మంత్రికి ఘన స్వాగతం | leaders grand welcome to the padma rao | Sakshi
Sakshi News home page

మంత్రికి ఘన స్వాగతం

Published Thu, Aug 25 2016 11:04 PM | Last Updated on Mon, Sep 4 2017 10:52 AM

మంత్రి పద్మారావుకు స్వాగతం పలుకుతున్న  టీఆర్‌ఎస్‌ నేతలు

మంత్రి పద్మారావుకు స్వాగతం పలుకుతున్న టీఆర్‌ఎస్‌ నేతలు

సికింద్రాబాద్‌: రియో ఒలింపిక్స్‌ సందర్భంగా బ్రెజిల్‌ పర్యటన ముగించుకుని గురువారం ఉదయం నగరానికి చేరుకున్న రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి పద్మారావుగౌడ్‌కు శంషాబాద్‌ విమానాశ్రయంలో టీఆర్‌ఎస్‌ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగరానికి చెందిన బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సింధు పతకం సాధించడం దేశానికే గర్వకారణమన్నారు. భవిష్యత్తులో తెలంగాణ నుంచి మరికొందరు సమర్థులైన క్రీడాకారులను జాతికి అందించేందుకు కృషి చేస్తామన్నారు.

శంషాబాద్‌ నుంచి మంత్రి నివాసం వరకు కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు సామల హేమ, బైరగోని ధనంజన, రాజీవ్‌గుప్తా, కంటోన్మెంట్‌ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్, టీఆర్‌ఎస్‌ నాయకులు కరాటే రాజు, ఆకుల నాగభూషణం, ధరమ్‌రాజ్‌ చౌదరి, కిరణ్‌గౌడ్, కంది నారాయణ, లింగాని శ్రీనివాస్, సత్యనారాయణగౌడ్, స్మితాగౌడ్, తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులు చందుగంగపుత్ర, కాలేరు సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement