గీత కార్మికులకు చెట్టు పన్ను రద్దు | tree tax is cancelled, says padmarao goud | Sakshi
Sakshi News home page

గీత కార్మికులకు చెట్టు పన్ను రద్దు

Dec 30 2017 2:40 AM | Updated on Dec 30 2017 2:40 AM

tree tax is cancelled, says padmarao goud - Sakshi

సాక్షి, సిద్దిపేట: గీత కార్మికులు ప్రభుత్వానికి చెల్లిస్తున్న చెట్టు పన్నును రద్దు చేస్తున్నట్లు ఎక్సైజ్‌ శాఖ మంత్రి టి.పద్మారావు గౌడ్‌ ప్రకటించారు. పన్ను చెల్లించలేక గీత కార్మికులు ఇబ్బందులు పడుతున్న విషయా న్ని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. పన్ను రద్దుకు సీఎం అంగీకరించారని, ఈ మేరకు త్వరలోనే జీవో వెలువడుతుందన్నా రు. ఎక్సైజ్‌ అధికారులు గీత కార్మికుల నుంచి పన్ను వసూళ్లు చేయవద్దన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో రూ.1.5 కోట్లతో నిర్మించనున్న గౌడ ఫంక్షన్‌ హాల్‌ భవనానికి మంత్రి టి.హరీశ్‌రావు, ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌తో కలసి పద్మారావు గౌడ్‌ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఏర్పా టు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. చెట్టు పన్ను రద్దు తో రాష్ట్రవ్యాప్తంగా 2.16 లక్షల మంది గీత కార్మి కులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 4,342 సోసైటీలు, 3,688 టీఎఫ్‌టీల్లో 2,16,785 మంది గీత కార్మికులు సభ్యులుగా ఉన్నారు. గీత కార్మికులు తాటి, ఈత చెట్టు ఒక్కోదానికి ఏడాదికి రూరల్‌ ప్రాంతం లో అయితే రూ.25, అర్బన్‌ ప్రాంతంలో రూ.50 పన్ను చెల్లిస్తున్నారు. ఈ పన్ను రూపంలో ప్రభుత్వానికి రూ.15 కోట్లు సమ కూరుతున్నాయి. తమకు ప్రత్యేక నిధులు కేటాయించడంతోపాటు చెట్టు పన్ను రద్దు చేయాలని పలు సందర్భాల్లో గీత కార్మికులు, అనుబంధ సంఘాల నాయకులు ప్రభుత్వా న్ని కోరారు. దీంతో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement