
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ అధినేత చంద్రబాబుపై బీజేపీ ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మాయలో పడేందుకు బీజేపీ సిద్దంగా లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కాగా, విష్ణువర్ధన్ రెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘చంద్రబాబుకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం గుర్తుకు వస్తుంది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ప్రధాని మోదీని అవమానించలేదా?. చంద్రబాబు హయంలో అమిత్‌షాపై రాళ్ల దాడి చేయించలేదా?. అధికారం కోల్పోయాక ప్రధాని నరేంద్ర మోదీ చుట్టూ.. చంద్రబాబు తిరుగుతున్నారు. చంద్రబాబు మేకవన్నే పులి. బీజేపీతో పొత్తు ఉంటుందని ప్రజలను మభ్యపెడుతున్నారు’ అంటూ మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment