
సాక్షి, హైదరాబాద్: త్వరలోనే బీఆర్‌ఎస్ పార్టీ నాలుగు ముక్కలు కావడం ఖాయమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. అలాగే, మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు కేసీఆర్, కేటీఆర్‌కు వెన్నుపోటు పొడిచేలా ఉన్నాయని అన్నారు.
కాగా, మంత్రి కోమటిరెడ్డి అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్‌చాట్‌లో భాగంగా మాట్లాడుతూ.. హరీష్‌రావు ముఖ్యమంత్రి కావాలనే ప్లాన్‌లో ఉన్నట్టున్నాడు. కేసీఆర్‌ను వ్యతిరేకించే వస్తే మేము అందుకు సపోర్టు చేస్తాం. బీఆర్‌ఎస్ పార్టీ కేటీఆర్, హరీష్‌రావు, కవిత పేర్ల మీదుగా విడిపోతుంది. బీఆర్‌ఎస్‌లో నాలుగు పార్టీలు అవుతాయి.
హరీష్ రావు పార్టీలో ఎల్పీ లీడర్ కూడా కాలేడు. ఆయన 20 మందితో ఆ పార్టీ లీడర్ కావాలి. కేసీఆర్ కట్టే పట్టుకొని తిరుగుతున్నాడు.. ఆయన పులి ఎట్లా అవుతాడు. 60 కిలోలు ఉన్న వ్యక్తి పులి అయితే.. 86 కిలోలు ఉన్న నేనేం కావాలి. ఇంకో 20 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుంది అంటూ వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment