padmarao goud
-
సికింద్రాబాద్ బరిలో ‘పజ్జన్న’
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్య ర్థిగా మాజీ మంత్రి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే తిగుళ్ల పద్మారావు గౌడ్ పేరును పార్టీ అధినేత కె. చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఈ మేరకు శనివారం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. సుమారు వారంపాటు ఢిల్లీలో ఉన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు కూడా శనివారం జరిగిన ఈ భేటీకి హాజరయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలతో చర్చించి అందరి అభిప్రాయం మేరకే పద్మారావు గౌడ్ అభ్య ర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు బీఆర్ఎస్ ప్రకటించింది. అలాగే నల్లగొండ లోక్‌సభ బీఆర్ఎస్ అభ్య ర్థిగా కంచర్ల కృష్ణారెడ్డి పేరును గతంలోనే ఖరారు చేయగా తాజాగా మరోమారు కీలక నేతలతో కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డికి కంచర్ల కృష్ణారెడ్డి సోదరుడు కావడం గమనార్హం. భువనగిరి స్థానం నుంచి కురుమ సామాజికవర్గానికి చెందిన క్యామ మల్లేశ్ యాదవ్ పేరును ఖరారు చేశారు. భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డితోపాటు జిట్టా బాలకృష్ణారెడ్డి, దూదిమెట్ల బాలరాజు యాదవ్ తదితరుల పేర్లను పరిశీలించినా సామాజికవర్గ సమీకరణల్లో భాగంగా క్యామ మల్లేశ్ అభ్య ర్థిత్వం వైపు కేసీఆర్ మొగ్గు చూపారు. మొత్తంగా 17 ఎంపీ సీట్లకుగాను తాజాగా ప్రకటించిన ముగ్గురు పేర్లతో బీఆర్ఎస్ 16 సీట్లకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది. హైదరాబాద్ లోకసభ స్థానం నుంచి కూడా బలమైన అభ్య ర్థిని బరిలోకి దింపుతామని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఒకట్రెండు రోజుల్లో హైదరాబాద్ నుంచి పోటీ చేసే అభ్యర్థి ఎవరనే అంశంపై స్పష్టత రానుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి జరిగే ఉప ఎన్నిక అభ్యర్థి పేరును కూడా వీలైనంత త్వరగా ప్రకటిస్తామని కేసీఆర్ వెల్లడించినట్లు సమాచారం. కాగా, భువనగిరి నుంచి తనను అభ్య ర్థిగా ఎంపిక చేయడం పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ క్యామ మల్లేశ్ యాదవ్ శనివారం కేసీఆర్‌ను కలిశారు. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం ఈ భేటీలో పాల్గొన్నారు. ఎంపీగా పోటీకి విముఖత చూపినా బుజ్జగించి.. బీఆర్ఎస్ సీనియర్ నేతగా, తెలంగాణ ఉద్యమ కాలం నుంచి నేటి వరకు పారీ్టకి విధేయుడుగా వున్న పద్మారావు గౌడ్ అందరివాడిగా గుర్తింపు తెచ్చుకున్నందునే ఆయన పేరును ఖరారు చేసినట్లు కేసీఆర్ ప్రకటించారు. సికింద్రాబాద్ అభివృద్ధికి చేసిన కృషి, స్థానిక నేతగా ‘పజ్జన్న’గా ఆదరాభిమానాలు పొందిన పద్మారావు గౌడ్ సరైన అభ్య ర్థిగా సమావేశం ఏకగ్రీవంగా అంగీకరించినట్లు బీఆర్ఎస్ వెల్లడించింది. రెండు రోజుల క్రితం పద్మారావు అభ్య ర్థిత్వం తెరపైకి రాగా పోటీకి ఆయన విముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే పద్మారావుతోపాటు ఆయన కుటుంబ సభ్యులను ఎర్రవెల్లి ఫాంహౌస్‌కు పిలిచి మరీ బుజ్జగించినట్లు సమాచారం. జాబితాలో బీసీలకు ప్రాధాన్యత ఇప్పటి వరకు ప్రకటించిన 16 లోక్‌సభ స్థానాల్లో బీఆర్ఎస్ బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ అభ్యర్థులను ఖరారు చేసింది. సామాజికవర్గాలవారీగా రెడ్లకు 4, మున్నూరు కాపు 2, మాదిగలకు 2, కమ్మ, వెలమ, ముదిరాజ్, గౌడ, కురుమ, లంబాడా, గోండులకు ఒక్కో సీటు చొప్పున కేటాయించింది. హైదరాబాద్ నుంచి కూడా బీసీ అభ్య ర్థినే రంగంలోకి దింపే అవకాశం ఉంది. దీంతో జనరల్ స్థానాల్లో సగం చోట్ల బీసీ అభ్యర్థులే పోటీ చేయనున్నట్లు కానుంది. బీఆర్ఎస్కు ప్రస్తుతం లోక్‌సభలో తొమ్మిది మంది ఎంపీలు ఉండగా వారిలో సిట్టింగ్ ఎంపీలు నామా నాగేశ్వర్రావు, మాలోత్ కవిత, మన్నె శ్రీనివాస్‌రెడ్డి మాత్రమే పోటీ చేస్తున్నారు. మరో ఐదుగురు ఎంపీలు కాంగ్రెస్, బీజేపీలలో చేరారు. -
ఊపిరి ఉన్నంత వరకు టీఆర్ఎస్లోనే!
సాక్షి, హైదరాబాద్: బీజేపీ సీనియర్ నేత కిషన్‌రెడ్డితో భేటీ దరిమిలా టీఆర్ఎస్ ఎమ్మెల్యే, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ బీజేపీలో చేరతారంటూ ప్రచారం తెర మీదకు వచ్చింది. అయితే ఆ ఊహాగానాలకు తెర దించుతూ కేటీఆర్‌తో ఫొటో దిగి మరీ సోషల్ మీడియాలో ఫొటోను షేర్ చేశారు. తాజాగా.. తన నియోజకవర్గంలోని సీతాఫల్ మండిలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి.. పార్టీ మారే ప్రచారాన్ని ఖండించారు. ‘‘నా ఊపిరి ఉన్నంతవరకు టిఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతా. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంతోనే ఉంటా. పార్టీలో నేను ఆత్మ సంతృప్తితో ఉన్నా. సికింద్రాబాద్ నుంచే మళ్లీ బరిలో దిగుతా. హైకమాండ్ గనుక ఆదేశిస్తే.. జపాన్ నుంచైనా పోటీ చేస్తా’’ అని పద్మారావు ప్రకటించారు. బీజేపీ నుంచి తనను ఎవరూ సంప్రదించలేదని, ఏ పార్టీ లోకి వెళ్లాల్సిన అవసరం తనకు లేదని, టీఆర్ఎస్లో సంతృప్తిగానే ఉన్నట్లు పద్మారావు స్పష్టం చేశారు. కిషన్‌రెడ్డితో వ్యక్తిగత బంధం.. బీజేపీ సీనియర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో నాకు వ్యక్తిగత సంబంధం ఉంది. అందుకే ఆయన్ని నా కూతురు వివాహానికి ఆహ్వానించా. పెళ్లికి ఆయన రాలేక పోయారు కాబట్టి మా ఇంటికి వచ్చారు అని భేటీపై స్పష్టత ఇచ్చారు. ఇక మునుగోడులో గెలుపు టీఆర్స్దేనన్న పద్మారావు.. గవర్నర్ తమిళిసై పైనా విమర్శలు గుప్పించారు. సికింద్రాబాద్ నియోజకవర్గానికి 102 కోట్ల అభివృద్ధి పనులు మంజూరయ్యాయని, కానీ.. కేంద్రం నుంచి ఎలాంటి నిధులు రాలేదని తెలిపారు. తమిళిసై తెలంగాణకు గవర్నర్ అని, పాక్‌కు కాదని ఎద్దేవా చేశారు. గవర్నర్ వద్ద చాలా ఫైల్స్ పెండింగ్‌లో ఉన్నాయని, అవసరానికి తగ్గట్లు నిర్ణయాలు ఉండాలని పేర్కొన్నారు. నల్లగొండ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పార్టీ మారిక వ్యవహారంపై స్పందిస్తూ.. ఎంపీగా ఉన్నప్పుడు ఆత్మగౌరవం గుర్తు రాలేదా? అప్పుడే రాజీనామా చేసి వెళ్లొచ్చు కదా? అని పద్మారావు నిలదీశారు. మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ టీఆర్ఎస్కు రాజీనామా చేసిన నేపథ్యంలో పద్మారావు కూడా పార్టీని వీడుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరిగింది. దీనికి తోడు మునుగోడు ప్రచారానికి ఆయన దూరంగా ఉండడంతో ఆ ప్రచారానికి మరింత బలం చేకూరుంది. అయితే ఆయన ప్రచారంలో పాల్గొంటారని తాజాగా టీఆర్ఎస్ శ్రేణులు స్పష్టత ఇచ్చాయి. -
భట్టి విక్రమార్కని కలిసిన కేటీఆర్
-
సీఎల్పీ నేత భట్టిని కలిసిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం సమావేశం అయ్యారు. (డిప్యూటీ స్పీకర్‌గా పద్మారావు) డిప్యూటీ స్పీకర్ పదవి ఏకగ్రీమయ్యేలా టీఆర్ఎస్ అధిష్టానం ప్రయత్నాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే కాంగ్రెస్, మజ్లిస్, బీజేపీ పార్టీ నేతలతో సంప్రదింపులు జరపగా, ఏకగ్రీవ ఎన్నికకు ఎంఐఎ, బీజేపీ ఆమోదం తెలిపాయి. కాంగ్రెస్ పార్టీ కూడా సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినా తుది నిర్ణయం మాత్రం తెలపలేదు. దీంతో డిప్యూటీ స్పీకర్ ఎన్నికలో తమకు సహకరించాలంటూ కేటీర్ ఇవాళ ఉదయం సీఎల్పీ కార్యాలయంలో భట్టి విక్రమార్కను కలిశారు. ఈ అంశంపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చించిన అనంతరం తమ నిర్ణయం చెబుతామని భట్టి విక్రమార్క తెలిపారు. ఈ భేటీకి కేటీఆర్‌తో పాటు డిప్యూటీ స్పీకర్ అభ్యర్థి పద్మారావు గౌడ్, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. -
గీత కార్మికులకు చెట్టు పన్ను రద్దు
సాక్షి, సిద్దిపేట: గీత కార్మికులు ప్రభుత్వానికి చెల్లిస్తున్న చెట్టు పన్నును రద్దు చేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి టి.పద్మారావు గౌడ్ ప్రకటించారు. పన్ను చెల్లించలేక గీత కార్మికులు ఇబ్బందులు పడుతున్న విషయా న్ని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. పన్ను రద్దుకు సీఎం అంగీకరించారని, ఈ మేరకు త్వరలోనే జీవో వెలువడుతుందన్నా రు. ఎక్సైజ్ అధికారులు గీత కార్మికుల నుంచి పన్ను వసూళ్లు చేయవద్దన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో రూ.1.5 కోట్లతో నిర్మించనున్న గౌడ ఫంక్షన్ హాల్ భవనానికి మంత్రి టి.హరీశ్‌రావు, ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌తో కలసి పద్మారావు గౌడ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పా టు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. చెట్టు పన్ను రద్దు తో రాష్ట్రవ్యాప్తంగా 2.16 లక్షల మంది గీత కార్మి కులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 4,342 సోసైటీలు, 3,688 టీఎఫ్‌టీల్లో 2,16,785 మంది గీత కార్మికులు సభ్యులుగా ఉన్నారు. గీత కార్మికులు తాటి, ఈత చెట్టు ఒక్కోదానికి ఏడాదికి రూరల్ ప్రాంతం లో అయితే రూ.25, అర్బన్ ప్రాంతంలో రూ.50 పన్ను చెల్లిస్తున్నారు. ఈ పన్ను రూపంలో ప్రభుత్వానికి రూ.15 కోట్లు సమ కూరుతున్నాయి. తమకు ప్రత్యేక నిధులు కేటాయించడంతోపాటు చెట్టు పన్ను రద్దు చేయాలని పలు సందర్భాల్లో గీత కార్మికులు, అనుబంధ సంఘాల నాయకులు ప్రభుత్వా న్ని కోరారు. దీంతో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. -
క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణ అందిస్తాం
క్రీడా శాఖ సమీక్షలో మంత్రి పద్మారావు గౌడ్ హామీ సాక్షి, హైదరాబాద్: బంగారు పతకాల తెలంగాణను తీర్చిదిద్దడమే లక్ష్యంగా క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణను అందిస్తామని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి పద్మారావుగౌడ్ అన్నారు. గురువారం క్రీడా, యువజన శాఖపై సచివాలయంలోని ఆయన చాంబర్లో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సుమారు 3 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. కోచ్‌ల జీతభత్యాల పెంపు, నిర్మాణంలో ఉన్న స్టేడియాల స్థితిగతులు, క్రీడా శాఖలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న పలు అంశాలపై చర్చలు జరిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని అన్నారు. క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణ ఇప్పించాలనే కృత నిశ్చయంతో పనిచేస్తున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను కూడా ప్రోత్సహించి మున్ముందు ఒలింపిక్స్‌లో కూడా పతకాలు సాధించేలా పనిచేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో క్రీడా హాస్టల్స్‌ను ఏర్పాటు చేసి గ్రామీణ క్రీడాకారులకు అత్యున్నతమైన సదుపాయాలు కల్పించేందుకు కృషిచేస్తామని అన్నారు. ప్రస్తుతం క్రీడాకారులకు శిక్షణ ఇచ్చే ఒలింపియన్లను తగిన విధంగా ప్రోత్సహిస్తున్నామని, ప్రతీ జిల్లాలో కనీసం ఐదుగురు కోచ్‌లను నియమిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడా శాఖ కార్యదర్శి వెంకటేశం, ‘శాట్స్’ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, ఎండీ దినకర్ బాబు, ఓఎస్డీ డా. రాజేశ్వర్ రావు, స్పోర్ట్స్ స్కూల్ ఓఎస్డీ నర్సయ్య, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
మంత్రికి ఘన స్వాగతం
సికింద్రాబాద్: రియో ఒలింపిక్స్ సందర్భంగా బ్రెజిల్ పర్యటన ముగించుకుని గురువారం ఉదయం నగరానికి చేరుకున్న రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి పద్మారావుగౌడ్‌కు శంషాబాద్ విమానాశ్రయంలో టీఆర్ఎస్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగరానికి చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సింధు పతకం సాధించడం దేశానికే గర్వకారణమన్నారు. భవిష్యత్తులో తెలంగాణ నుంచి మరికొందరు సమర్థులైన క్రీడాకారులను జాతికి అందించేందుకు కృషి చేస్తామన్నారు. శంషాబాద్ నుంచి మంత్రి నివాసం వరకు కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు సామల హేమ, బైరగోని ధనంజన, రాజీవ్‌గుప్తా, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్, టీఆర్ఎస్ నాయకులు కరాటే రాజు, ఆకుల నాగభూషణం, ధరమ్‌రాజ్ చౌదరి, కిరణ్‌గౌడ్, కంది నారాయణ, లింగాని శ్రీనివాస్, సత్యనారాయణగౌడ్, స్మితాగౌడ్, తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులు చందుగంగపుత్ర, కాలేరు సురేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆబ్కారీ శాఖలో బదిలీలకు రంగం సిద్ధం
ఎస్ఐ నుంచి ఏఈఎస్ వరకు స్థానచలనం ఒక జిల్లాలో పనిచేసిన వారిని మరో జిల్లాకు బదిలీ చేసే అవకాశం మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్న కమిషనర్ వచ్చే నెలలోనే బదిలీలు ఉంటాయన్న మంత్రి పద్మారావు గౌడ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆబ్కారీ శాఖలో మూడేళ్ల తరువాత బదిలీలకు రంగం సిద్ధమైంది. రెండేళ్లకోసారి బదిలీలు జరగాల్సిన ఎక్సైజ్ శాఖలో గత మూడేళ్లుగా ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఎస్ఐ నుంచి అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్(ఏఈఎస్)ల వరకు గత మూడేళ్లకు పైగా ఆయా చోట్లలో పాతుకుపోయారు. బదిలీల గురించి ఉద్యోగ, అధికారుల సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నా, రాష్ట్ర విభజన, ఉద్యోగుల విభజన తదితర కారణాలతో ముందుకు కదలలేదు. అయితే కమలనాథన్ కమిటీ ఎక్సైజ్ శాఖలో రాష్ట్ర స్థాయి పోస్టుల విభజన పూర్తిచేసిన నేపథ్యంలో బదిలీల ఫైలుకు మోక్షం లభించే అవకాశం ఏర్పడింది. ఈ నేపథ్యంలో కమిషనర్ ఆర్.వి. చంద్రవదన్ ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్లు సమాచారం. నవంబర్ నెల మొదటి వారం నుంచి బదిలీల ప్రక్రియను ప్రారంభించాలని ఆయన యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ప్రభుత్వం నుంచి కూడా గ్రీన్‌సిగ్నల్ లభించినట్లు తెలిసింది. 40 శాతం ఉద్యోగుల బదిలీలు ఎక్సైజ్ శాఖలో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐ నుంచి ఏఈఎస్‌ల వరకు సుమారు 800 మంది వరకు విధుల్లో ఉన్నట్లు అంచనా. మూడేళ్లుగా బదిలీలు జరగనందు వల్ల ఈసారి 40 శాతం వరకు ఉద్యోగుల బదిలీ తప్పకపోవచ్చని తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం వచ్చే డిసెంబర్ నెలను కటాఫ్‌గా నిర్ణయించి అప్పటికి ఆయా స్థానాల్లో మూడేళ్లు సర్వీస్ పూర్తయిన వారిని బదిలీల కేటగిరీలోకి తీసుకోనున్నారు. బదిలీల విధానంలో కొన్ని మార్పులు కూడా తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలిసింది. ‘మంచి’ జిల్లాలుగా పేరున్న చోట్ల ప్రస్తుతం పనిచేస్తున్న వారిని వేరే జిల్లాకు బదిలీ చేయాలనేది అందులో ఒకటి. ఉదాహరణకు రాష్ట్రంలో ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా ఆదాయంలో మొదటి స్థానం (ఏ- కేటగిరి)లో ఉంది. ఈ జిల్లాలోని ఏదో ఒక స్టేషన్లో పనిచేస్తున్న సీఐని అదే జిల్లాలోని మరోస్టేషన్‌కు మార్చడం వల్ల హైదరాబాద్, మహబూబ్‌నగర్ వంటి జిల్లాల్లోని అధికారులు ‘మంచి’ జిల్లాకు రాలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక జిల్లాలో పనిచేస్తున్న వారిని మరో జిల్లాకు బదిలీ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. అలాగే బదిలీల్లో రెవెన్యూ అధికంగా సాధించి పెట్టిన స్టేషన్ అధికారిని ఏ కేటగిరీ స్టేషన్‌ను కేటాయించడం, తరువాత స్థానాల్లో ఉన్న వారిని బీ,సీ కేటగిరీలకు పంపడం ఇప్పటి వరకు ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి రెవెన్యూతో పాటు గుడుంబా, అక్రమ మద్యం అమ్మకాలను అరికట్టిన వారికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిసింది. రంగారెడ్డి జిల్లాలో ఏ స్టేషన్ నుంచైనా ఇతర జిల్లాలతో పోలిస్తే రెవెన్యూ అధికంగానే ఉంటుంది. రెవెన్యూకే ప్రాధాన్యం ఇస్తే ఏ కేటగిరీలో ఈ ఒక్క జిల్లాలో పనిచేసిన వారికే ప్రాధాన్యం లభిస్తుంది. ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో పనిచేసిన వారు డీ- కేటగిరీలోకి వెళ్లే ప్రమాదం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని రెవెన్యూతో పాటు నమోదైన నేరాలు, కేసులను కూడా పరిగణనలోకి తీసుకొని బదిలీలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది.