీ చేయలేదని, అందుకే నేను నారక్తం మరిగి పోయి, నాడు బీజేపీని, కేంద్రాన్ని విభేదించి బయటకు వచ్చానని చెప్పారు. రోజుకు పదికోట్ల ప్రజల సోమ్ముతో ధర్మపోరాటం, ఆరాటమని ఢిల్లీలో దీక్షలు చేశారు. నేడు మీరేమేూ గత ఐదేళ్లు స్వర్ణ యుగం, కేంద్ర మంత్రులందరు ఏపీకి అండగా నిలిచారని చెప్పారు (కేంద్రం ఇచ్చింది నిజమేలే). తన స్వార్థ రాజకీయూల కోసమే బీజేపీపై తప్పుడు ప్రచారం చేశానని చంద్రబాబు గారితో ప్రజల ముందు క్షమాపణ చెప్పించండి. అయినాగాని చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుంది టీడీపీ వైఖరి’ అంటూ విష్ణువర్ధన్ రెడ్డి ట్వీట్ చేశారు. కాగా శుక్రవారం విజయవాడలోని కనకదుర్గ ఫ్లె ఓవర్ ప్రారంభం సందర్భంగా బీజేపీ ప్రభుత్వంపై కేశినేని ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ అండతోనే వంతెన నిర్మాణం పూర్తి అయ్యిందని పేర్కొన్నారు. అయితే ఫ్లైఓవర్ నిర్మాణానికి గానీ, ఆంధ్రప్రదేశ్ అభివృద్దికిగానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయలేదని చంద్రబాబు ఆరోపించిన విషయం తెలిసిందే. ఒక్కపార్టీలోనే ఇద్దరు నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో కార్యకర్తలు సైతం విస్మయానికి గురవుతున్నారు. -
‘చంద్రబాబూ.. మా పార్టీలో చిచ్చు పెట్టొద్దు’
సాక్షి, విశాఖపట్టణం : ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కొత్త డ్రామా మొదలుపెట్టిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. మంగళవారం స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. ‘చంద్రబాబు కొందరు నేతలను మా దగ్గరికి పంపి మీడియాకు లీకులిస్తున్నారు. ఇలా చేసి ప్రజలను కన్ఫ్యూజ్ చేయొద్దు. చంద్రబాబు తల కిందులుగా తపస్సు చేసినా మళ్లీ టీడీపీతో కలిసే ప్రసక్తే లేదు. మా దృష్టిలో టీడీపీ, చంద్రబాబు అంటరాని వాళ్లు. ఆయన చేసిన ద్రోహం బీజేపీ ఎప్పటికీ మర్చిపోదు. చంద్రబాబుకు మేం 240 కిలోమీటర్లు దూరంగా ఉంటాం. ప్రస్తుతం టీడీపీ లిమిటెడ్ కంపెనీగా మారి నాయకత్వ లేమితో కొట్టుమిట్టాడుతోంది. గతంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన నేతలే ఆ పార్టీని ఏలారు. ఏపీ రాజకీయాల్లో టీడీపీది ముగిసిన అధ్యాయం. చంద్రబాబు, లోకేశ్‌లు తప్ప ఏ బలమైన నాయకుడు వచ్చినా పార్టీలోకి ఆహ్వానిస్తాం. గంటా శ్రీనివాసరావు బీజేపీ అగ్రనాయకత్వంలో చర్చలు జరపుతున్నారేమో నాకు తెలియదు. చంద్రబాబు ఎన్ని దీక్షలైనా చేసుకోవచ్చు. ఆయన దీక్షకు మేం సంఘీభావం మాత్రమే తెలియజేశాం తప్ప కార్యక్రమంలో పాల్గొనడం లేద’ని వివరించారు. -
‘టీడీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు’
సాక్షి, అమరావతి : టీడీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారంటూ.. ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు టీడీపీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎవరిని చేర్చుకోవాలన్న దానిపై కసరత్తు జరుగుతోంది. త్వరలో టీడీపీ భూస్థాపితం ఖాయం. ఎన్నికల్లో ఓటమితో టీడీపీ ఎదురుదెబ్బ తగిలింది. రాబోయే కాలంలో ఊహించని విధంగా ఇంకా పెద్ద దెబ్బ టీడీపీకి తగులుతుంది. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే. చంద్రబాబునాయుడు, లోకేష్ అవినీతిపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలి' అని విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. -
‘సొమ్ము ఆంధ్రాది.. ప్రచారం పక్క రాష్ట్రాల్లో’
హైదరాబాద్: టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మరోసారి తీవ్రంగా మండిపడ్డారు. హైదరాబాద్‌లో బుధవారం విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రా ప్రజల సొమ్ముతో బాబు ప్రత్యేక విమానాలలో ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాటలతో చంద్రబాబు నాయుడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడని తేట తెల్లమవుతోందన్నారు. టీడీపీ జాతీయ పార్టీ కాదని, జాతి పార్టీ అని ఎద్దేవా చేశారు. ఈవీఎంలపై ఈ ఐదు సంవత్సరాలు టీడీపీ ఎంపీలు కానీ చంద్రబాబు కానీ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఈవీఎంలను హ్యాకింగ్ చేసిందని 2009లో బీజేపీతో కలిశాడు..బీజేపీ ఈవీఎంలను హ్యాకింగ్ చేసిందని ఆరోపించి 2019లో కాంగ్రెస్‌తో కలిసి పోటీచేస్తున్నాడని విమర్శించారు. ఐఏఎస్‌లు సమావేశం పెట్టుకుంటే సీఎం వారిని బెదిరిస్తారా అని సూటిగా అడిగారు. ఈవీఎంల విషయంలో ఎలక్షన్ ఆఫీసర్ల దగ్గర సంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు ఇప్పుడు ఓటమి భయంతో ఈవీఎంలపై మీద ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈవీఎంలను దొంగిలించిన కేసులో నిందితుడిని ప్రత్యేక విమానంలో వెంట పెట్టుకుని తిరిగింది చంద్రబాబేనని అన్నారు. వీవీపాట్ల వీడియోను బహిరంగ ప్రదర్శన చేసిన చంద్రబాబు మీద ఎన్నికల కమిషన్ సుమోటోగా చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేఏ పాల్ చేసిన ఆరోపణలే చంద్రబాబు కూడా చేస్తున్నారని..పాల్ ఏమైనా టీడీపీకి సలహాదారుగా పని చేస్తున్నారా అనే అనుమానం వ్యక్తం చేశారు. రాయలసీమ టీడీపీ నాయకులు అక్కడి వనరులను దోచుకుని సిగ్గూ ఎగ్గూ లేకుండా అక్కడి ప్రజలను అవమానిస్తున్నారని చెప్పారు. టీటీడీ బంగారం విషయంలో ఈవో, జేఈఓలను ప్రభుత్వం ఎందుకు సస్పెండ్ చెయ్యలేదని సూటిగా ప్రశ్నించారు. రూ.400 కోట్ల విలువ చేసే బంగారాన్ని అంత నిర్లక్ష్యంగా తరలిస్తే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. తప్పు చేసిన వారు వివరణ ఇస్తే సరిపోతుందా అని సూటిగా అడిగారు. దీనిపై ఉన్నతస్థాయి న్యాయ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. -
చంద్రబాబు చెల్లని రూపాయి
సాక్షి, అమరావతి : ఓటమి భయంతోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈవీఎంలు పనిచేయడంలేదని అసత్యపు ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు చెల్లని రూపాయి అని ఎద్దేవా చేశారు. ఓటమి భయంతో తన దుకాణాన్ని అమరావతి నుంచి ఢిల్లీకి మార్చి ఈవీఎంల పేరుతో డ్రామాలు మొదలు పెట్టారని విమర్శించారు. ఆంధ్రలో చెల్లని రూపాయి దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఎలా చెల్లుతుందుని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ఓటు వేసి వచ్చాక గంట, రెండు గంటల్లోనే 30 శాతం ఈవీఎంలు పని చెయలేదని అసత్యపు ప్రచారం చేశారని మండిపడ్డారు. టీడీపీ కి ఓటేస్తే బీజేపీ కి పడుతుంది అంటున్న చంద్రబాబు.. ఒకవేళ తమ పార్టీకి ఓట్లు రాకపోతే ఈవీఎంలను మేనేజ్ చేసినట్లు చంద్రబాబు ఒప్పకుంటారా అని సవాల్ చేశారు. రూ.5 కోట్లు ఇస్తే ఈవీఎంలు మేనేజ్ చేస్తామని కొందరు తన వద్దకు వచ్చారని చంద్రబాబు చెబుతున్నారు.. అంటే ఆయన కార్యాలయం ఏమైనా దొంగలకు అడ్డనో చంద్రబాబు చెప్పాలన్నారు. ఈదేశంలో ఈవీఎంల దొంగల ఎవరైనా ఉన్నారంటే అది టీడీపీ నేతలు మాత్రమే అన్నారు. ఆంద్రప్రదేశ్ దొంగలంతా చంద్రబాబు పక్కనే ఉన్నారన్నారు. ఈవీఎంలు,ఐటీ గ్రిడ్ చోర్ లకు కేరాఫ్ అడ్రస్ టీడీపీ అని..