
సాక్షి, హైదరాబాద్ : సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం సమావేశం అయ్యారు. (డిప్యూటీ స్పీకర్‌గా పద్మారావు) డిప్యూటీ స్పీకర్ పదవి ఏకగ్రీమయ్యేలా టీఆర్‌ఎస్ అధిష్టానం ప్రయత్నాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే కాంగ్రెస్, మజ్లిస్, బీజేపీ పార్టీ నేతలతో సంప్రదింపులు జరపగా, ఏకగ్రీవ ఎన్నికకు ఎంఐఎ, బీజేపీ ఆమోదం తెలిపాయి. కాంగ్రెస్ పార్టీ కూడా సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినా తుది నిర్ణయం మాత్రం తెలపలేదు. దీంతో డిప్యూటీ స్పీకర్ ఎన్నికలో తమకు సహకరించాలంటూ కేటీర్ ఇవాళ ఉదయం సీఎల్పీ కార్యాలయంలో భట్టి విక్రమార్కను కలిశారు. ఈ అంశంపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చించిన అనంతరం తమ నిర్ణయం చెబుతామని భట్టి విక్రమార్క తెలిపారు. ఈ భేటీకి కేటీఆర్‌తో పాటు డిప్యూటీ స్పీకర్ అభ్యర్థి పద్మారావు గౌడ్, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment