రాజాపేట, న్యూస్‌లైన్: ఆరు దశాబ్దాలుగా తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చి వేలమంది విద్యార్థులు అమరులైనా పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఓట్లు, సీట్ల కోసం పాకులాడుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం కిషన్‌రెడ్డి విమర్శించారు. రాజాపేట మం డల కేంద్రంలో శనివారం బీజేవైఎం అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆలేరు యవచైతన్యం బహిరంగసభలో ఆయన ప్రసగించారు. దేశంలో తొమ్మిదిన్నరేళ్ల పాలనలో కాంగ్రెస్ అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయి *10లక్షల వేల కోట్ల దోపిడీ చేసిందని విమర్శించారు.
అసమర్థ పాలనతో దేశంలో ఎందరో నేతకార్మికులు అకలి చావులు చేసుకున్నారని, మరెందరో అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదుల చర్యలతో ప్రజలు విసిగివేసారిపోయారని అన్నారు. కేవ లం తమ పార్టీ అగ్ర నేత నరేంద్ర మోడీతోనే అవినీతి రహిత పాలన సాధ్యమని అన్నారు. నేటి యువత దేశ మార్పును కోరుకుంటోందని, మోడీనే ప్రధానిని చేయాలని అత్యధికులు కంకణం కట్టుకున్నారని అన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లు ఇంద్రసేనారెడ్డి మా ట్లాడుతూ పాలకుల నిర్లక్ష్యం వల్లే ఆలేరు ప్రాంతం తాగు, సాగునీటికి నోచుకోలేదని అన్నారు. పరిశ్రమలకు విద్యుత్ కోత విధించడం వల్లే మూతపడి కార్మికులు వలసబాట పట్టారని అన్నారు.
బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్దన్‌రెడ్డి మాట్లాడుతూ అనంతపురం, శ్రీకాకులం జిల్లాల కన్నా ఆలేరు నియోజకవర్గం అన్నరంగాల్లో వెనుకబాటుకు గురైందని అన్నారు. తెలంగాణకు బీజేపీ కట్టుబడి ఉందని, కాంగ్రెస్ కాలయాపన చేసిన మోడీ ప్రభుత్వంలో తెలంగాణ ఇస్తామని హామీ పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతా సాంబమూర్తి, కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, జిల్లా ఇన్‌చార్జ్ ప్రేంరాజ్, నాయకులు దాసరి మల్లేశం, తొడిమె రవీందర్, కావేటి సిద్ధిలింగం, దూది పాల విజయ్‌పాల్‌రెడ్డి, నిర్మలాదేవి, శో భారాణి, ఊట్కూరి అశోక్‌గౌడ్, బిల్లకుదురు బాలయ్య, దాచపల్లి రాజు, బెడిదె నర్సింహులు, కానుగంటి శ్రీనివాస్‌రెడ్డి, కాయితి బాల్‌రెడ్డి, అశోక్ తేజ, మేడిశెట్టి నరేందర్, లక్ష్మణ్, వెంకన్న, వినోద్, శ్యా మ్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.
ఓట్లు, సీట్ల కోసమే కాంగ్రెస్ పాకులాట
Published Sun, Jan 5 2014 4:11 AM | Last Updated on Sat, Sep 2 2017 2:17 AM
Advertisement