ఈ విషయంలో చంద్రబాబు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహంతి కుటుంబానికి మంచి పేరు ఉంది అలాంటి అతన్ని కడప నుండి ఎందుకు బదిలీ చేశారని ప్రశ్నించారు. వ్యవస్థలో పని చేసే ఏ ఒక్క అధికారిని చంద్రబాబు గౌరవించరని ఆరోపించారు.ఎన్నికల్లో టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారన్నారు. మోదీని తిడితే ఓట్లు పడవన్నారు. చంద్రబాబు మానసిక స్థితిపై అనుమానాలు కలుగుతున్నాయన్నారు. 2014 ఎన్నికల్లో డీజీపీ తప్పించాలని లేఖ రాసి మార్పించుకున్న చంద్రబాబు.. ఇప్పుడు డీజీపీని మారిస్తే ఎందుకు విమర్శలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఏపీలో దుష్ట పాలన పోవాలని.. స్పీడ్ బ్రేకర్ ప్రభుత్వం పోవాలని తాము ఓట్లు అడిగామన్నారు. ప్రజల తీర్పు ఎలా ఉన్నా సమీక్షించుకుంటామని చెప్పారు. -
చంద్రబాబును నమ్మి ఏపీ ప్రజలు మోసపోయారు
-
‘ప్రత్యేక హైకోర్టు కోసం చాలా నిరసనలు చేశాము’
సాక్షి, హైదరాబాద్ : ఉమ్మడి హైకోర్టు విభజన చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని తెలంగాణ బార్ కౌన్సిల్ మెంబర్, సీనియర్ హైకోర్టు అడ్వకేట్ విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ఉన్న 20 వేల మంది న్యాయవాదులందరికి ఆనందంగా ఉందన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు అయిన తరువాత తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు కోసం చాలా నిరసనలు చేశామన్నారు. హైకోర్టు విభజించడం వల్ల కేసులు పరిష్కారం తొందరగా అవుతాయని తెలిపారు. హైకోర్టు విభజన వల్ల తెలంగాణ న్యాయమూర్తులకు అవకాశం ఉంటుందన్నారు. రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా కేసులు పరిష్కారంకు అనువుగా ఉంటుందని తెలిపారు. ఏపీ న్యాయమూర్తులు, న్యాయవాదులకు సహకరిస్తామన్నారు. కేసుల బదిలీలో విచారణ, పరిష్కారం వంటి సమస్యలు ఉంటాయని, కానీ వారికి తమ మద్దతు ఉంటుందని అన్నారు. ఇప్పటికే ఏపీ న్యాయమూర్తులు, అడ్వకేట్లు ఆప్షన్లు ఇచ్చుకున్నారని తెలిపారు. న్యాయమూర్తుల కమిటీ వెళ్లి పరిశీలించిన తరువాతనే ఈ నిర్ణయం తీసుకున్నారని విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. -
బాబు కోర్టులను మేనేజ్ చేస్తాడని అందరికీ తెలుసు
-
అనారోగ్యంతో టీపీసీసీ సభ్యుడి మృతి
నారాయణఖేడ్ : మాజీ ప్రభుత్వ న్యాయవాది టీపీసీసీ సభ్యులు పి.విష్ణువర్ధన్‌రెడ్డి(50) అనారోగ్యంతో గురువారం మృతిచెందారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం గోదుమగామలో జన్మించిన విష్ణువర్ధన్‌రెడ్డి చిన్నతనం నుంచి నారాయణఖేడ్‌లో మేనమామ దివంగత మాజీ ఎమ్మెల్యే పి.కిష్టారెడ్డి ఆధ్వర్యంలో నారాయణఖేడ్‌లో చదువుకొని న్యాయవాదిగా పట్టాపొంది సేవలందించారు. రెండుమార్లు దాదాపు పదేళ్ళపాటు సంగారెడ్డి జిల్లా కోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా సమర్థవంతంగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం జుక్కల్ నియోజకవర్గం నుంచి టీపీసీసీ సభ్యులు కూడా కొనసాగుతున్నారు. ఆయన గత కొద్ది రోజుల కిందట అనారోగ్యానికి గురి కావడంతో కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. న్యాయవాది విష్ణువర్ధన్‌రెడ్డి మృతి చెందడం పట్ల పలువురు న్యాయవాదులు సంతాపాన్ని ప్రకటించారు. విష్ణువర్ధన్‌రెడ్డికి భార్య, కుమారుడు ఉన్నారు. ఆయన మృతిపై టీపీసీసీ సభ్యులు సంజీవరెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు భోజిరెడ్డిలు సంతాపం తెలిపారు. -
శివాజీ చిల్లర వేషాలు మానుకోవాలి: బీజేపీ
విజయవాడ: కమెడియన్ శివాజీ చిల్లర వేషాలు మానుకోవాలంటూ బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి వ్యంగ్యంగా విమర్శించారు. విజయవాడ బీజేపీ కార్యాలయంలో విష్ణువర్దన్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. సినీ నటుడు శివాజీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ప్రచారం కోసమే శివాజీ బీజేపీ కార్యకర్తలు దాడి చేశారని చెబుతున్నారని వ్యాఖ్యానించారు. కొంతమంది తమ స్వార్థం కోసం దేశాన్ని విడగొట్టాలని మాట్లాడుతున్నారని..అలాగే కొంతమంది ఎంపీలు ఢిల్లీలో నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి ఏపీకి న్యాయం జరుగుతుందని చెప్పారు. టీడీపీ నాయకులకు ఇచ్చిన నిధులపై అనుమానం ఉంటే సమాధానం చెబుతామని తెలిపారు. కొంతమంది మేధావులు హైదరాబాద్‌లో ఉండి బీజేపీపై విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రేపు రాయలసీమ బీజేపీ ముఖ్య నాయకులంతా కర్నూలులో సమావేశమవుతున్నామని తెలిపారు. రాయలసీమ అభివృద్ధికి సంబంధించి రేపు డిక్లరేషన్ ప్రకటిస్తామని వెల్లడించారు. -
కుంభకోణాన్ని బహిర్గతం చేయాలి
అనంతపురం కల్చరల్ : కేంద్ర ప్రభుత్వ పథకాలను తన పథకాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం శోచనీయమని భారతీయ యువ మోర్చా రాష్ట అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. స్థానిక మునిసిపల్ అతిథి గృహంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరులతో సమావేశంలో విష్ణువర్ధన్‌రెడ్డితోపాటు బీజేపీ రాష్ర్ట నాయకులు ఎంఎస్ పార్థసారథి, లలిత్‌కుమార్, మజ్దూర్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సందిరెడ్డి శ్రీనివాసులు, అంబటి రామక్రిష్ణారెడ్డి, పత్తి చంద్రశేఖర్, వెంకటరమణప్ప తదితరులు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నీతినిబద్ధలతో వ్యవహరించాలన్నారు. ముఖ్యంగా గ్యాస్ ఏజెన్సీలు, ఎంపీడీవోలు కుమ్మక్కై కోట్ల కుంభకోణానికి పాల్పడుతున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం దారుణమన్నారు. ఎలాంటి రుసుము లేకుండా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేందుకు కేంద్రం యత్నిస్తుంటే గ్యాస్ ఏజెన్సీలు వేల రూపాయలు పేదల నుంచి వసూలు చేస్తున్నారన్నారు. దీపం పథకం తమదిగా రాష్ట్ర ప్రభుత్వం చాటుకుంటోందని, కనీసం అవినీతి లేకుండా కనెక్షన్లు ఇచ్చేదిశగా కలెక్టర్ చూడాలన్నారు. 14వ ఆర్థిక సంఘం ఏపీకి అధిక శాతం నిధులిస్తున్నా ప్రతిపక్షాల వారు నరేంద్ర మోదీని బలహీనపరిచే దిశగా విమర్శలు చేయడం బాధాకరమన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన అన్ని వాగ్దానాలను నెరవేర్చేదిశగా బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. దశల వారీగా ఏపీకి పూర్తి సహకారమందిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తగిన చొరవ చూపకపోవడంతో అభివృద్ధి పనుల్లో జాప్యం ఏర్పడుతోందన్నారు. పరిశ్రమల స్థాపన కోసం చర్యలు తీసుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణలో తగిన విధంగా స్పందించడంలేదన్నారు. పార్థసారథి మాట్లాడుతూ ఎల్ఈడీ బల్బుల విషయంలో కూడా సామాన్యులు భారాన్ని మోయవలసి వచ్చిందని విచారం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం పథకం కింద కేవలం పది రూపాయలను మాత్రమే వసూలు చేయాలని నిబంధన ఉన్నా రాష్ర్ట ప్రభుత్వాలు ముప్పై నుంచి నలబై రూపాయల వరకు వసూలు చేయడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గడ్డి కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. కేంద్రం అందుకు తగ్గ ట్రాన్స్‌పోర్టును ఉచితంగా అందించడానికి ముందుకోచ్చిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో శ్రీనివాసులు, రమణ పాల్గొన్నారు. -
ఓట్లు, సీట్ల కోసమే కాంగ్రెస్ పాకులాట
రాజాపేట, న్యూస్‌లైన్: ఆరు దశాబ్దాలుగా తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చి వేలమంది విద్యార్థులు అమరులైనా పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఓట్లు, సీట్ల కోసం పాకులాడుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం కిషన్‌రెడ్డి విమర్శించారు. రాజాపేట మం డల కేంద్రంలో శనివారం బీజేవైఎం అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆలేరు యవచైతన్యం బహిరంగసభలో ఆయన ప్రసగించారు. దేశంలో తొమ్మిదిన్నరేళ్ల పాలనలో కాంగ్రెస్ అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయి *10లక్షల వేల కోట్ల దోపిడీ చేసిందని విమర్శించారు. అసమర్థ పాలనతో దేశంలో ఎందరో నేతకార్మికులు అకలి చావులు చేసుకున్నారని, మరెందరో అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదుల చర్యలతో ప్రజలు విసిగివేసారిపోయారని అన్నారు. కేవ లం తమ పార్టీ అగ్ర నేత నరేంద్ర మోడీతోనే అవినీతి రహిత పాలన సాధ్యమని అన్నారు. నేటి యువత దేశ మార్పును కోరుకుంటోందని, మోడీనే ప్రధానిని చేయాలని అత్యధికులు కంకణం కట్టుకున్నారని అన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లు ఇంద్రసేనారెడ్డి మా ట్లాడుతూ పాలకుల నిర్లక్ష్యం వల్లే ఆలేరు ప్రాంతం తాగు, సాగునీటికి నోచుకోలేదని అన్నారు. పరిశ్రమలకు విద్యుత్ కోత విధించడం వల్లే మూతపడి కార్మికులు వలసబాట పట్టారని అన్నారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్దన్‌రెడ్డి మాట్లాడుతూ అనంతపురం, శ్రీకాకులం జిల్లాల కన్నా ఆలేరు నియోజకవర్గం అన్నరంగాల్లో వెనుకబాటుకు గురైందని అన్నారు. తెలంగాణకు బీజేపీ కట్టుబడి ఉందని, కాంగ్రెస్ కాలయాపన చేసిన మోడీ ప్రభుత్వంలో తెలంగాణ ఇస్తామని హామీ పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతా సాంబమూర్తి, కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, జిల్లా ఇన్చార్జ్ ప్రేంరాజ్, నాయకులు దాసరి మల్లేశం, తొడిమె రవీందర్, కావేటి సిద్ధిలింగం, దూది పాల విజయ్‌పాల్‌రెడ్డి, నిర్మలాదేవి, శో భారాణి, ఊట్కూరి అశోక్‌గౌడ్, బిల్లకుదురు బాలయ్య, దాచపల్లి రాజు, బెడిదె నర్సింహులు, కానుగంటి శ్రీనివాస్‌రెడ్డి, కాయితి బాల్‌రెడ్డి, అశోక్ తేజ, మేడిశెట్టి నరేందర్, లక్ష్మణ్, వెంకన్న, వినోద్, శ్యా మ్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.