టీఆర్‌ఎస్‌ను వీడుతానన్న వార్తల్లో వాస్తవం లేదు | Padma Rao Goud Meets KTR And Rubbishes Reports of Quitting TRS | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ను వీడుతానన్న వార్తల్లో వాస్తవం లేదు

Published Wed, Oct 19 2022 11:15 AM | Last Updated on Wed, Oct 19 2022 12:07 PM

Padma Rao Goud Meets KTR And Rubbishes Reports of Quitting TRS - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ పార్టీని వీడుతున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుగౌడ్‌ మంగళవారం మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలపై ఇరువురి మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన నేపథ్యంలో పద్మారావు కూడా పార్టీని వీడుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరిగింది. 

పద్మారావుతో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి భేటీ కావడం ఈ వార్తలకు ఊతం ఇచ్చింది. అయితే తాను పార్టీని వీడుతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, ఉద్యమ సమయం నుంచి ఉన్న అనుబంధం కొనసాగుతుందని ఈనెల 16న పద్మారావు ఒక ప్రకటన విడుదల చేశారు.

మరోవైపు పద్మారావుగౌడ్‌తో భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని కిషన్‌రెడ్డి ప్రకటించారు. ఇదిలా ఉంటే మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో పద్మారావుగౌడ్‌ కూడా పాల్గొంటారని టీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి. (క్లిక్ చేయండి: బీజేపీలోకి ‘బూర’తో  పాటు మరో ముగ్గురు?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement