విభజన హామీలపై నిలదీయండి | KCR Big Directives To The BRS MPs: telangana | Sakshi
Sakshi News home page

విభజన హామీలపై నిలదీయండి

Jan 27 2024 5:02 AM | Updated on Jan 27 2024 5:02 AM

KCR Big Directives To The BRS MPs: telangana - Sakshi

పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరైన బీఆర్‌ఎస్‌ ఎంపీలు. చిత్రంలో కేటీఆర్, హరీశ్‌ తదితరులు

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే పార్లమెంటు సమావేశాల్లో పార్టీ ఎంపీలు విభజన హామీల అమలుతో పాటు రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని భారత్‌ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు సూచించారు. తెలంగాణ హక్కుల కోసం పోరాడే దళం బీఆర్‌ఎస్‌ ఒక్కటేనని, వారం రోజుల పాటు జరిగే సమావేశాల్లో ఎంపీలు ఆయా అంశాలపై మాట్లాడా లని చెప్పారు.

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)కు తెలంగాణ ప్రాజెక్టుల అప్పగింతపై గళం విప్పాలని ఆదేశించారు. తెలంగాణ నీటి వనరులను గుప్పిట పెట్టుకునేందుకు కేంద్రం చేస్తు న్న ప్రయత్నాలు, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫ ల్యాలను ఎండగట్టాలని ఆదేశించారు. శుక్రవారం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్‌ అధ్యక్ష తన సుమారు మూడు గంటల పాటు బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. పార్టీ నేతలు కె.కేశవరావు, నామా నాగేశ్వర్‌రావు, కేటీ రామారావు, హరీశ్‌రావు తదితరులు పాల్గొన్నారు. 

తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లొద్దు
పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, చర్చించాల్సిన విధానాలపై ఎంపీలకు కేసీఆర్‌ దిశా నిర్దేశం చేశారు. నదీ జలాల కేటాయింపులు, ఉమ్మడి ఆస్తుల పంపకాలతో పాటు పెండింగులో వున్న రాష్ట్ర విభజన హామీల సాధన కోసం ఇప్పటికే ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర బీఆర్‌ఎస్‌ పార్టీదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లే సందర్భాల్లో అడ్డుకుని రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత బీఆర్‌ఎస్‌ ఎంపీల పైనే ఉందని స్పష్టం చేశారు.

పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా తెలంగాణలోని వెను కబడిన జిల్లాలకు ఐదో ఇన్‌స్టాల్‌మెంట్‌ కింద రూ.450 కోట్ల విడుదల, ఎన్‌హెచ్‌ఏఐ సాయంతో ఆదిలాబాద్‌ సీసీఐ పునరుద్దరణ, రాష్ట్రంలో ఐఐఎం, 23 నవోదయ విద్యాలయాల ఏర్పాటు గురించి ప్రస్తావించాలని కేసీఆర్‌ చెప్పారు. అలాగే పెండింగులో ఉన్న రైల్వే పనులు వేగవంతం చేసేందుకు నిధుల విడుదల, నీతి ఆయోగ్‌ సిఫారసు మేరకు మిషన్‌ కాకతీయకు రూ.5 వేల కోట్లు, మిషన్‌ భగీ రథకు రూ.19,205 కోట్ల మంజూరు, బయ్యారంలో స్టీల్‌ ప్లాంటు ఏర్పాటు, జహీరాబాద్‌ నిమ్జ్‌కు నిధులు, ఎస్సీల వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల పెంపు తదితర అంశాలు లేవనెత్తాలని సూచించారు.

త్వరలో అన్ని కార్యక్రమాలకు..!
ఎంపీలు పి.రాములు, బీబీ పాటిల్, పసునూరి దయాకర్, మన్నె శ్రీనివాస్‌ రెడ్డి, కేఆర్‌ సురేష్‌రెడ్డి, వెంకటేష్‌ నేతకాని, బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, మాలోత్‌ కవిత, పార్థసారథి రెడ్డి, జోగినపల్లి సంతోష్‌ కుమార్, దేవకొండ దామోదర్‌ రావు, గడ్డం రంజిత్‌ రెడ్డి కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. తుంటి ఎముక చికిత్స అనంతరం కోలుకుంటూ తొలిసారిగా పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్, మునుపటి తరహాలో చురుగ్గా ఉన్నారని పలువురు ఎంపీలు తెలిపారు. త్వరలో పార్టీ పరంగా జరిగే అన్ని కార్యక్రమాలకు తాను స్వయంగా హాజరవుతానని కేసీఆర్‌ చెప్పినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి ఈ భేటీలో ఎలాంటి ప్రస్తావన రాలేదని సమాచారం. 

లోక్‌సభ ఎన్నికలపై దిశా నిర్దేశం
లోక్‌సభ ఎన్నికల దిశగా పార్టీ పరంగా జరుగు తున్న సన్నద్ధతపైనా కేసీఆర్‌ సుదీర్ఘంగా మాట్లా డారు. నియోజకవర్గాల వారీ సన్నాహక సమావే శాల్లో కేడర్‌ నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్, పార్టీ పరంగా చేపట్టబోయే దిద్దుబాటు చర్యలు, కార్యక్రమాల గురించి తెలియజేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళిని విశ్లేషిస్తూ లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించా ల్సిన వ్యూహాలు, ఎత్తుగడలను వివరించారు. శని వారం నుంచి తిరిగి ప్రారంభమయ్యే లోక్‌సభ ఎన్ని కల సన్నాహక సమావేశాల గురించి ప్రస్తావిస్తూ, పార్లమెంటు సమావేశాల్లో పాల్గొంటూనే ఈ భేటీ లకు ఎంపీలు హాజరుకావాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement