తెలంగాణ విద్యుత్ సమస్యకు 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనే కారణమని సీఎం కేసీఆర్ విమర్శించారు. పదేళ్లుగా ఉన్న కరెంట్ సమస్య 3 నెలల్లో ఎలా పరిష్కారం అవుతుందని ఆయన ప్రశ్నించారు. తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే తెలంగాణ శాపంగా మారతాయని అన్నారు. ఏం చేసినా ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. ఆదివారం జరిగిన టీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఉద్యమకారులెవరో ప్రజలకు తెలుసునని అన్నారు. పదవులను తృణప్రాయంగా వదిలిన పార్టీ తమదని గుర్తుచేశారు. రుణమాఫీ చేస్తాం, హామీలన్నీ నెరవేరుస్తామన్నారు.
Published Sun, Oct 5 2014 4:49 PM | Last Updated on Thu, Mar 21 2024 9:00 PM
Advertisement
Advertisement
Advertisement