సాక్షి, హైదరాబాద్: తెలంగాణ డిప్యూటీ స్పీకర్ టి. పద్మారావు గౌడ్ కరోనావైరస్ చికిత్సకు సంబంధించి తాను చెప్పినట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో క్లిప్ నకిలీదని చెప్పారు. ఆ ఆడియో క్లిప్‌లో మాట్లాడింది తాను కాదని ధృవీకరించారు. ఇటీవలే ఆయనకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. (తెలంగాణ డిప్యూటీ స్పీకర్‌కు కరోనా)
పద్మారావు గౌడ్ తన సన్నిహితుడు ఒకరితో మాట్లాడుతూ, హాస్పటల్ నుంచి డిశార్జ్ అయ్యానని, ప్రస్తుతం బాగున్నాని తెలిపినట్లు ఆ ఆడియోలో ఉంది. ఇంకా ఆయన మాట్లాడుతూ కరోనా చికిత్స కోసం సొంటి, లవంగాలు, యాలాకులు ఇంకా మరిన్ని పదార్థాలు కలిపి దంచి పొడిచేసుకోని దానిని వేడి నీటితో కలిపి రోజు తీసుకోవాలని సూచించినట్లు ఉంది. తనకి హాస్పటల్‌లో పారాసిటమాల్, దగ్గు మందు ఇచ్చినట్లు చెప్పారు. మిగిలిన వారందరికి కూడా ఈ విషయాన్ని చెప్పమని ఆయన చెప్పినట్లు ఆ ఆడియో క్లిప్‌లో ఉంది. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. దీనిపై పద్మరావు గౌడ్ స్పష్టతనిస్తూ ఆ ఆడియోలో ఉన్న వాయిస్ తనది కాదని తేల్చి చెప్పారు. తాను ప్రజలందరి ఆశీర్వాదాలతో ఆరోగ్యంగా ఉన్నానని, హోం కార్వంటైన్‌లో ఉన్నట్లు ఆయన తెలిపారు. దీనికి సంబంధించి ఆయన ట్వీట్ చేశారు.
చదవండి: కరోనా: ఆస్పత్రుల్లో లైవ్ డ్యాష్ బోర్డులు ఏర్పాటు
There is a audio clip being circulating across Social Media & WhatsApp which is completely fake & baseless. I am doing fine and in home quarantine. Thank you all for your prayers.
— T. Padma Rao (@TPadmaRao) July 8, 2020
Comments
Please login to add a commentAdd a comment